ఎవ‌రికి ఎంత ప‌న్ను ఆదా అవుతుంది?

రూ.7 ల‌క్ష‌ల జీతం పొందే ఉద్యోగి ప్ర‌స్తుతం ఎటువంటి ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

ఎవ‌రికి ఎంత ప‌న్ను ఆదా అవుతుంది?

మ‌న దేశ ఆర్థిక మంత్రి ఫిబ్ర‌వ‌రి 1,2019 తేదిన దేశంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు వివిధ రాయితీల‌ను ప్ర‌క‌టించారు. ఇత‌రుల‌తో పాటు వేత‌న జీవుల‌కు కూడా కొన్ని ముఖ్య‌మైన ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పించింది.
ప్ర‌మాణిక త‌గ్గింపును (స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను) రూ. 40 వేల నుంచి రూ. 50 వేల‌కు పెంచింది. మ‌రోవైపు సెక్ష‌న్ 87ఏ కింద రిబేట్‌ను రూ.2500(50 వేలపై 5శాతం) నుంచి రూ.12,500(రూ. 2.5 ల‌క్ష‌ల‌పై 5శాతం) పెంచింది. ప్రాథ‌మిక మిన‌హాయింపులో మార్పులేదు.

ఈ కింది ప‌ట్టిక‌ల ద్వారా దీనిని విశ్లేషించి చూద్దాం
ప‌ట్టిక I
TAX-AGEWISE-1.jpg

 1. సీనియ‌ర్ సిటిజ‌న్లు కాని వారు ( 60 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు వారు):
  2018-19 ఆర్థిక సంవత్స‌రానికి రూ. 2.5 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు ప్రాథ‌మిక‌ మిన‌హాయింపు ఉంది. రూ. 50 వేలపై 5 శాతం(రూ.2500) ప‌న్ను రేబేట్ ఉంది. మొత్తం క‌లిపి రూ. 3 ల‌క్ష‌ల ఆదాయంపై ప‌న్ను మిన‌హాయింపు ఉంది.
  2019-20 సంవ‌త్స‌రానికి గానూ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో సెక్ష‌న్ 87 ఏ కింద వున్న ప‌న్ను రిబేట్‌ను రూ. 12,500 వేల‌కు పెంచారు. ప్రాథ‌మిక ఆదాయం మిన‌హాయింపుకు. రూ. 5 ల‌క్ష‌ల‌కు మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసం రూ. 2.50 ల‌క్ష‌ల‌పై సెక్ష‌న్ 87ఏ కింద ప‌న్ను రిబేట్ వ‌ర్తిస్తుంది. అందువ‌ల్ల రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఎటువంటి ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉండ‌దు.
 1. సీనియ‌ర్ సిటిజ‌న్లు( 60 నుంచి 80 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు గ‌ల వారు):
  2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 3 ల‌క్ష‌ల ఆదాయంపై ప్రాథ‌మిక మిన‌హాయింపు ఉంది. సెక్ష‌న్ 87ఏ కింద రూ. 50 వేల‌పై 5 శాతం రిబేట్‌ రూ. 2500 ఉంది. అందువ‌ల్ల రూ. 3.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను వ‌ర్తించ‌దు.
  2019-20 సంవ‌త్స‌రానికి గానూ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో సెక్ష‌న్ 87 ఏ కింద వున్న ప‌న్ను రిబేట్‌ను రూ. 12,500 వేల‌కు పెంచ‌డంతో ప్రాథ‌మిక ఆదాయం మిన‌హాయింపుకు. రూ. 5 ల‌క్ష‌ల‌కు మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసం రూ. 2 ల‌క్ష‌ల‌పై సెక్ష‌న్ 87ఏ కింద ప‌న్ను రిబేట్ వ‌ర్తిస్తుంది. అందువ‌ల్ల రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఎటువంటి ప‌న్ను వ‌ర్తించ‌దు.
 2. సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్స్‌( 80 సంవ‌త్స‌రాలు కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న‌వారు):
  2018-19 సంవ‌త్స‌రానికి ప్రాథ‌మిక మిన‌హాయింపు రూ. 5 ల‌క్ష‌లు కాబ‌ట్టి 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి ప్రాథ‌మిక మిన‌హాయింపులో ఎటువంటి మార్పు లేదు.

ప‌ట్టిక II:
TAX-AGEWISE-2.jpg

 1. సీనియ‌ర్ సిటిజ‌న్లు కాని వారు ( 60 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు వారు):
  రూ. 5 ల‌క్ష‌ల ఆదాయంపై రిబేట్ వ‌ర్తిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌: 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి మొత్తం స్థూల ఆదాయం రూ. 7 ల‌క్ష‌లు అయితే చెల్లించ‌వ‌ల‌సిన ప‌న్ను రూ. 14,500
  2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను రూ. 10 వేల‌కు పెంచ‌డం, సెక్ష‌న్ 87 ఏ కింద రూ.12,500 రిబేట్ ఇవ్వ‌డం వ‌ల్ల ప‌న్నువ‌ర్తించ‌దు. రూ. 14,500 ఆదా అవుతుంది.

 2. సీనియ‌ర్ సిటిజ‌న్లు( 60 నుంచి 80 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు గ‌ల వారు):
  ఉదాహ‌ర‌ణ‌: 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి మొత్తం స్థూల ఆదాయం రూ. 7 ల‌క్ష‌లు అయితే చెల్లించ‌వ‌ల‌సిన ప‌న్ను రూ. 12,000
  2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను రూ. 10 వేల‌కు పెంచ‌డం, సెక్ష‌న్ 87 ఏ కింద రూ. 12,500 రిబేట్ ఇవ్వ‌డం వ‌ల్ల ప‌న్ను వ‌ర్తించ‌దు. రూ. 12,000 ఆదా అవుతుంది.

 3. సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్స్‌( 80 సంవ‌త్స‌రాలు కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న‌వారు):
  ఉదాహ‌ర‌ణ‌: 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి మొత్తం స్థూల ఆదాయం రూ. 7 ల‌క్ష‌లు అయితే చెల్లించ‌వ‌ల‌సిన ప‌న్ను రూ. 2,000
  2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను రూ. 10 వేల‌కు పెంచ‌డం వ‌ల్ల ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. రూ. 2,000 ఆదా అవుతుంది.

ప‌ట్టిక‌ III :
TAX-AGEWISE-3.jpg

ప్ర‌మాణిక త‌గ్గింపును రూ. 10 వేల‌కు పెంచ‌డం వ‌ల్ల అన్ని వ‌ర్గాల ప‌న్ను చెల్లింపుదారుల‌కు రూ. 3 వేల ఆదా అవుతుంది.

చివ‌రిగా:
ప్ర‌స్తుతం ఆర్థిక సంవ‌త్స‌రం 2019-20కి ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో ప్ర‌భుత్వ రిబేట్ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అన్ని వ‌ర్గాల వారికి ప్రాథ‌మిక మిన‌హాయింపులో ఎటువంటి మార్పు లేదు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80 కింద డిడ‌క్ష‌న్లు తీసివేసిన త‌రువాత మిగిలిన ఆదాయం రూ.5 ల‌క్ష‌లుగా ఉన్న ప‌న్ను చెల్లింపుదారులు ప్ర‌యోజ‌నం పొందుతారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly