అమెజాన్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్..

డెలివరీ సమయాన్ని రెండు రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు

అమెజాన్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్..

ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. తమ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వారు, తమ ఉద్యోగానికి రాజీనామా చేసి డెలివరీ ఏజెన్సీని ప్రారంభించినట్లైతే, వారికి 10 వేల డాలర్ల మొత్తాన్ని అందించడంతో పాటు అమెజాన్ ప్యాకేజీలను పంపిణీ చేయడంలో సహాయం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, అమెజాన్‌ డెలివరీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి, డెలివరీ సమయాన్ని రెండు రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. అలాగే రాజీనామా చేసిన ఉద్యోగికి మూడు నెలల జీతాన్ని కూడా అందిస్తారు. అయితే, ఈ పథకం కింద రాజీనామా చేసిన ఉద్యోగులు నీలి రంగు వ్యాన్‌ను కొనుగోలు చేసి, దానిపై అమెజాన్‌ స్మైలీ బొమ్మను అమర్చాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ పార్ట్‌ టైమ్‌, ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులతో పాటు వేర్ హౌస్ లో పనిచేసే ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. ఆహార ఉత్పత్తుల విభాగంలో పని చేసే ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. డెలివరీ సమయాన్ని తగ్గించి, వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ పథకాన్ని అమెజాన్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అమెజాన్ తమ ఉత్పత్తులను డెలవరీ చేయడానికి యూపీఎస్‌, పోస్టాఫీసులు, కొరియర్ సర్వీసులను వినియోగించుకుంది. ఇప్పుడు కొత్తగా ఉద్యోగులు ప్రారంభించబోయే డెలివరీ ఏజెన్సీ ద్వారా తమ ఉత్పత్తులను మరింత వేగంగా డెలివరీ చేయనుంది. ఈ విధంగా చేయడం ద్వారా అమెజాన్‌కు పెద్ద మొత్తంలో నిర్వహణ వ్యయం కూడా మిగలనుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly