రెడ్మీ నోట్ 7ఎస్ వచ్చేసింది..

వెనకవైపు గ్లాస్ ప్యానెల్ ను కలిగి ఉండడంతో పాటు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది

రెడ్మీ నోట్ 7ఎస్ వచ్చేసింది..

చైనాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం షియామీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీని పేరు రెడ్మీ నోట్ 7ఎస్, ఇది 48 మెగాపిక్సెల్ కెమెరాతో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఇది షియామీ నుంచి 48 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్న రెండవ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ వెనకవైపు గ్లాస్ ప్యానెల్ ను కలిగి ఉండడంతో పాటు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది. షియామీ రెడ్మీ నోట్ 7ఎస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఒకటి 3GB + 32GB, రెండవది 4GB + 64GB. ఇక ధర విషయానికి వస్తే, 3GB + 32GB మోడల్ ధర రూ .10,999 కాగా, 4GB + 32GB మోడల్ ధర రూ.12,999 గా ఉంది. ఈ ఫోన్ సాఫైర్ బ్లూ, రూబీ రెడ్, ఒనిక్స్ బ్లాక్ కలర్స్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. రెడ్మీ నోట్ 7 ఎస్ మే 23, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, ఎంఐ. కామ్ లలో అందుబాటులో ఉండనుంది. అలాగే ఎంఐ హోమ్స్, ఆఫ్ లైన్ స్టోర్లలో మాత్రం మే 23 నుంచి అందుబాటులో ఉండనుంది.

షియామీ రెడ్మీ నోట్ 7ఎస్ ఫీచర్స్ విషయానికి వస్తే…

 • 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డాట్ నాచ్ డిస్ ప్లే
 • గోరిల్లా గ్లాస్ 5 ( ముందు, వెనకవైపు)
 • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
 • 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్
 • 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్
 • డ్యూయల్ సిమ్ ( హైబ్రిడ్ స్లాట్)
 • 48 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరా
 • 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
 • ఫింగర్ ప్రింట్ సెన్సార్, AI ఫేస్ అన్ లాక్
 • టైప్ - సీ 4.0 ఛార్జింగ్ పోర్ట్
 • 4000 mAh బ్యాటరీ

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly