రెడ్మీ కే20, కే20 ప్రో ఫోన్లను విడుదల చేసిన షియామి..

రెండు ఫోన్లు 3డీ గ్రేడియంట్ ఫినిష్ డిజైన్ ను కలిగి ఉండడంతో పాటు ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంటాయి

రెడ్మీ కే20, కే20 ప్రో ఫోన్లను విడుదల చేసిన షియామి..

చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ షియామీ రెడ్మీ కే20, కే20 ప్రో పేరుతో రెండు సరికొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ స్మార్ట్ ఫోన్ లను చైనాలో విడుదల చేసింది. వన్ ప్లస్, హువాయ్, హానర్, వివో, ఒప్పో వంటి బ్రాండ్లలను లక్ష్యంగా చేసుకుని షియామి ఈ స్మార్ట్ ఫోన్స్ లను విడుదల చేసింది. రెడ్మీ కే20, కే20 ప్రో రెండూ దాదాపు ఒకరకమైన ఫీచర్స్ తో అందుబాటులో ఉండనున్నాయి. రెండు ఫోన్లు 20 ఎంపీ రిజల్యూషన్ తో పాప్-అప్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉండడంతో పాటు పూర్తి ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లే ను కలిగి ఉంటాయి. వీటిలో 4000 ఎంఏహెచ్ బ్యాటరీలను అమర్చారు. రెండు ఫోన్లు 3డీ గ్రేడియంట్ ఫినిష్ డిజైన్ ను కలిగి ఉండడంతో పాటు ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంటాయి. అలాగే రెండు ఫోన్ లలో ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ల ధర విషయానికి వస్తే, రెడ్మీ కే20 (6 జీబీ ర్యాం - 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) ధర 1999 యువాన్ గా ఉంది. అంటే మన కరెన్సీ లో దీని విలువ రూ. 20,154. అదే రెడ్మీ కే20 (6 జీబీ ర్యాం - 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) ధర 2099 యువాన్ గా ఉంది. అంటే మన కరెన్సీ లో దీని విలువ రూ. 21,100. ఈ ఫోన్లు జూన్ 6వ తేదీ ఉదయం 10.00 గంటల నుంచి చైనాలో విక్రయించనున్నారు. ఫోన్ ప్రీ-బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. అదే విధంగా రెడ్మీ కే20 ప్రో (6 జీబీ ర్యాం - 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) ధర 2499 యువాన్ గా ఉంది. అంటే మన కరెన్సీ లో దీని విలువ రూ. 25,196. అదే రెడ్మీ కే20 ప్రో (6 జీబీ ర్యాం - 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) ధర 2599 యువాన్ గా ఉంది. అంటే మన కరెన్సీ లో దీని విలువ రూ. 26,203. అలాగే రెడ్మీ కే20 ప్రో (8 జీబీ ర్యాం - 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) ధర 2999 యువాన్ గా ఉంది. అంటే మన కరెన్సీ లో దీని విలువ రూ. 30,236.

వీటితో పాటు 14 ఇంచుల రెడ్మీ బుక్ ల్యాప్ టాప్, బడ్జెట్ ఫోన్ అయిన రెడ్మీ 7ఏ స్మార్ట్ ఫోన్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ ఫోన్లు మన దేశంలో ఎప్పుడు విడుదల అవుతాయో సంస్థ ప్రకటించలేదు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం అతి త్వరలో ఈ స్మార్ట్ ఫోన్స్ మన దేశంలో కూడా విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

రెడ్మీ కే20 ప్రో ఫీచర్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

 • 3డీ గ్రేడియంట్ డిజైన్ గ్లాస్, మెటల్ బాడీ
 • 6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (2340 x 1080) రిసల్యూషన్ డిస్ ప్లే
 • 91 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో
 • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్
 • 6 జీబీ ర్యాం + 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యాం + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
 • గేమ్ టర్బో 2.0 మోడ్
 • వెనకవైపు 48 ఎంపీ+8 ఎంపీ+13 ఎంపీ ట్రిపుల్ కెమెరా
 • ముందు వైపు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
 • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
 • ఆండ్రాయిడ్ ఫై ఆపరేటింగ్ సిస్టం
 • టైపు - సీ ఛార్జింగ్ పోర్ట్

రెడ్మీ కే20 ఫీచర్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

 • 3డీ గ్రేడియంట్ డిజైన్ గ్లాస్, మెటల్ బాడీ
 • 6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (2340 x 1080) రిసల్యూషన్ డిస్ ప్లే
 • 91 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో
 • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్
 • 6 జీబీ ర్యాం + 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యాం + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
 • గేమ్ టర్బో 2.0 మోడ్
 • వెనకవైపు 48 ఎంపీ+8 ఎంపీ+13 ఎంపీ ట్రిపుల్ కెమెరా
 • ముందు వైపు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
 • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
 • ఆండ్రాయిడ్ ఫై ఆపరేటింగ్ సిస్టం
 • టైపు - సీ ఛార్జింగ్ పోర్ట్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly