ఎస్‌బీఐ స్టూడెంట్ ప్ల‌స్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డు

ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నలేదా విద్యారుణం తీసుకున్న విద్యార్ధులు ఈ క్రెడిట్‌ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఎస్‌బీఐ స్టూడెంట్ ప్ల‌స్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డు

ఎస్‌బీఐ అందించే ఈ క్రెడిట్ కార్డుతో విద్యార్ధులు వారి న‌గ‌దును నిర్వ‌హించ‌డంలో ప్రావిణ్య‌త‌ను పొందుతారు. ఈ కార్డు విద్యార్ధుల కోస‌మే ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విద్యారుణం తీసుకున్న విద్యార్ధులు, ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్న విద్యార్ధ‌లు మాత్ర‌మే ఈ క్రెడిట్‌ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇందులో ఉన్న ముఖ్య‌మైన అంశాలు

 1. స్పెండ్ స్మార్ట్‌:
  విద్యార్థులు వారి ఖ‌ర్చు పెట్టే మొత్తంపై ప్ర‌తీసారి కొంత క్యాష్ పాయింట్ల రూపంలో తిరిగి వ‌స్తుంది. ఈ క్యాష్ పాయింట్ల‌ను ఉప‌యోగించి వారి ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్‌ను తిరిగి చెల్లించ‌వ‌చ్చు. లేదా కేట‌లాగ్‌లో ఉన్న బ‌హుమ‌తుల‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవ‌చ్చు. విద్యార్ధి ఖ‌ర్చుపెట్టే ప్ర‌తీ రూ.100 ఒక క్యాష్ పాయింట్ వ‌స్తుంది.

 2. షాప్ స్మార్ట్‌:
  రోజు వారీ కొనుగోలు(షాపింగ్)పై 2.5 శాతం విలువ‌ను తిరిగిపొంద‌వ‌చ్చు. ఇది క్యాష్‌పాయింట్ల రూపంలో వేగ‌వంతంగా 2.5 శాతం విలువ‌ను తిరిగి పొంద‌వ‌చ్చు. (ప్ర‌తీ రూ.100ల‌పై 10 క్యాష్ పాయింట్ల‌ను పొంద‌వ‌చ్చు)
  ఎస్‌బీఐ స్టూడెంట్ ప్ల‌స్ అడ్వాన్‌టేంజ్ కార్డును ఉప‌యోగించి ప్ర‌తీసారి డిపార్ట్‌మెంట్ స్టోర్స్‌, నిత్య‌వ‌స‌రాల కొనుగోళ్ళ‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది.
  ఇంధ‌నం, న‌గ‌దు, బ్యాలెన్స్ బ‌దిలీ లావాదేవీల‌కు క్యాష్ పాయింట్స్ ప్రోగ్రామ్ వ‌ర్తించ‌దు.

 1. సేవ్ స్మార్ట్‌:
  పెట్రోల్ ట్యాంక్ ఫుల్‌ చేయించుకున్న ప్ర‌తీసారి 2.5 శాతం ఇంధ‌న సర్‌చార్జీ నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. రూ.500-రూ3000 మ‌ధ్య ఇంధ‌నం కొనుగోలు లావాదేవీల‌పై స‌ర్‌చార్జ్ నుంచి మిన‌హాయింపు ల‌భిస్తుంది. నెల‌కు గ‌రిష్టంగా రూ.100 వ‌ర‌కు స‌ర్‌చార్జ్ త‌గ్గించుకోవ‌చ్చు.

 2. ఈ-స్మార్ట్‌:
  www.sbicard.com ద్వారా అన్‌లైన్‌లో ఈ కింది కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు.

 • త‌క్ష‌ణ కార్డ్ ఖాతా సారాంశం (అక్కౌంట్ స‌మ‌రీ)
 • స్పెండ్స్ ఎన‌లైజ‌ర్ ద్వారా ఈ కార్డు ద్వారా చేసిన వ్య‌యాన్ని విశ్లేశించుకోవ‌చ్చు.
 • కార్డు పోతే డూప్లికేట్ కార్డు కోసం అభ్య‌ర్థ‌న పెట్టుకోవ‌చ్చు.
 • నెల‌వారీ ఈ-స్టేట్‌మెంట్ పొందే సౌక‌ర్యం
 • ఎస్‌బీఐ కార్డు అల‌ర్ట్‌లు ఎనేబుల్ చేయ‌డం ద్వారా మీ క్రెడిట్ గురించిన స‌మాచారాన్ని ఎస్ఎమ్ఎస్ ద్వారా మోబైల్‌లో పొంద‌వ‌చ్చు.
 1. సెక్యూర్ స్మార్ట్‌:
  వీసా, మాస్ట‌ర్ కార్డ‌ల సెక్యూరిటీ కోడ్‌లో ఎస్‌బీఐ స్టూడెంట్ ప్ల‌స్ అడ్వాంటేజ్ కార్డ్‌తో త‌నిఖీ చేసిన త‌రువాత మాత్ర‌మే కార్డు జారీచేస్తారు.
  ఈఎమ్‌వీ చిప్ లావాదేవీలు మోస‌గాళ్ళ భారిన ప‌డ‌కండా డేటాను సుర‌క్షితంగా ఉంచుతాయి.

క్యాష్ పాయింట్ అయితే ఏమిటి? క్యాష్ పాయింట్లు, రివార్డ్ పాయింట్ల కంటే ఏవిధంగా భిన్నంగా ఉంటాయి?

ఎస్‌బీఐ స్టూడెంట్ ప్ల‌స్ అడ్వాంటేజ్ కార్డును ఉప‌యోగించి మీరు సంపాదించే పాయింట్ల‌ను క్యాష్ పాయింట్లు అంటారు. సాదార‌ణ క్రెడిట్ కార్డును ఉప‌యోగించి కొనుగోలు చేసిన‌ప్పుడు రివార్డ్ పాయింట్లు ల‌భిస్తాయి. ఈ రివార్డు పాయింట్ల‌ను కేట‌లాగ్‌లో ఇచ్చిన వాటికి మాత్రేమే రీడీమ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే క్యాష్ పాయింట్ల‌ను ఉప‌యోగించి మీకు క్రెడిట్ కార్డు బిల్లు( ఔట్‌స్టేండింగ్ బ్యాలెన్స్‌)ను చెల్లించ‌డంతో పాటు కేటలాగ్‌లో ఇచ్చిన వాటికి కూడా రీడీమ్ చేసుకోవ‌చ్చు. ఎస్‌బీఐ స్టూడెంట్ ప్ల‌స్ అడ్వాంటేజ్ కార్డును ఉప‌యోగించి చెల్లించిన ప్ర‌తీ రూ.100 ఒక క్యాష్ పాయింట్ వ‌స్తుంది. మీ వ‌ద్ద 2000 క్యాష్ పాయింట్లుతో రూ.500 క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించ‌వ‌చ్చు. ఈ క్యాష్ పాయింట్ల‌ను ఎన్‌క్యాష్ చేసేందుకు హెల్ప్‌లైన్ నెంబ‌ర్ల‌కు కాల్‌చేసి క‌స్ట‌మ‌ర్‌కేర్ ఎక్సిక్యూటీవ్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఎన్‌కేష్ చేసేందుకు క‌నీసం 2000 క్యాష్ పాయింట్లు ఉండాలి.

స్టూడెంట్స్ కోసం ప్ర‌త్యేకంగా క్రెడిట్ కార్డ్

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly