నేడే శామ్సంగ్ నోట్ 10, నోట్ 10 ప్లస్ స్మార్ట్ ఫోన్ల విడుదల..

గెలాక్సీ నోట్ 10 లాంచ్ ఈవెంట్ న్యూయార్క్‌లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది

నేడే శామ్సంగ్ నోట్ 10, నోట్ 10 ప్లస్ స్మార్ట్ ఫోన్ల విడుదల..

దక్షిణ కొరియాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం శామ్సంగ్ తన తదుపరి ఫ్లాగ్ షిప్ గెలాక్సీ నోట్ స్మార్ట్ ఫోన్లు అయిన గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ నోట్ 10 ప్లస్ స్మార్ట్ ఫోన్లను న్యూయార్క్‌లో జరిగే కార్యక్రమంలో విడుదల చేయడానికి సిద్ధమైంది. శామ్సంగ్ తన గెలాక్సీ లాంచ్ ఈవెంట్లను అన్ ప్యాక్డ్ అని పిలుస్తుంది. గెలాక్సీ నోట్ 10 లాంచ్ ఈవెంట్ న్యూయార్క్‌లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. అదే మన దేశంలో ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ అర్ధరాత్రి 1.30 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది.

శామ్సంగ్ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఫోన్ల విషయానికొస్తే, నోట్ 10 స్క్రీన్ పరిమాణం సుమారు 6.3 ఇంచ్ ఉండగా, నోట్ 10 ప్లస్ స్క్రీన్ పరిమాణం 6.8 ఇంచ్ ఉండే అవకాశం ఉంది. నోట్ 10 కొద్దిగా ట్వీక్డ్ మెటల్, గ్లాస్ డిజైన్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 12+16+12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెట్ అప్, 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నట్లు తెలుస్తుంది. దీని ధర 999 యూరోలు (సుమారు రూ. 77,400) ఉండవచ్చునని సమాచారం. గెలాక్సీ నోట్ 10 ప్లస్ లో మాత్రం 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 జీబీ ర్యామ్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక నోట్ 10 ప్లస్ ధర 1150 యూరోలు (సుమారు రూ. 89,100) ఉండవచ్చునని సమాచారం. అలాగే వీటిలో ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ లేదా స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ను వినియోగించినట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

శామ్సంగ్ నోట్ స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా పవర్ యూజర్లు ఉపయోగిస్తారని శామ్సంగ్ అభిప్రాయం. వారు తమ ఫోన్లను చాట్ చేయడానికి లేదా సోషల్ మీడియాను బ్రౌజ్ చేయడానికి లేదా ఫోటోలను క్లిక్ చేయడానికి మాత్రమే కాకుండా, కంటెంట్ ను నోట్ చేయడానికి లేదా వర్క్ చేయడానికి వినియోగిస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సామ్‌సంగ్ నోట్ 10, నోట్ 10 ప్లస్‌లకు కొన్ని కొత్త ఫీచర్లను జోడించినట్లు తెలుస్తుంది. ఇవి కంటెంట్ క్రియేటర్స్ కు, ప్రయాణ సమయంలో కూడా వర్క్ చేసే వారికి సహాయపడుతుంది. సాధారణంగా గెలాక్సీ నోట్ స్మార్ట్ ఫోన్స్ అన్నీ మల్టీ ఫంక్షనల్ స్టైలస్‌తో అందుబాటులో ఉంటాయి. అదే విధంగా నోట్ 10, నోట్ 10 ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లో కూడా మల్టీ ఫంక్షనల్ స్టైలస్‌ అందుబాటులో ఉండనుంది.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ నోట్ 10 ప్లస్ స్మార్ట్ ఫోన్ లను ఈ రోజు రాత్రి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లను భారత్ లో ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా స్పష్టత లేదు. అయితే ఒకటి లేదా రెండు వారాల్లో మన దేశంలో విడుదల చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాల అభిప్రాయం.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly