త్వ‌ర‌లో రూ.20 కొత్త‌నోటు

ఆర్బీఐ త్వ‌ర‌లో కొత్త రూ.20 నోటును విడుద‌ల చేయ‌నుంది. కొత్త డిజైన్‌, రంగు తుది రూపును ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది

త్వ‌ర‌లో రూ.20 కొత్త‌నోటు

రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) త్వ‌ర‌లోనే రూ.20 డినామినేష‌న్‌తో కొత్త నోట్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మ‌హాత్మాగాందీ(కొత్త‌) సీరీస్‌లో కేంద్ర బ్యాంకు గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ సంతకంతో ఈ నోట్లు విడుద‌ల కానున్నాయి. ఈ కొత్త రూ.20 నోట్ల రంగు ఆకుప‌చ్చ‌ ప‌సుపు వ‌ర్ణంలోఉండ‌నున్నాయి. ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, పక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంటుంది. దీంతోపాటు అశోకుడి స్తంభం కూడా ఉంటుంది. ఇక నోటు వెనకభాగంగంలో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వర్ణిస్తూ ఎల్లోరా గుహల చిత్రంతోపాటు స్వచ్ఛ భారత్‌ లోగో కూడా ఉంటుంది. కొత్త రూ.20 నోటు 63 మిమీ x 129 మిమీ పరిమాణంలో ఉంటుంద‌ని ఆర్‌బీఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత రూ.20 నోట్లు చెల్లుబాటవుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీని తాలూకు నమూనా నోటును ఆర్బీఐ విడుదల చేసింది. ఇప్పటికే రూ.10, రూ. 50, రూ.100 విలువచేసే కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly