నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సర్, పీ ఎఫ్ ఖాతాలో నిల్వను 58 సంవత్సరాల వయసు వరకు ఉంచవచ్చని అన్నారు . అయితే వడ్డీ ఫై పన్ను పడుతుంది అన్నారు. ముందస్తు పన్ను చెల్లింపు లేదా వార్షిక మదింపు ద్వారా చెల్లించవచ్చు అన్నారు. అయితే వార్షిక ఆదాయం రూ 2.50 లక్షల లోపు ఉంటే , ఈ వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాలా ? ఒకవేళ ఈపీఎఫ్ఓ (EPFO) పన్ను తగ్గించి ఇస్తే, దానిని రిటర్న్స్ లో చూపించి తిరిగి పొందవచ్చా?

Asked by naresh on

పీ ఎఫ్ ఖాతా లో నెలవారీ జమ కానీ నిల్వ ఫై వచ్చే వడ్డీ ఫై పన్ను మినహాయింపు ఉండదు. ఈ పీ ఎఫ్ ఓ పన్ను తీసివేయదు . మీరు సొమ్ము ఉపసంహరించుకున్నపుడు అధిక మొత్తంలో పన్ను వర్తిస్తుంది కాబట్టి, ప్రతి సంవత్సరం జమ అయిన వడ్డీని, మీ ఆదాయపు పన్ను రిటర్న్ లో ’ ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయం ’ కింద చూపించి, పన్ను మదింపు చేసుకోవచ్చు. ఒకవేళ జమ అయిన వడ్డీ కలిపినా వార్షిక ఆదాయం రూ 2.50 లక్షల లోపు ఉంటె , ఎటువంటి పన్ను చెల్ల్లించాల్సిన అవసరం లేదు .

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%