ప్ర‌త్యేక అల‌వెన్సు క‌ల‌ప‌డంతో ఉద్యోగుల‌కు మ‌రింత లాభం

యాజమాన్యాలు తమ ఉద్యోగులకు చెల్లించే ప్రత్యేక అలవెన్సులు కూడా మూలవేతనంలో ఓ భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ప్ర‌త్యేక అల‌వెన్సు క‌ల‌ప‌డంతో ఉద్యోగుల‌కు మ‌రింత లాభం

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) లెక్కింపులో యజమానులు ఉద్యోగులకు అందించే ప్రత్యేక అలవెన్సులను కూడా మూల వేతనం కిందే పరిగణించి పీఎఫ్‌ మొత్తాన్ని గణించాలని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్‌ మొత్తాన్ని మినహాయించి ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు. దీనికి అదనంగా యజమాని కూడా అంతే మొత్తాన్ని పీఎఫ్‌ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యోగి మూల వేతనంలో ప్రత్యేక అలవెన్సు కూడా కలవడంతో ఎక్కువ మొత్తం పీఎఫ్‌ ఖాతాకు వెళుతుంది. ఇంతే మొత్తం యజమాని కూడా జమ చేయడంతో పీఎఫ్‌ ఖాతాలోకి అధిక మొత్తం చేరుతుంది. ఇది ఉద్యోగులకు లాభం క‌లిగిస్తుంది. మూల‌వేత‌నంలో ప్రత్యేక అలవెన్సును కలుపుతూ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ అనేక కంపెనీలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాయి. వీటిని పరిశీలించిన ధర్మాసనం వారి వాదనను తిరస్కరించింది. నిజానికి ఈ ప్రత్యేక అలవెన్సు కూడా మూలవేతనంలో భాగమే. ప్రత్యేక అలవెన్సు అనే పేరుతో పీఎఫ్‌లో కలపకుండా మినహాయింపు పొందడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఒక ఉద్యోగి చేసిన అదనపు సేవలకు ప్రోత్సాహ‌కాలుగా గాని మెప్పుదలగా దీన్ని ఇస్తున్నట్లుగా కంపెనీలు నిరూపించలేకపోయాయి. అందుకే ఈ ప్రత్యేక అలవెన్సు కూడా పీఎఫ్‌లో భాగంగా లెక్కించి తీరాలి’ అని బెంచ్‌ తన తీర్పులో పేర్కొంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly