నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాలో సిరి, నేను ప్ర‌భుత్వ ఉద్యోగం నుంచి ప‌ద‌వీవిర‌మ‌ణ పొంది ఫించను తీసుకుంటున్నాను. ప్ర‌స్తుతం నా ఫించ‌ను ఖాతాలో రూ. 6 ల‌క్ష‌లు ఉన్నాయి. రూ. 7 ల‌క్ష‌ల‌కు ఎల్ఐసీ ఎండోమెంట్ పాల‌సీ ఉంది. రూ.5 ల‌క్ష‌ల స్టార్ హెల్త్ ఆరోగ్య బీమా తీసుకున్నాను. నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తెకు వివాహం అయ్యింది, కుమారునికి కాలేదు. నేను ఆర్థిక ప్ర‌ణాళిక ఏవిధంగా చేసుకోవాలి?

Asked by Vijaya Laxmi on

మీరు ఇచ్చిన వివ‌రాల ఆధారంగా ఈ కింది సూచ‌న‌ల‌ను ఇస్తున్నాము.

1.ఎల్ఐసీ ఎండోమెంట్ పాల‌సీ 2 నుంచి 3 సంవ‌త్స‌రాల‌లో మెచ్యూర‌వుతుంటే మీరు ఆ పాల‌సీ కొన‌సాగించండి. లేదంటే పాల‌సీని స‌రెండ‌ర్ చేయండి. ఫించును పొందుతున్న‌వారు జీవిత‌బీమాను తీసుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

2.మీ ఆరోగ్య స్థితి ఆధారంగా ప్ర‌స్త‌తం ఉన్న ఆరోగ్య బీమా పాల‌సీపై మ‌రో రూ. 5 ల‌క్ష‌ల‌కు సూప‌ర్ టాప్‌అప్‌ ప్లాన్‌ను తీసుకోండి.

  1. అత్య‌వ‌స‌ర నిధి నిమిత్తం రూ. 2 ల‌క్ష‌లు పొదుపు ఖాతా లో ఉంచుకుని మిగతాది ఫిక్సిడ్ డిపాజిట్ చేయండి.

మీరు సీనియ‌ర్ సిటిజ‌న్ అయితే ఫిక్సిడ్ డిపాజిట్ కి బదులు ఈ కింది వాటిలో ఒక దానిలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు:

1.సీనియ‌ర్ సిటిజ‌న్ల పొదుపు ప‌థ‌కం:

ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు వార్షికంగా 8.70 శాతం, త్రైమాసికంగా చెల్లిస్తారు. జ‌మ చేయ‌వ‌ల‌సిన క‌నీస మొత్తం రూ. 1000, గ‌రిష్టంగా రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు, ఒక సంవ‌త్స‌రం త‌రువాత మెచ్యూరిటీ స‌మ‌యం కంటే ముందుగానే ర‌ద్దు చేసేందుకు అనుమ‌తిస్తారు. ఈ ప‌థ‌కం పోస్టాఫీసులు, అన్ని ప‌బ్లిక్ రంగ బ్యాంకుల‌లోనూ, మూడు ప్రైవేట్ బ్యాంకులు(యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ)లో అందుబాటులో ఉంది.

  1. ప్ర‌ధాన మంత్రి వ‌య వంద‌న యోజ‌న‌:

ఈ ప‌థ‌కాన్ని ఎల్ఐసీ ఆఫ్ ఇండియా అందిస్తుంది. వ‌డ్డీ వార్షికంగా 8.30 శాతం, నెల‌వారీ, త్రైమాసికంగా, ఆరు నెల‌ల‌కు లేదా వార్షికంగా వ‌డ్డీ చెల్లిస్తారు.
క‌నీస పెట్టుబ‌డి రూ. 1.50 ల‌క్ష‌లు, గ‌రిష్ట పెట్టుబ‌డి రూ.15 ల‌క్ష‌లు, కాల‌ప‌రిమితి: 10 సంవ‌త్స‌రాలు, నెల‌వారీ కనీస ఫించ‌ను రూ.1,000, గ‌రిష్టంగా రూ.10,000. 3 సంవ‌త్స‌రాల త‌రువాత రుణం తీసుకునే సౌక‌ర్యం ఉంటుంది.

  1. పోస్టాఫీసు నెల‌వారీ పొదుపు ప‌థ‌కం

ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు వార్షికంగా 7.30 శాతం, నెల‌వారీగా చెల్లిస్తారు, క‌నీస పెట్టుబ‌డి రూ. 1500, ఒక వ్య‌క్తి ఖాతా తీసుకుంటే గ‌రిష్టంగా రూ. 4.50 ల‌క్ష‌లు, జాయింట్‌గా తీసుకుంటే రూ. 9 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ చేయ‌వ‌చ్చు. కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు, పైన తెలిపిన బ్యాంకులలో కూడా ఈ ఖాతాను నిర్వ‌హించుకోవ‌చ్చు.

ఒకవేళ మీరు సీనియ‌ర్ సిటిజ‌న్ కాక‌పోతే మీకు 60 సంవ‌త్స‌రాలు వ‌చ్చే వ‌ర‌కు ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి ఉంచండి. 60 ఏళ్ళ వయసు వచ్చాక పైన తెలిపిన పథకాలలోకి బదిలీ చేసుకోవచ్చు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

రుతుప‌వ‌నాల ప్ర‌భావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందా?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%