12 నెల‌ల క‌నిష్టానికి సేవా రంగం

మే నెల‌లో నిక్కీ పీఎమ్ఐ సేవారంగ సూచీ తగ్గి 50.2 గా న‌మోదైంది

12 నెల‌ల క‌నిష్టానికి సేవా రంగం

ఈ సంవ‌త్స‌రం మే నెల‌లో సేవ‌రంగం వృద్ధి నెమ్మ‌దించింది. గ‌త నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల కార‌ణంగా త‌లెత్తిన అవాంత‌రాలు, కొత్త ప‌నుల ఆర్డ‌ర్లు త‌గ్గ‌డంతో మే నెల‌లో భార‌త సేవ‌రంగం వృద్ది రేటులో త‌గ్గుద‌ల క‌న‌బ‌రుస్తుంద‌ని బుధ‌వారం విడుద‌ల చేసిన స‌ర్వే నివేధిక‌లో వెల్ల‌డైంది.

నిక్కీ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్ ఏప్రిల్‌లో 51.0 ఉండగా మేలో 50.2కి తగ్గింది. ఇది ప్ర‌స్తుత 12 నెల‌ల కాల‌వ్య‌వ‌ధిలో నెమ్మ‌దిస్తున్న వృద్ధి రేటును సూచిస్తుంది.

నియంత్రణ ఉన్నప్పటికీ, సేవారంగం పీఎమ్ఐ (ప‌ర్చేసింగ్ మేనేజ‌న్స్ ఇండెక్స్‌) వ‌రుస‌గా 12వ నెల‌లో వృద్దిలోనే ఉంది. పీఎమ్ఐ ప‌రిభాష‌లో 50 కంటే ఎక్కువ ఉంటే వృద్ధి చెందుతుంద‌ని, అంత‌కంటే త‌క్కువ న‌మోదు చేస్తే మంద‌గిస్తుంద‌ని అర్ధం.

భార‌త్ జీడీపీ లో అధిక భాగం ఉండే సేవారంగం పై మ‌రోసారి ఎన్నిక‌లు ప్ర‌భావం చూపించాయి. వ‌రుస‌గా మూడ‌వ నెల‌లో కొత్త ప‌నులు, వ్యాపార కార్య‌కలాపాలు రెండింటి వృద్ధి రేటు నెమ్మ‌దించింద‌ని ఐహెచ్ఎస్ మార్కిట్, ముఖ్య ఎకానామిక్ పాలియ‌న్నా డీ లీమా తెలిపారు.

అయితే ఈ సర్వేలో తెలిపిన మందగింపు తాత్కాలికమ‌ని, కంపెనీలు ఉద్యోగ నియామకాన్ని చేపట్టడంతో భవిష్యత్ అవకాశాలు మెరుగుప‌డ‌తాయి. స‌మీప భ‌విష్య‌త్తులో సేవారంగం మ‌ళ్ళీ పుంజుకుంటుద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. నియామ‌కాల మెరుగుప‌డ‌డం సెటిమెంటు బ‌ల‌ప‌రుస్తుంది.

సమీపంలో సేవారంగం పుంజుకునే సంకేతాలు మ‌న‌కు క‌నిపిస్తున్నాయి. నియామ‌కాల‌లో పెరుగుద‌ల న‌మోదు ఈ రంగంలో సెంటిమెంట్ మెరుగ‌యిన‌ట్లు తెలుస్తుంది. పెరిగిన క్ల‌యింట్ల‌ ఖర్చులు, వ్యాపార‌ పెట్టుబడుల మద్దతు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల లేకపోవడం మంచి ప‌రిమాణం
అని లీమా అన్నారు.

నిక్కీ ఇండియా కాంపోసైట్ పీఎమ్ఐ అవుట్ ఇండెక్స్ త‌యారీ రంగం, సేవారంగాలు వృద్ధిలో ఏలాంటి మార్పు ఉండ‌ద‌ని ఏప్రిల్ మాదిరిగ‌గానే 51.7 వ‌ద్ద వృద్ధి రేటు ఉంటుంద‌ని భావించింది. అయితే ఈ రోజు విడుదలైన ఫ‌లితాల ప్ర‌కారం సేవారంగం వృద్ధి త‌గ్గిన‌ప్ప‌టికీ, మంచి స్థితిలోనే కొన‌సాగుతుంద‌ని పీఎమ్ఐ సూచిస్తుంది.
ప్రభుత్వ ఏర్పాటు, పునఃప్రారంభమైన విధాన అజెండాతో, 2019 రెండవ భాగంలో సేవ‌రంగం తిరిగి పుంజుకుంటుద‌ని భావిస్తున్న‌ట్లు లీమా తెలిపారు. మే 23న విడుద‌లైన ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) తిరుగులేని విజ‌యం సాధించి, మే 30 తేదిన 58 మందితో కూడిన మంత్రిత్వ శాఖ‌కు ప్ర‌ధాన మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

ధరల పెరుగుదలకు సంబంధించి, ఈ రంగంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు లేకపోవడమే కాకుండా, రిజర్వుబ్యాంకు విధాన సమీక్షా సమావేశంలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా విధానపరమైన నిర్ణ‌యాల‌ను అమలు చేయవచ్చని సర్వే సూచించింది. ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ (ఎమ్‌పీసీ) గురువారం బై-మంత్లీ పాల‌సీ విధాన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly