నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నా పేరు కుమార్‌, మాది హైద‌రాబాద్‌, నేను రూ.10 ల‌క్ష‌ల రుణం తీసుకుని హైద‌రాబాద్‌లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేయాల‌నుకుంటున్నాను. రుణం తిరిగి చెల్లించేందుకు ఎంత కాల‌ప‌రిమితి ఉండాలి? 20 సంవ‌త్స‌రాల కాలవ్య‌వ‌ధి పెట్టుకోమ‌ని నా బ్ర‌ద‌ర్ సూచిస్తున్నారు. 20 సంవ‌త్స‌రాల‌కు వ‌డ్డీ స‌మానంగా విభ‌జిస్తార‌ని, ఒక‌వేళ రూ.5 ల‌క్ష‌లు ఒకేసారి చెల్లిస్తే భ‌విష్య‌త్తులో వ‌డ్డీ రాయితీ ఉంటుంద‌ని చెబుతున్నారు. అందువల్ల త‌క్కువ లేదా ఎక్కువ కాల‌ప‌రిమితుల‌లో ఏది మంచిది తెలుపగ‌ల‌రు.

కాల‌ప‌రిమితి పెరిగితే, మీరు చెల్లించ‌వ‌ల‌సిన వ‌డ్డీ మొత్తం కూడా పెరుగుతుంది. ఉదాహ‌ర‌ణ‌కి: మీరు 15 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధితో రూ. 10 ల‌క్ష‌ల రుణం, 8....

హాయ్‌, నా పేరు అమ‌ర్‌, నాకు హైద‌రాబాద్‌లో ఒక‌టి, బెంగుళూరులో మ‌రొక‌టి, మొత్తానికి రెండు ఇళ్ళు ఉన్న‌యి. మేము ప్ర‌స్తుతం బెంగుళూరులో ఉంటున్నాము. బ‌డ్జెట్ 2019-20 ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు కోసం రెండు గృహ‌రుణాల‌ వ‌డ్డీని చూపించ‌వ‌చ్చా? ఒక‌వేళ అవును అయితే ఏ సెక్ష‌న్ కింద‌, ఏవిధంగా రెండ‌వ ఇంటిని చూపించాలి. నేను హైద‌రాబాద్‌లో ఉన్న ఇంటికి ( 8.25 శాతం వ‌డ్డీ రేటు చొప్పున‌) దాదాపు రూ.1 ల‌క్ష, బెంగుళూరులో ఉన్న ఇంటికి( 9.25 శాతం వ‌డ్డీ రేటు చొప్పున‌) దాదాపు 2.2 ల‌క్ష‌లు వ‌డ్డీ చెల్లిస్తున్నాను, హైద‌రాబాద్‌లో ఉన్న ఇంటిపై టాప్అప్‌లోన్ తీసుకుని, బెంగుళూరులో ఉన్న ఇంటిపై రుణం చెల్లించ‌డం మంచిదేనా? తెలుప‌గ‌ల‌రు.

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 24బీ ప్ర‌కారం రెండు గృహ రుణాల‌ వ‌డ్డీపై మిన‌హాయింపు ప‌రిధి రూ. 2 లక్షలు. 2018-19 ఆర్ధిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఆదాయ ...

డియ‌ర్ సిరి, నేను ప్ర‌భుత్వ ఉద్యోగిని. నా స్థూల ఆదాయం రూ. 36,928, నిక‌ర ఆదాయం రూ. 31,660. సీపీఎస్‌కి రూ.3288, టీఎస్‌జీఎల్ఐ కింద రూ.1000, పీటీ కి రూ.200, జీఐఎస్ కి రూ. 30 డిడ‌క్ట్ అవుతున్నాయి. పీఎల్ఐ కి రూ.1000. ఎల్ఐసీకి రూ.4,600 చెల్లిస్తున్నాను. ఒక సంవ‌త్స‌రం వ‌య‌సు ఉన్న నా పాప కోసం రూ.1000 సుక‌న్య స‌మృద్ది యోజ‌న‌లో డిపాజిట్ చేయాల‌నుకుంటున్నాను. నేను వ‌డ్డీలేకుండా తీసుకున్న రుణం రూ.5.50 ల‌క్ష‌లు ఉంది. వ్య‌క్తిగ‌త రుణం తీసుకుని నా మొత్తం రుణాల‌ను చెల్లించాల‌నుకుంటున్నాను. నేను నా రుణాల‌ను తీర్చి ఇల్లు లేదా ప్లాట్‌ కొనుగోలు చేసేందుకు ఏమి చేయాలి?

ప్రారంభ రోజుల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డం వ‌ల్ల కాపౌండ్ వ‌డ్డీని పొంద‌వ‌చ్చు. మీ వార్షిక ఆదాయానికి క‌నీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా ట‌ర్మ్ పాల‌సీని త...

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు క‌నీస వ‌య‌సెంత‌?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%