రెడ్మీ 8 స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..

రెడ్మీ 8 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది

రెడ్మీ 8 స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం షామీ, మరో స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దాని పేరు రెడ్మీ 8. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఒకటి 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ కాగా, మరొకటి 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్. ఈ ఫోన్ ఓఎన్ వైఎక్స్ బ్లాక్, రూబీ రెడ్, సాఫైర్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఇక రెడ్మీ 8 ధర విషయానికి వస్తే… 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7999 గా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 8999 గా సంస్థ నిర్ణయించింది.

ఇటీవల షామీ 100 మిలియన్ స్మార్ట్ ఫోన్ మార్కును చేరుకోవడం, అలాగే భారత మార్కెట్లో వరుసగా ఎనిమిదో త్రైమాసికంలో కూడా షామీ నంబర్ వన్ స్థానంలో నిలవడంతో మొదటి 50 లక్షల 4 జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ స్మార్ట్ ఫోన్లను రూ. 7999 కే వినియోగదారులకు విక్రయించనున్నారు. ఈ ఫోన్ మొదటి సేల్ అక్టోబర్ 12 అర్థరాత్రి 12:01 గంటలకు ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కామ్ లలో జరగనుంది.

రెడ్మీ 8 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

  • 6.22 ఇంచ్ టచ్ స్క్రీన్
  • క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టం
  • 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
  • వెనకవైపు 12+2 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్
  • ముందువైపు 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
  • 18W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ
  • ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్ లాక్

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly