నిపుణులు ఇచ్చిన సమాధానాలు

మా భార్య కి బ్యాంకులో రూ. 6 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ ఉంది. దీనిపై వడ్డీ కూడా వస్తోంది. తాను ఫారం 15g ఇవ్వాలా? ఆన్లైన్ లో చేయవచ్చా?

Asked by satya on

ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ల‌భించే వ‌డ్డీ ఆదాయంపై మూలం వ‌ద్ద ప‌న్ను (టీడీఎస్) మిన‌హాయింపు కొర‌కు ఫారం 15జీ/హెచ్ ఉప‌యోగిస్తారు. వీటితో ఎవ‌రికి ఎంత పన్ను త‌గ్గింపు ఉంటుందో తెలుసుకుందాం. ఉదాహ‌ర‌ణ‌కు ఒక బ్యాంకులో 8 శాతం వ‌డ్డీతో రూ.6 ల‌క్ష‌ల వ‌ర‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.48,000 వ‌డ్డీ ఆదాయం ల‌భిస్తుంది. ఇంకా ఏ ఇత‌ర ఆదాయం లేక‌పోతే ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం దీనిపై పూర్తి మిన‌హాయింపు ఉంటుంది. అయితే మొద‌ట‌ బ్యాంకు 10 శాతం టీడీఎస్ విధిస్తుంది. అప్పుడు ప్ర‌భుత్వానికి ఆదాయ ప‌న్ను రూపంలో రూ.4800 చెల్లించాల్సి ఉంటుది. ఏడాది చివ‌ర్లో టీడీఎస్ స‌ర్టిఫికెట్ జారీ చేస్తుంది. వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షల కంటే తక్కువ ఉన్నందున పన్ను వర్తించదు, ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేస్తే టీడీఎస్ రీఫండ్ అవుతుంది. ఈ ఫారం ప్ర‌తి సంవ‌త్స‌రం జారీ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు మూడు సంవ‌త్స‌రాల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నా ప్ర‌తి ఏడాది కొత్త‌గా ఫారం 15జీ/హెచ్‌ను స‌మ‌ర్పించాలి. ప్ర‌తి ఏడాది బ్యాంకు ఎఫ్‌డీపై వ‌చ్చిన ఆదాయం రూ.40 వేలు దాటితే(ఏప్రిల్ 1, 2019 నుంచి) టీడీఎస్ మిన‌హాయిస్తుంది. ఒక‌వేళ పాన్ ఇవ్వ‌క‌పోతే 20 శాతం ఉంటుంది. ఆ త‌ర్వాత ఆదాయ పన్న రిట‌ర్నులు దాఖ‌లు చేసిన‌ప్పుడు రీఫండ్ వ‌స్తుంది.

ఫారం 15 జీ 60 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న‌వారికి వ‌ర్తిస్తుంది. 15 హెచ్ 60 ఏళ్ల కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న‌వారు స‌మ‌ర్పించాలి. దీనిని హిందు అవిభాజ్య కుటుంబాలకు (హెచ్‌యూఎప్‌) ఈ స‌దుపాయం లేదు. ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసే లోపు లేదా మొద‌టి వ‌డ్డీ ఆదాయం పొందిన‌ప్పుడు ఏది మొద‌ట జ‌రిగితే ఆ స‌మ‌యంలో ఈ ఫారం అందించాలి.

కొన్ని బ్యాంకులు ఆన్లైన్ లో కూడా ఈ ఫారం ని ఇచ్చే సౌకర్యం కల్పిస్తున్నాయి. ఈ విషయమై మీ బ్యాంకు ని సంప్రదించడం మంచిది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

బేటీ బ‌చావో- బేటీ ప‌డావోలో భాగంగా ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌థ‌కం?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%