ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి నిధిని ఎప్పుడు బ‌దిలీ చేయాలి?

స్వ‌ల్ప కాలిక ల‌క్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల‌ను ఎంచుకోకూడ‌ద‌నే నియమం ఇక్క‌డ కూడా వ‌ర్తిస్తుంది.

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి నిధిని ఎప్పుడు బ‌దిలీ చేయాలి?

ఆర్థిక నిపుణులు, స‌ల‌హాదారులు ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌ల్సిందిగా సూచిస్తారు. అయితే ప‌ద‌వీ విర‌మ‌ణ సమ‌యం స‌మీపించిన‌ప్పుడు పెట్టుబ‌డులను ఈక్విటీ మ్యూచువ‌ల్ పండ్ల నుంచి ఇత‌ర ప‌థ‌కాల‌కు బ‌దిలీ చేయాల్సిందిగా చెప్తారు. అయితే ఎప్పుడు, ఎందుకు ఈ డ‌బ్బును బ‌దిలీ చేయాలి. ఎక్క‌డికి ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలి… తెలుసుకుందాం. ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం పెట్టుబ‌డులను చేసిన డ‌బ్బును అదేవిదంగా మార్కెట్ల‌లో కొన‌సాగించ‌డం అంత మంచిది కాదు. అనుకోకుండా మార్కెట్ల‌లో న‌ష్టాలు వ‌స్తే సంప‌ద త‌గ్గిపోయే అవ‌కాశం ఉంటుంది. అందుకే ఆర్థిక స‌ల‌హాదారులు పెట్టుబ‌డుల‌ను ఈక్విటీల నుంచి భ‌ద్ర‌త క‌లిగిన ప‌థ‌కాల‌లోకి బ‌దిలీ చేయ‌వ‌ల్సిందిగా చెప్తారు. అయితే పెట్టుబ‌డులు ఎక్క‌డ సుర‌క్షితంగా ఉంటాయి అంటే అప్పుడు బ్యాంకు డిపాజిట్లు లేదా డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎంచుకోమ‌ని చెప్తారు. ఎందుకంటే పెట్టుబ‌డులు సుర‌క్షితంగా ఉండేందుకు ఈ స‌ల‌హాల‌ను ఇస్తారు. అయితే బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై ప‌న్ను ప‌డుతుంద‌న్న‌ది తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఇన్ని రోజులు క‌ష్ట‌ప‌డి సంపాదించిన‌ది భ‌ద్రంగా ఉండాలంటే ఇవే అనుకూల‌మైన‌వి.

మ‌రి ఎప్పుడు పెట్టుబ‌డుల‌ను బ‌దిలీ చేయాలో తెలుసుకుందాం. కొంత‌మంది ప‌దివీ విర‌మ‌ణ‌కు కొన్నేళ్ల ముందు డ‌బ్బును బ‌దిలీ చేయాల్సిందిగా చెప్తారు. మ‌రికొంత‌మంది ప‌దివీ విర‌మ‌ణ‌కు ఏడాది ముందు లేదా రెండేళ్ల ముందు పెట్టుబ‌డుల‌ను మార్చాల్సిందిగా స‌ల‌హా ఇస్తారు. అయితే నిర్ణ‌యం తీసుకునేముందు కొంత జాగ్ర‌త్త వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది.

ఉదాహ‌ర‌ణ‌కు మీరు అనుకున్నంత సంప‌ద‌ను ప‌దవీ విర‌మ‌ణ‌కు చాలా కాలానికి ముందే చేరుకోగ‌లిగితే ఇంకా ఎటువంటి ఆల‌స్యం చేయ‌కుండా డ‌బ్బును బ‌దిలీ చేయ‌వ‌చ్చు. అప్ప‌టికే మీరు అనుకున్న ల‌క్ష్యానికి చేరిన త‌ర్వాత అత్యాశ‌కు పోయి డ‌బ్బును ఇంకా రిస్క్‌లో పెట్ట‌డం అన‌వ‌స‌రం. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ఐదేళ్ల ముందు నుంచి మార్కెట్లు లాభ‌ప‌డి అనుకున్నంత నిధి ఏర్ప‌డితే మీ మొత్తం పెట్టుబ‌డులను లేదా కొంత వాటాను లిక్విడ్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌క మార్చ‌డం మంచిది.

చాలా వ‌ర‌కు ఆర్థిక నిపుణులు ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ఐదేళ్ల‌కు ముందు ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి డ‌బ్బును బ‌దిలీ చేయ‌వ‌ల‌సిందిగా సూచిస్తారు. కొంత‌మంది మూడేళ్లు ముందు పెట్టుబ‌డుల‌న ట్రాన్స్ఫ‌ర్ చేయ‌మ‌ని చెప్తారు. స్వ‌ల్ప కాలిక ల‌క్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుడులు అంత మంచి ఎంపిక కాద‌నేది తెలిసిందే. అదేవిదంగా ఇక్క‌డ కూడా ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు కొన్ని రోజుల ముందు ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో డ‌బ్బు ఉంచ‌డం కూడా రిస్క్ అన్న సంగ‌తి గుర్తించాలి. అంత‌గా అనుకుంటే కేవ‌లం మీకు డ‌బ్బుతో ఇంకా ఏడు నుంచి ప‌దేళ్ల వ‌ర‌కు అవ‌స‌రం లేద‌నుకున్న‌ప్పుడు మొత్తం నిధి నుంచి కొంత మొత్తాన్ని కొన‌సాగించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly