విలీనం దిశగా షాప్ క్లూస్?

స్నాప్‌డీల్‌ తీసుకున్న చర్యలు నష్టాల్ని భారీగా తగ్గించేందుకు సహాయం చేశాయి

విలీనం దిశగా షాప్ క్లూస్?

ఈ కామర్స్‌ సంస్థల్లో ఒకటైన షాప్ క్లూస్‌ను టేకోవర్‌ చేసుకునేందుకు స్నాప్‌డీల్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ డీల్‌ విలువ 200 నుంచి 250 మిలియన్‌ డాలర్ల మధ్య ఉండవచ్చని, ప్రస్తుతం ఈ సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు షాప్‌ క్లూస్‌ను సొంతం చేసుకోడానికి ప్రయత్నిస్తున్న స్నాప్‌డీల్‌ గతంలో విపరీతమైన నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో స్నాప్‌డీల్‌ను సొంతం చేసుకోడానికి ఫ్లిప్‌కార్ట్‌ తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ స్నాప్‌డీల్‌ ఆ డీల్ ను అంగీకరించకుండా, సొంతంగా వృద్ధి చెందాలనే ఆలోచనతో ప్రణాళికా బద్దంగా అడుగులు వేసింది. స్నాప్‌డీల్‌ తీసుకున్న చర్యలు నష్టాల్ని భారీగా తగ్గించేందుకు సహాయం చేశాయి. ఇప్పుడు తన కార్యకలాపాలను విస్తరించేందుకు చూస్తున్న స్నాప్‌డీల్‌ తాజాగా షాప్‌ క్లూస్‌ను సొంతం చేసుకునే ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం షాప్‌ క్లూస్‌ను కూడా నష్టాల బాటలో ఉన్న విషయం తెలిసిందే. అయితే స్నాప్‌డీల్‌ మాదిరిగా ఇది కూడా నష్టాలను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 347 కోట్ల నష్టంలో ఉన్న షాప్ క్లూస్ తర్వాతి ఆర్ధిక సంవత్సరంలో తన నష్టాలను రూ. 208 కోట్లకు తగ్గించుకుంది. ఇప్పటి వరకూ ప్రధాన నగరాల్లో మాత్రమే సేవలందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు ఇతర చిన్న నగరాలపై కూడా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ రెండు సంస్థల మధ్య డీల్‌ కుదిరినట్లైతే, మన దేశంలో సేవలందిస్తున్న అతిపెద్ద సంస్థల జాబితాలో ఇది కూడా చేరుతుంది. ప్రస్తుతం మన దేశంలో ఫ్లిప్‌కార్ట్‌ మొదటి స్థానంలో ఉండగా, అమెజాన్‌ రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఈ డీల్ తో స్నాప్‌డీల్‌ మూడో అతిపెద్ద సంస్థగా అవతరించనుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly