ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను తగ్గించిన ఎస్‌బీఐ..

స‌వ‌రించిన వ‌డ్డీ రేట్లు న‌వంబ‌రు 10వ‌ తేదీ నుంచి అమ‌లులోకి రానున్నాయి

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను తగ్గించిన ఎస్‌బీఐ..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రిటైల్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) రేట్ల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు నేడు ప్ర‌క‌టించింది. వ్యవస్థలో సరిపడినంత లిక్విడిటీ ఉంన్నందున ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు బ్యాంక్ వివ‌రించింది. ఈ త‌గ్గింపు న‌వంబ‌రు 1వ తేదీ నుంచి అమ‌లులోకి వ‌స్తుంద‌ని తెలిపింది. ఈ సంవ‌త్స‌రంలో మొత్తంగా 135 బేసిస్ పాయింట్ల మేర రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) డిపాజిట్ రేట్ల‌ను త‌గ్గించిన త‌రువాత దాదాపు అన్ని బ్యాంకులు వాటి డిపాజిట్ రేట్ల‌ను త‌గ్గించాయి. ఇందులో భాగంగా ఒక సంవత్స‌రం నుంచి రెండు సంవ‌త్స‌రాలోపు కాల‌వ్య‌వ‌ధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఎస్‌బీఐ తాజాగా 15 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది.

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న వ‌డ్డీ రేట్లు:
7 రోజుల నుంచి 45 రోజులు 4.50 శాతం
46 రోజుల నుంచి 179 రోజులు 5.50 శాతం
180 రోజుల నుంచి 210 రోజులు 5.80 శాతం
211 రోజుల నుంచి ఏడాది లోపు 5.80 శాతం
ఏడాది నుంచి 2 సంవ‌త్స‌రాల లోపు 6.25 శాతం
2 సంవ‌త్స‌రాల నుంచి 3 సంవ‌త్స‌రాల లోపు 6.25 శాతం
3 సంవ‌త్స‌రాల నుంచి 5 సంవ‌త్స‌రాల లోపు 6.25 శాతం
5 సంవ‌త్స‌రాల నుంచి 10 సంవ‌త్స‌రాల లోపు 6.25 శాతం

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అందించే తాజా వ‌డ్డీ రేట్లు:
7 రోజుల నుంచి 45 రోజులు 5 శాతం
46 రోజుల నుంచి 179 రోజులు 6 శాతం
180 రోజుల నుంచి 210 రోజులు 6.30 శాతం
211 రోజుల నుంచి ఏడాది లోపు 6.30 శాతం
ఏడాది నుంచి 2 సంవ‌త్స‌రాల లోపు 6.75 శాతం
2 సంవ‌త్స‌రాల నుంచి 3 సంవ‌త్స‌రాల లోపు 6.75 శాతం
3 సంవ‌త్స‌రాల నుంచి 5 సంవ‌త్స‌రాల లోపు 6.75 శాతం
5 సంవ‌త్స‌రాల నుంచి 10 సంవ‌త్స‌రాల లోపు 6.75 శాతం

దీంతో పాటు ఎస్‌బీఐ బ‌ల్క్ డిపాజిట్లు(రూ.2 కోట్ల పైన‌) వ‌డ్డీ రేట్ల‌ను కూడా త‌గ్గించింది. వీటిపై 30 నుంచి 75 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ రేటును త‌గ్గించింది. అంతేకాకుండా అన్ని కాల‌ప‌రిమితుల‌కు ఎమ్‌సీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించింది. ఒక సంవ‌త్స‌ర ఎమ్‌సీఎల్ఆర్‌ను 8.05 శాతం నుంచి 8 శాతానికి త‌గ్గించింది. త‌గ్గిన ఎమ్‌సీఎల్ఆర్ న‌వంబ‌రు 10 నుంచి అమ‌లులోకి రానుంది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎమ్‌సీఎల్ఆర్‌ను త‌గ్గించ‌డం వ‌రుస‌గా ఇది ఏడోసారి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly