విడుదలైన వన్‌ప్లస్‌ 7, వన్‌ప్లస్‌ 7 ప్రో...

రెండు మోడల్స్ లో సరికొత్త ఫ్లాగ్‌ షిప్‌ ప్రాసెసర్‌ అయిన క్వాల్కామ్ స్నాప్‌ డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ ను అమర్చారు

విడుదలైన వన్‌ప్లస్‌ 7, వన్‌ప్లస్‌ 7 ప్రో...

ప్రీమియం మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ తమ వినియోగదారుల కోసం వన్‌ప్లస్‌ 7, వన్‌ప్లస్‌ 7 ప్రో సిరీస్‌ ఫోన్లను విడుదల చేసింది. వన్‌ప్లస్‌ నుంచి ఒకేసారి రెండు మొబైల్ ఫోన్లను విడుదల చేయడం ఇదే తొలిసారి. బెంగళూరు, లండన్‌, న్యూయార్క్‌ నగరాలలో ఒకేసారి మొబైల్ లాంచ్‌ ఈవెంట్లను వన్‌ప్లస్‌ నిర్వహించింది. రెండు మోడల్స్ లో సరికొత్త ఫ్లాగ్‌ షిప్‌ ప్రాసెసర్‌ అయిన క్వాల్కామ్ స్నాప్‌ డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ ను అమర్చారు. మే 17 నుంచి అమెజాన్‌ లో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులు మాత్రం 16 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచే కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ. 2000 డిస్కౌంట్‌ లభించనుంది.

వన్‌ప్లస్‌ 7 ప్రో ఫీచర్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

 • 6.67 అంగుళాల ఆల్‌ స్క్రీన్‌ ఫ్లూయిడ్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే
 • 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో క్వాడ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
 • క్వాల్కామ్ స్నాప్‌ డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌
 • 6 జీబీ/8 జీబీ/ 12 జీబీ ర్యామ్‌, 128 జీబీ/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
 • వెనుకవైపు 48 ఎంపీ, 16 ఎంపీ అల్ట్రావైడ్‌ సెన్సర్‌, 8 ఎంపీ టెలీఫొటో లెన్స్‌ తో మూడు కెమెరాలను అమర్చారు
 • ముందువైపు 16 ఎంపీ పాప్‌అప్‌ సెల్ఫీ కెమెరా
 • 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 • 30 వాట్‌ వ్రాప్‌ ఛార్జింగ్‌
 • హైడైనమిక్‌ రేంజ్‌ హెఛ్‌డీఆర్‌ 10/10+ వీడియో

వన్‌ప్లస్‌ 7 ఫీచర్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

 • 6.41 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
 • వాటర్‌ డ్రాప్‌ నాచ్‌తో 60హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ స్క్రీన్‌
 • క్వాల్కామ్ స్నాప్‌ డ్రాగన్‌ 855 ప్రోసెసర్‌
 • 6 జీబీ ర్యామ్‌ & 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ & 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
 • వెనుకవైపు 48 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌
 • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
 • 3700 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 • 20 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌

ఇక వన్‌ప్లస్‌ 7 ప్రో మొబైల్ ధర విషయానికి వస్తే… 6 జీబీ+128 జీబీ ధర రూ. 48,999, 8జీబీ+256జీబీ ధర రూ. 52,999, 12 జీబీ+256 జీబీ ధర రూ. 57,999 కాగా వన్‌ప్లస్‌ 7 మొబైల్ ధర 6జీబీ+128 జీబీ ధర రూ.32,999, 8 జీబీ+256 జీబీ ధర 37,999గా ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly