ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

ఏడాది నుంచి 10 ఏళ్ళ కాల‌ప‌రిమితి గ‌ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల‌పై స‌వ‌రించిన వ‌డ్డీ రేట్లు జ‌న‌వ‌రి 10 నుంచి వ‌ర్తిస్తాయి

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల‌లో కోత విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఎస్‌బీఐ డిపాజిట్ల‌పై స‌వ‌రించిన తాజా వ‌డ్డీరేట్లు జ‌న‌వ‌రి 10వ తేది నుంచి వ‌ర్తిస్తాయి. ఒక సంవ‌త్స‌రం నుంచి 10 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి గ‌ల దీర్ఘ‌కాల ట‌ర్మ్ డిపాజిట్ల‌పై 15 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించింది. 7 రోజుల నుంచి ఒక సంవ‌త్స‌రం లోపు కాల‌వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల‌లో ఎలాంటి మార్పు చేయ‌లేదు. అంత‌కు ముందు న‌వంబ‌రులో చివ‌రి సారిగా ఒక సంవ‌త్స‌రం నుంచి 2 సంవ‌త్స‌రాల‌లోపు డిపాజిట్ల‌పై 15 బేసిస్ పాయింట్ల మేర ఎఫ్‌డీ రేట్ల‌ను త‌గ్గించింది.

సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఎస్‌బీఐ తాజా ఎఫ్‌డీ రేట్లు:
7 రోజుల నుంచి 45 రోజులు 4.50 శాతం
46 రోజుల నుంచి 179 రోజులు 5.50 శాతం
180 రోజుల నుంచి 210 రోజులు 5.80 శాతం
211 రోజుల నుంచి ఏడాది లోపు 5.80 శాతం
ఏడాది నుంచి 2 సంవ‌త్స‌రాల లోపు 6.10 శాతం
2 సంవ‌త్స‌రాల నుంచి 3 సంవ‌త్స‌రాల లోపు 6.10 శాతం
3 సంవ‌త్స‌రాల నుంచి 5 సంవ‌త్స‌రాల లోపు 6.10 శాతం
5 సంవ‌త్స‌రాల నుంచి 10 సంవ‌త్స‌రాల లోపు 6.10 శాతం

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అందించే తాజా వ‌డ్డీ రేట్లు:
7 రోజుల నుంచి 45 రోజులు 5 శాతం
46 రోజుల నుంచి 179 రోజులు 6 శాతం
180 రోజుల నుంచి 210 రోజులు 6.30 శాతం
211 రోజుల నుంచి ఏడాది లోపు 6.30 శాతం
ఏడాది నుంచి 2 సంవ‌త్స‌రాల లోపు 6.60 శాతం
2 సంవ‌త్స‌రాల నుంచి 3 సంవ‌త్స‌రాల లోపు 6.60 శాతం
3 సంవ‌త్స‌రాల నుంచి 5 సంవ‌త్స‌రాల లోపు 6.60 శాతం
5 సంవ‌త్స‌రాల నుంచి 10 సంవ‌త్స‌రాల లోపు 6.60 శాతం

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly