పెట్టుబ‌డుల‌పై రాబ‌డి అంచ‌నా

దీర్ఘకాలం పాటు చేయడం వలన చక్రవడ్డీ ప్రభావంతో మంచి రాబడి పొందొచ్చు. దీర్ఘకాలంలో మనం చేసే పొదుపు కన్నా , రాబడి మొత్తం ఎక్కువగా ఉంటుంది.

పెట్టుబ‌డుల‌పై రాబ‌డి అంచ‌నా

మదుపు అనేది ఒక నిరంతర ప్రక్రియ. నేటి సంపాదనలో కొంత మొత్తాన్ని రేపటి కోసం మదుపు చేయాలి. ఎందుకంటే రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఇవాళ ఎక్కువ డబ్బులు ఉన్నాయని ఖర్చు చేస్తే, రేపు ఏ అవసరం ఎలా ఉంటుందో తెలియదు. అప్పు ఇచ్చే వాళ్ళు కూడా వెనకడుగు వేస్తారు. ఎందుకంటే, నీ డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చుపెట్టుకున్నావు.

మదుపు చేయడానికి అనేక ప‌థ‌కాలు ఉన్నాయి. మన ఆర్ధిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మదుపు చేయాల్సి ఉంటుంది. ఒకసారి మొదలుపెట్టిన తరువాత మధ్యలో ఆపేయడం వలన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేము. కొద్ది మొత్తంతోనైనా మదుపు చేయాలి. దీర్ఘకాలం పాటు చేయడం వలన చక్రవడ్డీ ప్రభావంతో మంచి రాబడి పొందొచ్చు. దీర్ఘకాలంలో మనం చేసే పొదుపు కన్నా , రాబడి మొత్తం ఎక్కువగా ఉంటుంది.

మనం చేసే ప్రతి పెట్టుబడి ముందు భద్రత, సమయానికి చేతికి సొమ్ము అందడం (లిక్విడిటీ) , రాబడి, ఆర్ధిక లక్ష్యం చేరుకోటానికి ఉన్న సమయం, మన రిస్క్ సామర్ధ్యం, పన్ను ప్రభావం వంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

అలాగే మదుపు చేసే పధకం ముఖ్య లక్షణాలు కూడా తెలుసుకోవాలి.

కిందటి కధానాలలో కొంత మొత్తంతో మొదలు పెట్టి ప్రతి సంవత్సరం కొంత శాతం పెంచుకుంటూ వెళితే వివిధ కాలపరిమితులకు ఎంత మొత్తం లభిస్తుందో చూసాము.
అలాగే నెలకు రూ. 2,000 లతో మొదలుపెట్టి, ప్రతి ఏడాది నిర్దిష్ట మొత్తంతో పెంచుకుంటూ మదుపు చేస్తే, 10 ఏళ్లకు 8%, 10% , 12% రాబడి అంచనాతో ఎంత జమ అవుతుందో, అందులో మన పెట్టుబడి ఎంతో , రాబడి ఎంతో తెలుసుకున్నాము.

ఈ కింది పట్టిక ద్వారా 20 ఏళ్లకు మదుపు చేస్తే ఎంతో మొత్తం జమ అవుతుందో తెలుసుకుందాము. ప్రస్తుతం యుక్త వయసులో ఉన్నవారు తప్పక తెలుసుకోవలసినది. ఎందుకంటే వారికి 20 ఏళ్ల తరువాత మధ్య వయస్కులు అవుతారు. అప్పటికి ఎంత సొమ్ము చేతికి అందుతుందో తెలియడం వలన తగిన విధంగా ప్రణాళిక వేసుకోవచ్చు.

నెలకు రూ. 2,000 లతో మదుపు మొదలు పెట్టి , ప్రతి ఏడూ నెలకు రూ. 500, రూ. 1000, రూ. 1500,రూ. 2000,రూ. 2500, రూ.3000 లతో పెంచుకుంటూ 20 ఏళ్ళు మదుపు చేస్తే 8 శాతం, 10శాతం, 12శాతం అంచనా రాబడి తో ఎంత జమ అవుతుందో చూద్దాం.
Table 4.jpg

ఉదా : శేఖర్ నెలకు రూ. 2,000 లతో మొదలు పెట్టి , ప్రతి ఏడూ రూ. 500 పెంచుకుంటూ మదుపు చేస్తే 8శాతం రాబడి అంచనాతో 20 ఎల్లా తరువాత 32,47,887 జమ అవుతుంది. ఈ కాలంలో అతను చేసిన పెట్టుబడి రూ. 16,20,000. నికర రాబడి రూ 16,27,887.
అదే అతను నెలకు రూ. 2,000 లతో మొదలు పెట్టి ఏడాదికి రూ . 1,000 పెంచుకుంటూ మదుపు చేస్తే 20 ఏళ్ల తరువాత జమ అయ్యే మొత్తం రూ 53,09,879.
ఈ కాలంలో అతను చేసిన పెట్టుబడి రూ. 27,60,000. నికర రాబడి రూ 25,49,879.

రికరింగ్ డిపాజిట్, ఫిక్సెడ్ డిపాజిట్, చిన్న పొదుపు పధకాలు 8శాతం వరకు రాబడినిస్తాయి . కొంత మొత్తం ఈక్విటీ లలో , కొంత మొత్తం డెట్ లలో మదుపు చేసే ఎన్పీఎస్ వంటి ప‌థ‌కంలో 10 శాతం వరకు రాబడి ఆశించవచ్చు. ఇది పదవీవిరమణ నిధికి మంచి పధకం. 10శాతం అంచనా రాబడితో 20 ఏళ్ళు మదుపు చేస్తే ఎంత జమ అవుతుందో చూద్దాం.

ఉదా : సుమన్ నెలకు రూ. 2,000 లతో మదుపు పెట్టి ప్రతి ఏడాది రూ 500 పెంచుతూ , 20 ఏళ్ళు మదుపు చేస్తే 10శాతం రాబడితో రూ 39,77,561 జమ అవుతుంది. ఇందులో అతని పెట్టుబడి రూ 16,20,000. నికర రాబడి రూ 23,57,561.
అలాగే, అతను నెలకు రూ. 2,000 లతో మదుపు పెట్టి ప్రతి ఏడాది రూ1,000 పెంచుతూ , 20 ఏళ్ళు మదుపు చేస్తే 10శాతం రాబడితో రూ 64,23,728 జమ అవుతుంది. ఇందులో అతని పెట్టుబడి రూ 27,60,000. నికర రాబడి రూ 36,63,728.

Table 5.jpg

ఈ విధంగా ప్రతి ఏడాది మొత్తం పెంచుకుంటూ మదుపు చేస్తే ఎంత మొత్తం జమ అవుతుందో తెలుసుకోవచ్చు.

అలాగే ఈ కింది పట్టిక ద్వారా 12శాతం అంచనా రాబడితో జమ అయ్యే మొత్తం, అందులో మన పెట్టుబడి ఎంత , నికర రాబడి ఎంత తెలుసుకోవచ్చు .
Table  6.jpg

ముగింపు:
పైన చూపిన పట్టికలను గమనించినట్లయితే, రూ 2,000 లతో మొదలు పెట్టినప్పటికీ , ప్రతి ఏడాది పెంచిన మొత్తం, అంచనా రాబడి పెరిగే కొద్దీ , అధిక మొత్తంలో నిధిని జమ చేసుకోవచ్చు. దీనికి పట్టుదల , క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. భవిష్యతులో ఆనందంగా ఉండాలంటే, వర్తమానంలో కొంత త్యాగం చేయాల్సిందే.
విజయీ భవ…

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly