ఇప్ప‌టికీ ఎస్‌బీఐ మాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులనే ఉప‌యోగిస్తున్నారా?

కొత్త ఈఎంవీ చిప్ కార్డు కోసం హోమ్ బ్రాంచ్ ను సందర్శించి లేదా ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

ఇప్ప‌టికీ ఎస్‌బీఐ మాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులనే ఉప‌యోగిస్తున్నారా?

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కస్టమరా? మీరు ఇంకా మీ ఎస్బీఐ మాగ్నెటిక్ స్ట్రిప్స్ ఏటీఎం కార్డులను మరింత సురక్షితమైన ఈఎంవీ చిప్ గా మార్చుకోలేదా? అయితే మీ పాత కార్డును కొత్త ఈఎంవీ చిప్ కార్డుతో అప్‌డేట్ చేసుకోడానికి బ్యాంక్ మీకు మరో అవకాశం కల్పించింది. 31 డిసెంబర్ 2019 కల్లా ఖాతాదారులు తమ మాగ్నెటిక్ స్ట్రిప్స్ ఏటీఎం-కమ్-డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్‌ కార్డులతో అప్‌డేట్ చేసుకోమని ఎస్‌బీఐ తెలిపింది. దాని కోసం మీరు హోమ్ బ్రాంచ్ ను సందర్శించి లేదా ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, ఎస్బీఐ తన వినియోగదారుల మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులను ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత కార్డులతో భర్తీ చేసింది.

ప్రియమైన ఖాతాదారులారా, మీ మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులను ఉచితంగా ఆన్‌లైన్‌లో లేదా మీ హోమ్ బ్రాంచ్‌ ని సందర్శించడం ద్వారా ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత డెబిట్ కార్డుగా మార్చుకోవచ్చు. దాని కోసం మీరు ఎలాంటి చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ వద్ద నుంచి చార్జీలను వసూలు చేసినట్లయితే, దానికి తగిన రుజువును బ్యాంకు బ్రాంచ్‌లో చూపించి, వాపసు కోసం అభ్యర్థించవచ్చునని ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

అందువలన ఇప్పుడే మీ హోమ్ బ్రాంచ్‌ ను సందర్శించి మీ మాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులను మరింత సురక్షితమైన ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత ఎస్బీఐ డెబిట్ కార్డుగా మార్చుకోడానికి దరఖాస్తు చేసుకోండి, అలాగే ఈ ప్రక్రియను 31 డిసెంబర్, 2019 కల్లా పూర్తి చేయాలని ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు చిప్ ఆధారిత కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు, దయచేసి మీ ప్రస్తుత చిరునామాను ఖాతాలో అప్ డేట్ చేసుకున్నారో లేదో నిర్ధారించుకోండి. ఆన్‌లైన్‌ ద్వారా కార్డును దరఖాస్తు చేసుకోడానికి మొబైల్ నంబర్ తప్పనిసరి.

ఆన్‌లైన్‌ ద్వారా కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో మీకోసం కింద తెలియచేస్తున్నాము…

  • ముందుగా ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.

  • పైన ఉన్న ఆప్షన్స్ లో ఈ-సర్వీసెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, ఏటీఎం కార్డ్ సర్వీసులను ఎంచుకోండి.

  • అనంతరం రిక్వెస్ట్ ఏటీఎం / డెబిట్ కార్డుపై క్లిక్ చేయండి.

  • ధృవీకరించడానికి దయచేసి మీ ఆప్షన్ ను ఎంచుకోండి. అనంతరం యూజింగ్ వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) పై క్లిక్ చేయండి.

  • మీ మొబైల్‌ కి వచ్చిన ఓటీపీని నమోదు చేయండి.

  • అనంతరం ఖాతాను ఎంచుకోండి. కార్డులోని పేరు, కార్డు టైపు వంటి వివరాలను నమోదు చేయండి.

  • తరువాత నిబంధనలు, షరతులపై క్లిక్ చేసి, ఆపై సబ్మిట్ పై క్లిక్ చేయండి.

  • సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత, మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కి 7 నుంచి 8 పని దినాలలో మీ డెబిట్ కార్డును అందుకుంటారని ఒక సందేశం మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly