ఎస్బీఐ లోన్ ఈఎంఐ మారిటోరియం నిబంధనలు, షరతులు..

అన్ని టర్మ్ లోన్లలకు సంబంధించిన ఈఎంఐలను చెల్లించడానికి తాత్కాలిక నిషేధాన్ని 3 నెలల పాటు పొడిగించాలని బ్యాంకు నిర్ణయించింది

ఎస్బీఐ లోన్ ఈఎంఐ మారిటోరియం నిబంధనలు, షరతులు..

టర్మ్ లోన్ల తిరిగి చెల్లింపులపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అన్ని బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్‌బీఐ ఆదేశాలను అనుసరించి దేశంలోని అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణ, వాహన రుణాల ఈఎంఐల చెల్లింపును వాయిదా వేసే చర్యలను ప్రారంభించింది. దీనిలో భాగంగా అన్ని టర్మ్ లోన్ లకు సంబంధించిన వాయిదాలు / ఈఎంఐలను చెల్లించడానికి తాత్కాలిక నిషేధాన్ని 3 నెలల పాటు పొడిగించాలని బ్యాంకు నిర్ణయించింది. మార్చి 1, 2020 నుంచి మే 31, 2020 మధ్య వచ్చే ఈఎంఐలు / వాయిదాలకు ఇది వర్తిస్తుందని ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

ఈ పథకం గురించి తెలియజేస్తూ ఎస్బీఐ తమ వినియోగదారులకు మెయిల్స్, ఎస్ఎంఎస్ లను కూడా జారీ చేసింది. ఈఎంఐల వాయిదా కోసం దరఖాస్తు పంపేందుకు ఈమెయిల్‌ల జాబితాను కూడా బ్యాంకు జారీ చేసింది.

రుణ ఈఎంఐలపై ఎస్బీఐ తాత్కాలిక నిషేధ వివరాలను కింద చూడండి:

వాయిదాల రికవరీ అవసరంలేదని అనుకునే వినియోగదారులు : ఎటువంటి చర్యలు అవసరం లేదు. వారు సాధారణ పద్దతిలో చెల్లించడం కొనసాగించవచ్చు.

వాయిదాల రికవరీ అవసరం అనుకునే వినియోగదారులు : దయచేసి ఈ వాయిదాల కోసం నాచ్ను ఆపడానికి నాచ్ ఎక్స్‌టెన్షన్- (అనెక్చర్- II) తో పాటు ఒక అప్లికేషన్ (అనెక్చర్ -1) ను ఈ-మెయిల్ ద్వారా కింద పేర్కొన్న ఈ-మెయిల్ ఐడీ (అనెక్చర్ -3) కి పంపించండి.

స్టాండింగ్ సూచనలు : దయచేసి మీ అప్లికేషన్ (అనెక్చర్ -1) ను ఈ-మెయిల్ ద్వారా కింద పేర్కొన్న ఈ-మెయిల్ ఐడీ (అనెక్చర్ -3) కి పంపించండి.

ఇప్పటికే చెల్లించిన వాయిదా / ఈఎంఐ వాపసు కావాలనుకునే వినియోగదారులు : దయచేసి ఈ- మెయిల్ ద్వారా అప్లికేషన్ (అనెక్చర్ -1) ను నిర్దిష్ట ఈ-మెయిల్ ఐడీ (అనెక్చర్ -3) కి ఈ-మెయిల్ ద్వారా పంపించండి.

sbi.png

వాయిదా ప్రభావం ఎలా ఉంటుంది :

తాత్కాలిక నిషేధ వ్యవధిలో టర్మ్ లోన్ బకాయి వడ్డీ కొనసాగుతూనే ఉంటుంది. తిరిగి చెల్లించే కాలం పొడిగింపు ప్రభావం మీ కోసం కింద వివరించాము :

వాహన రుణ విషయంలో ప్రభావం : 54 నెలల మెచ్యూరిటీతో రూ. 6 లక్షల రుణానికి చెల్లించాల్సిన అదనపు వడ్డీ సుమారు రూ. 19,000. ఇది 1.5 ఈఎంఐలకు సమానం.

గృహ రుణ విషయంలో ప్రభావం: 15 సంవత్సరాల మెచ్యూరిటీతో రూ. 30 లక్షల రుణానిక చెల్లించాల్సిన అదనపు వడ్డీ సుమారు రూ. 2.34 లక్షలు. ఇది 8 ఈఎంఐలకు సమానం.

(source - livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly