సంపదను సృష్టించుకోవడానికి ఏడు సాంప్రదాయ మార్గాలు..

సంపదను సృష్టించుకోవడం ఒక్క రాత్రిలో జరిగే విషయం కాదు. దీనికి సహనం, సరైన ప్రణాళిక అవసరం

సంపదను సృష్టించుకోవడానికి ఏడు సాంప్రదాయ మార్గాలు..

సంపదను సృష్టించుకోవడమంటే అత్యధిక రాబడులను పొందడం అని అర్ధం కాదు. పెద్ద మొత్తంలో రాబడులు వచ్చే పెట్టుబడులు అత్యధిక ప్రమాదాన్ని కలిగి ఉంటాయి, ఒకవేళ మీరు పెట్టిన పెట్టుబడి విఫలమైనట్లైతే, అనంతరం సరైన పెట్టుబడిని ఎంపిక చేసుకోవడంలో తర్జనభర్జనకు గురి అవుతారు. సంపదను సృష్టించుకోవడం అంటే స్థిరమైన రాబడులను పొందడమని అర్ధం. సంపదను సృష్టించుకోవడం ఒక్క రాత్రిలో జరిగే విషయం కాదు. దీనికి సహనం, సరైన ప్రణాళిక అవసరం.

సంపదను సృష్టించుకునే 7 సాంప్రదాయ విధానాలను మీ కోసం కింద తెలియచేశాము.

  1. సంపద సృష్టి ప్రతి రోజు చేసే ఉద్యోగం లాంటిది

సంపదను ఒక మంచి ప్యాకేజీతో లేదా కొన్ని మూలధన లాభాలతో సృష్టించలేము. దానికి చాలా సమయం పడుతుంది. పెట్టుబడులను పరిగణలోకి తీసుకున్నట్లైతే, సహనం అనేది చాలా ముఖ్యం. మంచి రాబడులను పొంది, పెద్ద మొత్తంలో సంపదను సృష్టించుకునే క్రమంలో చాలా సహనం ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే పెట్టుబడులు పెట్టే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, పెట్టుబడులను కొనసాగిస్తూ ఉండాలి.

  1. భావోద్వేగాలను నియంత్రించుకోండి

మీ లక్ష్యాలను సాధించడానికి సరైన పెట్టుబడుల ప్రవర్తన మీకు సహాయపడుతుంది. ఒకవేళ మార్కెట్ నష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు మీరు బయపడి మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోకూడదు. మీ భావోద్వేగాలను విడిచిపెట్టి, పెట్టుబడులను కొనసాగించడం మంచిది. అప్పుడు మీరు ఎక్కువ మొత్తంలో నగదును సృష్టించుకోగలరు. స్వల్పకాళిక అనిశ్చితులు మీ దీర్ఘకాల ప్రణాళికలను ప్రభావితం చేయకుండా చుసుకోండి.

  1. ఎక్కువ రాబడులను ఇచ్చే సాధనాలలో పెట్టుబడి పెట్టి నిశ్చింతగా ఉండండి

మంచి రాబడులను ఇచ్చే ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. నిజానికి, సంపదను నిర్మించుకోవడానికి ఆస్తి కేటాయింపు అవసరం. లక్ష్యాలు, మార్కెట్ల ఒడుదొడుకులు, రిస్క్, వయస్సు ప్రకారం పెట్టుబ‌డుల‌ను కేటాయించాలి. దీర్ఘకాలిక ప్రణాళికకు కేటాయింపు అనేది కీలకం.

ఒకవేళ మీరు సరైన పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌ను కలిగి ఉన్నట్లయితే, అవ‌స‌రానిని త‌గిన డ‌బ్బును స‌మ‌కూర్చుకోగ‌లుగుతారు. స‌రైన స‌మ‌యంలో పెట్టుబ‌డుల‌ను డెట్ ఉంచి ఈక్విటీ ఫండ్ల‌కు బదిలీ చేసి, తక్కువ స్థాయిలో పెట్టుబడి పెట్టండి. ఇలా చేయడం ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత మార్కెట్లు కోలుకున్నప్పుడు, మీరు మంచి రాబడులను పొందగలరు.

  1. కొన్ని సార్లు సాంప్ర‌దాయ మార్గాలే దారిచూపుతాయి

పెట్టుబ‌డుదారులు ఎప్పుడూ అధిక రాబ‌డుల‌ను ఆశిస్తుంటారు. పాత ప‌ద్ధ‌తుల‌ను పాటించ‌డంతో త‌క్కువ రాబ‌డి వ‌స్తుంద‌నేది అన్ని సంద‌ర్భాల్లో నిజం కాదు. కొన్ని సార్లు ఆ పెట్టుబ‌డులు కూడా ఆర్థిక స్థిర‌త్వాన్ని ఇస్తాయి. స‌మ‌ర్థ‌వంగా పెట్టుబ‌డులును కొన‌సాగిస్తేనే సంప‌ద మీ సొంత‌మ‌వుతుంది.

  1. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌ట‌మే సంప‌న్నంగా ఉండ‌టం

సంప‌ద అనేది మీ క‌ష్టం, శ్ర‌మ ద్వారా పెంచుకునేది. ఆర్థికంగా సిద్ధంగా ఉండటం అంటే అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో మీ వ‌ద్ద డ‌బ్బు ఉండ‌టం. మీ వ‌ద్ద ఉన్న బంగారం, వ‌జ్రాలు అత్య‌వ‌స‌ర‌మైన వైద్య చికిత్స స‌మ‌యంలో ఉప‌యోగ‌ప‌డ‌వు. అత్య‌వ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఉప‌యోగ‌ప‌డని సంప‌ద ఉండి లాభం లేదు. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌టం అంటే ఎక్కువ విలువైన ఆస్తులు క‌లిగి ఉండ‌టం కాదు. ఎప్పుడైనా, ఏ అవ‌స‌రానికైనా సిద్ధంగా ఉండ‌టం.

  1. ఆస్తుల రూపంలో ఉన్నా డ‌బ్బు రూపంలో ఉన్నా డ‌బ్బు ఒక‌టే

మార్కెట్ విలువ బిలియ‌న్ల‌లో ఉన్న కంపెనీల వ‌ల‌న కంపెనీకి, ఉద్యోగుల‌కు లాభం చేకూరుతుంది. కానీ, అంత‌మాత్రాన ఆర్థిక స్థిర‌త్వం ఉన్న‌ట్లు కాదు. సంప‌ద అనేది అవ‌ర‌మైన‌ప్పుడు డ‌బ్బు రూపంలో ఉండ‌గ‌ల‌గాలి. స‌రైన క్ర‌మ‌శిక్ష‌ణ‌తో సంప‌దను అవ‌స‌రానికి అనుగుణంగా మార్చుకోవ‌చ్చు. లెక్క‌లేనంత డ‌బ్బు స్థిరాస్తి, పొదుపు ప‌థ‌కాల్లో, డ‌బ్బు రూపంలో ఉండ‌టం వ‌ల‌ను మీరు ధ‌న‌వంతులు కావొచ్చు. కానీ, తెలివిగా పెట్టుబ‌డులు పెట్టేవాడే అస‌లు ధ‌న‌వంతుడు. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో సంప‌ద‌ను ఉప‌యోగించుకోగ‌లిగిన‌ప్పుడే దానికి విలువ‌.

  1. డ‌బ్బు ఎప్పుడైనా ఎక్క‌డైనా అవ‌స‌రం రావొచ్చు దానికి సిద్ధంగా ఉండండి
    ఆర్థికంగా సిద్ధంగా ఉండ‌టం అంటే అవ‌స‌రానికి త‌గినంత డ‌బ్బు మీ వ‌ద్ద ఉండ‌టం లేదా స‌మ‌యానికి డ‌బ్బు చేకూర‌టం కాదు. ఎలాంటి సంద‌ర్భాన్ని అయిన త‌మ‌కు అనుగుణంగా మార్చుకోవ‌డ‌మే. పెట్టుబ‌డుల్లో స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ద్వారా ఇది సాధ్య‌మ‌వుతుంది. అదేవిధంగా ఏదీ ప్ర‌యోజ‌న‌క‌ర‌మో దానిని న‌మ్మ‌డం, పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించ‌డం అనేది తెలివైన పెట్టుబ‌డుదారులు చేసే ప‌ని.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly