రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలో ఏది మంచిది?

బ్యాంకులలో ఆర్డీల కాలపరిమితి ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది

రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలో ఏది మంచిది?

రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీలు) అధునాతన టర్మ్ డిపాజిట్ల రూపంలో ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) మాదిరిగా ఒకేసారి చెల్లింపు కాకుండా, వరుస క్రమానుగత చెల్లింపుల ద్వారా డిపాజిట్లు చేస్తారు. ఉద్యోగస్తులు, నెలవారీ ఆదాయం పొందే వారు ప్రతి నెలా తమ రికరింగ్ డిపాజిట్ ఖాతాలో స్థిరమైన మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఎఫ్డీలకు వర్తించే వడ్డీ రేటును సంపాదిస్తుంది. ఒక ఆర్డీ ఖాతాలో డిపాజిట్లు రికరింగ్ ప్రాతిపదికన జరపవచ్చు, టర్మ్ ముగిసే ముందు చేసే ఉపసంహరణలపై పరిమితులు ఉన్నాయి. బ్యాంకులలో ఆర్డీల కాలపరిమితి ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది, కానీ పోస్ట్ ఆఫీస్లు ఐదు సంవత్సరాల కాలపరిమితితో మాత్రమే ఆర్డీలను అందిస్తాయి. ముందస్తు ఉపసంహరణల కారణంగా తక్కువ రాబడులు పొందే అవకాశం ఉంటుంది, ఖాతాలో నగదును డిపాజిట్ చేయనట్లయితే, అది ఖాతా మూసివేతకు దారి తీయవచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్స్ లో వర్తించే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) మాదిరిగా ఉంటుంది, అయితే ఆర్డీల విషయంలో, పీరియడ్ చెల్లింపు వ్యవస్థ లక్ష్యం ప్రమాదాన్ని తగ్గించడం లేదా రూపాయి-ధర సగటు ద్వారా మొత్తం పెట్టుబడి కంటే ఎక్కువ రాబడిని ఉత్పత్తి చేయడం కాదు. ఆర్డీల విషయంలో రాబడి రేటు తగ్గుముఖం పట్టడం వలన, నష్ట భయం తక్కువగా ఉండే వ్యక్తులు చెల్లింపులను సౌకర్యవంతంగా చేయడమే పీరియాడిక్ డిపాజిట్ల లక్ష్యం.

ఏదేమైనప్పటికీ, నెలవారీ ఆదాయం పొందే వారు నిర్దిష్ట సమయంలో పెద్ద మొత్తంలో రాబడులను పొందడానికి ఆర్డీ అనేది ఒక మంచి పెట్టుబడి సాధనం. కొంత మంది ఆర్డీ ఖాతాలో నెలవారీ డిపాజిట్లు చేయడం ద్వారా బీమా ప్రీమియం వంటి వార్షిక చెల్లింపులను చేయడం కోసం నగదును సేకరించేందుకు ఆర్డీలను వినియోగిస్తుంటారు. అలాగే వార్షిక ప్రీమియం చెల్లింపు కోసం డిస్కౌంట్లను పొందటం, మొత్తం డిపాజిట్లపై వడ్డీని సంపాదించడం చేస్తుంటారు.

పోస్ట్ ఆఫీస్ ఆర్డీలు చాలా ఎక్కువగా అనగా సంవత్సరానికి 7.3 శాతం వడ్డీ రేట్లతో పాటు, మూడు నెలలకు ఒకసారి కంపౌండింగ్ ను అందిస్తున్నాయి. అలాగే ఇవి సావరిన్ గ్యారంటీ కారణంగా సురక్షితమైనవి, కానీ మీకు కేవలం ఐదు సంవత్సరాల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, మీరు ఆన్ లైన్ ద్వారా పీరియాడిక్ పెట్టుబడుల డిపాజిట్లను చేయలేరు. కేవలం నగదు లేదా చెక్కుల ద్వారా మాత్రమే వాయిదా మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

మరోవైపు, ఆర్డీ ఖాతాల కాలపరిమితిని ఎన్నుకునే అనేక ఎంపికలు బ్యాంకుల్లో అందుబాటులో ఉన్నాయి, అలాగే ఆన్ లైన్ ద్వారా పెట్టుబడులు పెట్టే సదుపాయం కూడా మీకు లభిస్తుంది. ఆర్డీ ఖాతా వడ్డీ రేట్లు బ్యాంకు, కాలపరిమితి ఆధారంగా మారుతూ ఉంటాయి. దాని కోసం కింది పట్టికను పరిశీలించండి. తాజా వడ్డీ రేట్ల కోసం బ్యాంకు ని సంప్రదించడం మంచిది.

RD-INT-RATES.jpg

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly