తక్కువ డబ్బుతో మదుపు చేయడానికి 6 మార్గాలు

మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన తర్వాత, దానిని స్థిరంగా ఉంచడం చాలా ముఖ్యం

తక్కువ డబ్బుతో మదుపు చేయడానికి 6 మార్గాలు

మనలో చాలా మంది పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని భావిస్తుంటారు. చిన్న నీటి బిందువులు కలిసి ఒక సముద్రాన్నీ తయారు చేస్తాయి. అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) విధానంలో తక్కువ మొత్తంలో డబ్బును పెట్టుబడిగా పెట్టినట్లయితే, కొంత కాలానికి మంచి మొత్తంలో డ‌బ్బు పొందుతారు.

తక్కువ డబ్బుతో పెట్టుబడికి 6 మార్గాలు :

  1. మొత్తంతో నిమిత్తం లేకుండా ముందు పెట్టుబడిని ప్రారంభించండి

పెట్టుబడులను ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. మీరు కూడబెట్టుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం లేదు. అది కేవలం ప్రారంభించడానికి మాత్రమే అవసరం. కీలకమైన ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడం ఆలస్యం చేసినట్లయితే దానికి అధిక మూల్యం చెల్లించాల్సి రావచ్చు. వీలైనంత తొంద‌ర‌గా ఆర్థిక ప్రణాళికను రూపొందిచుకోవడం మొదలు పెడితే, మీరు ఆర్థిక ప‌రంగా నిల‌దొక్కుకోగ‌ల‌రు. ఆర్థిక ప్రణాళికను రూపొందించడం ప్రారంభించిన రోజు నుంచే డబ్బు సంపాదించడం ప్రారంభించాలి. మనలో చాలా మంది డబ్బు విషయంలో మరొక రోజుకి ప్రణాళికను వాయిదా వేయడం లేదా చివరి నిమిషం వరకు అలసత్వం వహించే ధోరణిని కలిగి ఉంటారు. వేరే పని ఉండడం లేదా మనకు అది అర్థం కాకపోవడం కారణం కావచ్చు.

  1. స్థిరంగా ఉండండి

మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన తర్వాత, దానిని స్థిరంగా ఉంచడం చాలా ముఖ్యం. పెట్టుబడులకు ఒక క్రమశిక్షణా విధానాన్ని అనుసరించి, సరైన పెట్టుబ‌డి మార్గాల‌ను ఎంచుకోండి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రణాళికను కలిగి ఉండడం చాలా ముఖ్యం.

మీకు సరిపోయే సరైన పెట్టుబడులపై అవగాహన కలిగివున్నట్లైతే, దీర్ఘకాలం పాటు ఒకే చోట పెట్టుబడులు ఉంచ‌కుండా స‌మ‌యానుకూలంగా వ్యవహరించి పెట్టుబడులను మార్చుతూ మంచి రాబ‌డిని పొందొచ్చు.

ఉదాహరణకు, మీరు స్థిరత్వం అందించే స్థిర ఆదాయ పెట్టుబడి సాధ‌నాల్లో మ‌దుపు చేసిన‌పుడు రాబ‌డులు స్థిరంగా, పరిమితంగా ఉంటాయి. అయితే, దీర్ఘ కాలం పాటు మ‌దుపుచేసేవారికి ఈక్విటీ పెట్టుబ‌డులు మంచి రాబ‌డిని ఇచ్చేందుకు వీలుంటుంది. వీటిలో న‌ష్ట‌భ‌యం , అస్థిరత ఉన్నా దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని మ‌దుప‌ర్ల‌కు అందిస్తాయి.

  1. చిన్నమొత్తమైనా… క్ర‌మంగా …

ఇవాళ‌ పొదుపు చేసిన ఒక రూపాయి రేపు మరొక రూపాయిని సంపాదిస్తుంది. చిన్న పొదుపులు స్వల్ప కాలంలో మిమ్మల్ని ప్రభావితం చేయకపోయినా, దీర్ఘకాలంలో మీకు కచ్చితంగా సహాయపడతాయి.

ఉదాహరణకు, చిన్న పొదుపు సమీకరణకు పిగ్గీ బ్యాంకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఓర్పుతో క్రమంగా పొదుపు చేసినట్లయితే, కొంత కాలానికి అది ఇచ్చే మొత్తాన్ని చూస్తే మీరు ఆశ్చర్యానికి గురవుతారు.

  1. మీ పెట్టుబడి మొత్తాన్ని కాలక్రమేణా పెంచండి

కాలక్రమేణా మీ ఆదాయం పెరుగుతుంది కాబట్టి, మీ పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచండి. ఆదాయం పెరుగుతుంటే, దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయనే వాస్తవాన్ని మనలో చాలా మంది గుర్తిస్తారు. ఇది మనం చేసే వృధా ఖర్చుల కారణంగా ఏర్పడుతుంది. అందువలన మనం ఆదాయానికి తగ్గట్టుగా పెట్టుబ‌డి పెంచకపోతే, తక్కువ పొదుపును మాత్రమే కలిగి ఉంటాము.

  1. ఓర్పుతో ఉండండి

ఓర్పు అనేది సరికొత్త మేధస్సు. సమయం మీ గొప్ప వ్యూహం. దీర్ఘ కాలం, క్రమశిక్షణ, ఓర్పుతో పెట్టే పెట్టుబడులతో గొప్ప ఫలితాలను సాధించవచ్చు. ఓర్పు, ప్రాధాన్యత లేకపోవడం వలన కొన్ని సందర్భాల్లో మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాన్ని కోల్పోవచ్చు. మీ పెట్టుబడులు కాలక్రమేణా పెరిగి, గరిష్ట లాభాలను పొందేందుకు ఇది ఒక బలమైన పరిష్కారం చూపుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, హెచ్చుతగ్గులనేవి సాధార‌ణ‌మైన‌వి… ఒకవేళ మార్కెట్ అనుకూలంగా లేన‌పుడు బలహీనపడి మీ విశ్వాసాన్ని కోల్పో వద్దు. సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధిగమించి మంచి రాబడులను పొందడానికి ప్రయత్నించండి.

  1. తక్కువ సమయం

మీరు మ్యూచువల్ ఫండ్లు లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నెలకు రూ. 500 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే 5 నుంచి 8 సంవత్సరాల కాలం పాటు దానిని నిర్వహించవచ్చు. మీ పెట్టుబడులు మెరుగైన రాబడులను పొందడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి. వీటితో పన్ను ప్రయోజనాలను పొంద‌వ‌చ్చు. క‌నీసం సంవత్సరం పాటు మ్యూచువల్ ఫండ్ల‌లో పెట్టుబడి చేస్తే లాభం పొందువ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly