ఆరోగ్య‌బీమా రీఛార్జ్.. రీస్టోర్.. ఏది మంచిది?

ఆరోగ్య‌బీమాలో ఆప్ష‌న్లు రీఛార్జ్.. రీస్టోర్.. గురించి తెలుసుకుందామా.

ఆరోగ్య‌బీమా రీఛార్జ్.. రీస్టోర్.. ఏది మంచిది?

ఆరోగ్య బీమా ప‌థ‌కాలు ప్ర‌తీ ఒక్క‌రూ తీసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. పెరుగుతున్న వైద్య‌ ఖ‌ర్చుల‌ను దృష్టిలో ఉంచుకుని త‌గు మొత్తానికి ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోవ‌డం మంచిది. వ్య‌క్తిగ‌త లేదా కుటుంబ ఆరోగ్య బీమా పాల‌సీల్లో ఏదైనా తీసుకోవ‌చ్చు. పాల‌సీదారుల‌కు ఆరోగ్య‌ బీమా కంపెనీలు వివిధ ర‌కాల ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నాయి. వీటిలో బీమా హామీ మొత్తాన్ని రీఛార్జ్ చేసుకునే ఫీచ‌ర్, రీస్టోర్ చేసుకునే ఫీచ‌ర్ రెండు ర‌కాలున్నాయి. పేర్లు విన‌డానికి ఒకే విధంగా ఉన్న‌ప్ప‌టికీ రెండింటికీ తేడా ఉంది.

రిఛార్జ్ చేసుకోవ‌డం:

రీఛార్జ్ అంటే మొత్తం బీమా హామీ మొత్తాన్ని భ‌ర్తీ చేయ‌డం. సాధార‌ణంగా ఏదైనా ఆరోగ్య బీమా క్ల‌యిమ్ చెల్లిస్తే, బీమా సంస్థ‌ పాల‌సీదారుని బీమా హామీ మొత్తాన్ని తిరిగి భ‌ర్తీచేస్తుంది.

ఉదాహ‌ర‌ణకు అనంత్ త‌న కుటుంబ‌మంత‌టికీ వ‌ర్తించేలా ఫ్యామిలీ ప్లోట‌ర్ పాల‌సీని తీసుకున్నారు. ఆ సంవ‌త్స‌రం అనంత్ వైద్యం కోసం ఆసుప‌త్రి లో చేరారు. మొత్తం ఖ‌ర్చు రూ.3.5 ల‌క్ష‌లు అయింది. అదే సంవ‌త్స‌రం అత‌ని భార్య కూడా వైద్యం కోసం ఆసుప‌త్రిలో చేరితే మొత్తం ఖ‌ర్చు రూ.2 ల‌క్ష‌లు అయింది. అనంత్ క్ల‌యిమ్ చేసుకున్న త‌రువాత బీమా హామీ తిరిగి భ‌ర్తీ అవుతుంది. కాబ‌ట్టి అత‌ని భార్య వైద్యానికి అయ్యే ఖ‌ర్చు పాల‌సీ ద్వారా క్ల‌యిమ్ చేసుకోవ‌చ్చు.

అయితే వీటిలో కొన్ని ర‌కాల మిన‌హాయింపులు ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఒకే ర‌క‌మైన అనారోగ్యం\గాయాలు వంటి వాటికి ఆ పాల‌సీదారుడు ఇదివ‌ర‌కూ ఆసుప‌త్రిలో చేరిన‌ట్ట‌యితే వాటికి అదే సంవ‌త్స‌రంలో పాల‌సీ వ‌ర్తించ‌దు. రీఛార్జ్ చేసే మొత్తం బీమా హామీ మొత్తానికి మించ‌కూడ‌దు. రీఛార్జ్ ద్వారా చేసుకునే మొత్తం ఆ సంవ‌త్స‌రం మొత్తం వినియోగించుకోవ‌చ్చు. రీఛార్జ్ చేసిన మొత్తం మిగిలిన‌ట్ట‌యితే మ‌రుస‌టి ఏడాదికి బ‌దిలీ చేసుకునే అవ‌కాశం ఉండ‌దు.

రీస్టోర్ చేసుకోవ‌డం:

పాల‌సీ బీమా హామీ మొత్తాన్ని మించి వైద్య ఖ‌ర్చులు అయితే రీస్టోర్ ఆప్ష‌న్ ద్వారా ఆ పాల‌సీకి బీమా హామీ మొత్తం భ‌ర్తీ అవుతుంది.

ఉదాహ‌ర‌ణ‌కు మ‌హేశ్ త‌న కుటుంబం మొత్తానికి వ‌ర్తించేలా ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీని తీసుకున్నారు. బీమా హామీ మొత్తం రూ.5 ల‌క్ష‌ల‌కు తీసుకున్నారు. ఆయ‌న అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరితే వైద్య ఖ‌ర్చు రూ.3.5 ల‌క్ష‌లు అయింది. బీమా హామీ మొత్తం నుంచి వైద్య ఖ‌ర్చు చెల్లించ‌గా మిగిలేది రూ.1.5 ల‌క్ష‌లు. అదే సంవ‌త్స‌రంలో త‌న భార్య ఆసుప‌త్రిలో చేరి వైద్యం తీసుకోవ‌డం ద్వారా వైద్య ఖ‌ర్చు రూ.2 ల‌క్ష‌లు అయింది. సాధార‌ణ పాల‌సీల్లో అయితే ఆ స‌మ‌యంలో రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రీస్టోర్ ఆప్ష‌న్ ఉంటే మొద‌టి సారి వైద్య ఖ‌ర్చులైన 3.5 ల‌క్ష‌లు రీస్టోర్ అవుతుంది. కాబ‌ట్టి వారు చేతి డ‌బ్బు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

ఉదాహ‌ర‌ణ‌కు మ‌హేశ్ త‌న కుటుంబం మొత్తానికి వ‌ర్తించేలా ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీని తీసుకున్నారు. బీమా హామీ మొత్తం రూ.5 ల‌క్ష‌ల‌కు తీసుకున్నారు. ఆయ‌న అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరితే వైద్య ఖ‌ర్చు రూ.3.5 ల‌క్ష‌లు అయింది. బీమా హామీ మొత్తం నుంచి వైద్య ఖ‌ర్చు చెల్లించ‌గా మిగిలేది రూ.1.5 ల‌క్ష‌లు. అదే సంవ‌త్స‌రంలో త‌న భార్య ఆసుప‌త్రిలో చేరి వైద్యం తీసుకోవ‌డం ద్వారా వైద్య ఖ‌ర్చు రూ.2 ల‌క్ష‌లు అయింది. ఆ స‌మ‌యంలో వారు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్క‌డే రీస్టోర్ ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ రీస్టోర్ ఆప్ష‌న్ ద్వారా వ‌చ్చే మొత్తం ఆ ఏడాది వ‌ర‌కే వినియోగించుకోవ‌చ్చు. మిగిలి ఉన్న మొత్తం ఆ మ‌రుస‌టి ఏడాదికి బ‌దిలీ అవ్వ‌దు

రెండింటిలో ఏది మంచిది?

ఆరోగ్య బీమా ప‌థ‌కంలో ప‌లు ర‌కాల నిబంధ‌న‌లు ఉంటాయి. కొన్నింటికి వెయిటింగ్ పీరియ‌డ్ , ప‌రిమితులు మొద‌లైన‌వి ఉంటాయి. రెండింటిలో ఏది పాల‌సీదారునికి ప్ర‌యోజ‌నం చేకూరుస్తుందంటే రీఛార్జ్ విధాన‌మే మంచిద‌ని చెప్పాలి.

బీమా పాల‌సీ హామీ మొత్తానికి తోడుగా రీస్టోర్ లేదా రీఛార్జ్ ఆప్ష‌న్ తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. మ‌రొక‌టి ఏంటంటే ఈ రెండింటిలోనూ బీమా హామీ మొత్తం పూర్తిగా వినియోగించిన త‌రువాత మాత్ర‌మే అద‌న‌పు మొత్తాన్ని వినియోగించే వీలుంటుంది. రీఛార్జ్ ఆప్ష‌న్ లో బీమా హామీ మొత్తం కంటే ఎక్కువైతే బీమా సంస్థ చెల్లింపులు చేస్తుంది. ఒకే ర‌క‌మైన అనారోగ్యం ఒకే ర‌క‌మైన అనారోగ్యం సంవ‌త్స‌రంలో రెండో సారి వినియోగించుకుంటే ఇది వ‌ర్తించ‌దు. ఆ మొత్తం కుటుంబంలో వేరొక స‌భ్యునికి ఉప‌యోగించుకోవ‌చ్చు. కాబ‌ట్టి రీఛార్జ్ ఆప్ష‌న్ ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీల‌కు అనుకూలంగా ఉంటుంది.

బీమా రీస్టోర్ ఆప్ష‌న్ తో బీమా హామీ మొత్తం వినియోగించిన అనంత‌రం భ‌ర్తీ అవుతుంది. ఇది వ్య‌క్తిగ‌త లేదా ఫ్యామిటీ ఫ్లోట‌ర్ పాల‌సీ దేనికైనా స‌రే అనుకూలంగా ఉంటుంది. ఈ ఆప్ష‌న్ ద్వారా వినియోగించిన మొత్తం భ‌ర్తీ అయి కుటుంబ‌స‌భ్యులు వినియోగించ‌వ‌చ్చు బీమా పాల‌సీ హామీ మొత్తం, ఆప్ష‌న్లు త‌మ ఆరోగ్య అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly