రెండు సరికొత్త బైకులను విడుదల చేసిన రాయల్ ఎన్ఫీల్డ్..
ట్రయల్స్ 350, ట్రయల్స్ 500 మధ్య గల ముఖ్యమైన తేడా వాటి రంగు. ట్రయల్స్ 350 లో రెడ్ కలర్ ఫ్రేమ్ ను ఉపయోగించగా, ట్రయల్స్ 500 లో గ్రీన్ కలర్ ఫ్రేమ్ ను ఉపయోగించారు
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త బైకులను విడుదల చేసింది. దాని పేరు ‘బుల్లెట్ ట్రయల్స్’. ఈ బైకు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. అవి ఒకటి బుల్లెట్ ట్రయల్స్ 500, రెండవది బుల్లెట్ ట్రయల్స్ 350. ఇక వీటి ధరల విషయానికి వస్తే, బుల్లెట్ ట్రయల్స్ 500 ధర రూ. 2.07 లక్షలు (ఎక్స్ షోరూం, ఢిల్లీ) గా, అలాగే బుల్లెట్ ట్రయల్స్ 350 ధర రూ. 1.62 లక్షలు (ఎక్స్ షోరూం, ఢిల్లీ) గా సంస్థ నిర్ణయించింది. రెండు వేరియంట్లలో ఒకే రకమైన ఇంజిన్, గేర్ బాక్స్ ను అమర్చారు. బుల్లెట్ ట్రయల్స్ 350 వేరియంట్ లో 346 సీసీ సింగల్ సిలిండర్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 20 హెచ్పీ పవర్, 28 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా బుల్లెట్ ట్రయల్స్ 500 వేరియంట్ లో 499 సీసీ సింగల్ సిలిండర్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 27.5 హెచ్పీ పవర్, 41.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లు కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటాయి. ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉన్న బుల్లెట్ బైకుల ఆధారంగా కొత్త బైకుల ట్యాంక్ ఆకారం, సైడ్ ప్యానెల్స్ ను రూపొందించారు. ట్రయల్స్ 350, ట్రయల్స్ 500 మధ్య గల ముఖ్యమైన తేడా వాటి రంగు. ట్రయల్స్ 350 లో రెడ్ కలర్ ఫ్రేమ్ ను ఉపయోగించగా, ట్రయల్స్ 500 లో గ్రీన్ కలర్ ఫ్రేమ్ ను ఉపయోగించారు. రెండు మోటార్ సైకిళ్ళు డ్యుయల్ ఛానల్ ఏబీఎస్ తో పాటు డ్యూయల్ డిస్క్ లను కలిగి ఉంటాయి.
కొత్త బుల్లెట్ ట్రయల్స్ బైకులకు ముందువైపు 19 అంగుళాలు, వెనకవైపు 18 అంగుళాల ఫోర్క్ వీల్స్ ను అమర్చారు. ప్రస్తుతానికి, ట్రయల్స్ బైక్స్ కు ప్రత్యక్షంగా ఎలాంటి పోటీ లేదు. ఇది స్టాండర్డ్ బుల్లెట్ సిరీస్ బైకులకు, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ సిరీస్ బైకుకు మధ్య వేరియంట్ గా చెప్పవచ్చు. ఈ బైకులకు భారత మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుందని రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ హెడ్ మార్క్ వెల్స్ తెలిపారు.
సిరి లో ఇంకా:
మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్
Comments
0