మీకు ఎస్‌బీఐ ఖాతా ఉందా? అయితే ఈ ముఖ్యమైన మార్పులు చుడండి.

బ్రాంచీ ల పని సమయాల్లో కీలక మార్పులు చేసింది

మీకు ఎస్‌బీఐ ఖాతా ఉందా? అయితే ఈ ముఖ్యమైన మార్పులు చుడండి.

మీరు ఎస్బీఐ ఖాతాదారులైతే మీకోసం స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ముఖ్యమైన మార్పులను తెలియపర్చింది. ప్రస్తుత కరోనా వైరస్ ఆపద ని దృష్టి లో పెట్టుకుని బ్రాంచీ ల పని సమయాల్లో కీలక మార్పులు చేసింది. ఇది రాష్ట్రాన్ని బట్టి వేరు వేరుగా ఉంది.

కొన్ని రాష్ట్రాల్లో ఉదయం 7-10 వరకు, కొన్నింటిలో ఉదయం 8-11 వరకు, మరి కొన్నింటిలో 10-2 వరకు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. దీనితో పాటు ఏటీఎం కి వెళ్లలేని వారికి మొబైల్ ఏటీఎం ని అందుబాటు లోకి తేనున్నట్టు తెలియజేసింది.

వీలైనంత వరకు ఇంటి నుంచి డిజిటల్ సేవలను వినియోగించుకోమని ఎస్బీఐ తమ ఖాతా దారులకి మనవి చేసింది. అలాగే, ఇతర బ్యాంకులు కూడా ఇదే రకంగా సేవలను అందించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly