జీవిత బీమా ఎంత కావాలి? ఎల్ఐసి టర్మ్ vs ఇతర పాలసీలు...

ట‌ర్మ్ పాల‌సీని చిన్న వ‌య‌సులోనే కొనుగోలు చేయ‌డం వ‌ల్ల‌ త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ పొంద‌వ‌చ్చు

జీవిత బీమా ఎంత కావాలి? ఎల్ఐసి టర్మ్ vs ఇతర పాలసీలు...

జీవన‌ శైలిలో విస్తృతమైన మార్పులు వ‌స్తున్నాయి. ఈ మార్పు, ఆహారపు అలవాట్లు, నిద్రించే వేళ‌లు, నిద్రా సమయం, మొబైల్, టివి వంటి ఎలక్ట్రానిక్ ఉప‌క‌ర‌ణాల వాడ‌కం, బైక్, కార్ వంటి ప్ర‌యాణ సాధ‌నాలు మొద‌లైన అనేక అంశాల‌తో జీవితం అనిశ్చితికు గుర‌వుతుంది. వీటికి తోడు విధుల‌ను నిర్వ‌హించ‌డంలో మాస‌సిక ఒత్తిడి, ల‌క్ష్యాల‌ను సాధించ‌టం, పిల్ల‌ల విద్య సంబంధ విష‌యాల‌లో ఆందోళ‌న వంటివి జీవ‌నంపై తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి. ఇంత‌కు ముందు రోజుల్లో ప్ర‌జ‌లు సాదార‌ణ విద్య‌, జీవించేందుకు స‌రిప‌డ ఆహారం, నివ‌సించేందుకు చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుంటే చాలు, హాయిగా జీవించేవారు. అంత‌కంటే ఎక్కువ ఉంటే వాటిని విలాసాలుగా భావించేవారు. కానీ ఒక‌ప్పుడు విలాసాలు అనుకున్న‌వే ఈ రోజు అవ‌స‌రాలుగా మారిపోయాయి. ఒకే వ్య‌క్తి సంపాద‌న‌పై మొత్తం కుటుంబం ఆదార‌ప‌డుతుంది. అందువ‌ల్ల కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌త్యామ్నాయ ఆదాయం ఏర్ప‌టు చేయ‌వ‌ల‌సిన భాద్య‌త కుటుంబ పెద్ద‌పై ఉంటుంది. ఒక‌వేళ కుటుంబంలో సంపాదించే వ్య‌క్తికి ఏదైనా జ‌రిగి ఆ వ్య‌క్తి, వైక‌ల్యం పొందినా లేదా మ‌ర‌ణించినా, ప్ర‌త్యామ్నాయ ఆదాయ మార్గం లేక‌పోతే కుటుంబంలోని మిగిలిన స‌భ్యుల జీవ‌నం క‌ష్ట‌త‌రంగా మారుతుంది. అటువంటి స‌మ‌యంలో కుటుంబ స‌భ్యులు ఆర్థికంగా ఇబ్బందులు ప‌డ‌కుండా జీవిత‌ బీమా హామీ స‌హాయ‌ప‌డుతుంది.

అయితే ఇక్క‌డ ఎదుర‌య్యే పెద్ద ప్ర‌శ్న - ఎంత మొత్తం హామీ ఉండాలి? ఇందుకు ప్రాథ‌మిక నియ‌మాలు - సంపాదించే వ్య‌క్తి వ‌య‌సు, వార్షిక ఆదాయం, ఆరోగ్యం లాంటివి. బీమా సంస్థ‌లు నిర్ధిష్ట వ్యక్తుల వివరాల ఆధారంగా వ్య‌క్తిగ‌త, కుటుంబ అవ‌స‌రాల‌కు స‌రిప‌డే విధంగా ఎండోమెంట్‌, హోల్‌లైఫ్ ఎండోమెంట్‌, మ‌నీబ్యాక్‌, యులిప్స్ వంటి కొత్త బీమా ప‌థ‌కాల‌ను విడుద‌ల చేస్తున్నాయి. కొన్ని పాల‌సీలు, మెచ్యూరిటీ విలువ‌తో పాటు బోన‌స్‌ల‌ను కూడా అందిస్తున్నాయి. యులిప్స్ మార్కెట్‌కు అనుసంధానించి ఉంటుంది. దీనిలో ప్రీమియంను స్టాక్ట్ మార్కెట్లో పెట్టుబ‌డి పెడ‌తారు. ఈ అన్ని పాల‌సీల‌లో ప్రీమియం అధికంగానూ, హామీ మొత్తం, రాబడి త‌క్కువ‌గానూ ఉంటాయి.

జీవిత బీమా ప‌థ‌కాల‌లో మ‌రొక పాల‌సీ ట‌ర్మ్ పాల‌సీ. దీనిలో త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ ల‌భిస్తుంది. ఇది చాలా మందికి తెలియ‌దు. బీమా ఏజెంట్ల క‌మీష‌న్ శాతం ఇత‌ర పాల‌సీల మాదిరిగానే ఉన్న‌ప్ప‌టికీ, ఇత‌ర పాల‌సీల‌తో పోలిస్తే ప్రీమియం త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న ఈ ప‌థ‌కం గురించి వారు ప్రాముఖ్య‌త ఇవ్వ‌రు. కాబ‌ట్టి చాలా మంది బీమా ఏజెంట్లు ఈ ట‌ర్మ్ పాల‌సీని కొనుగోలు చేయ‌మ‌ని సూచించ‌రు.

హామీ మొత్తం ఎంత ఉండాలి?

ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌ర‌కు ఆదాయం పెరుగుద‌లతో పాటు భ‌విష్య‌త్తు అవ‌స‌రాల ప్ర‌స్తుత విలువ‌కు స‌మానంగా హామీ ఉండాలి.

ఉదాహ‌ర‌ణ‌: రాజు వ‌య‌సు 40 సంవ‌త్స‌రాలు. అత‌ని నెల‌వారీ ఆదాయం రూ. 25 వేలు(వార్షికంగా రూ. 3 ల‌క్ష‌లు). 20 సంవ‌త్స‌రాల కాలానికి ట‌ర్మ్ పాల‌సీని తీసుకుంటే ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యం వ‌ర‌కు సంపాదించే ఆదాయాన్ని, ప్ర‌స్తుత విలువగా ప‌రిగ‌ణించి హామీ మొత్తం ఉండాలి. ఒక‌వేళ దుర‌దృష్ట‌వ‌సాత్తు రాజు మ‌రిణిస్తే, క్లెయిమ్ చేసిన మొత్తం విలువపై రాబ‌డి 8 శాతం, ద్ర‌వ్యోల్భ‌ణం 6 శాతం (20 సంవ‌త్స‌రాల కాలాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే) గా భావించి బీమా మొత్తాన్ని లెక్కించవచ్చు.

రాజు రూ. 5 ల‌క్ష‌ల‌కు ఎండోమెంట్ పాల‌సీ తీసుకుంటే అత‌ను మ‌ర‌ణించిన‌ప్పుడు అత‌ని కుటుంబ స‌భ్య‌ల‌కు రూ. 5 ల‌క్ష‌లు, బోన‌స్‌ల‌తో క‌లిపి గ‌రిష్టంగా రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు రావ‌చ్చు. వ‌చ్చిన హామీ మొత్తం అత‌ని కుటుంబ ఖర్చులకు ఎంత కాలం పాటు ఉపయోగ పడుతుంది? ఈ కింది ప‌ట్టిక ప్ర‌స్తుత వ‌య‌సు, ఆదాయం ఆధారంగా, ఎంత మొత్తం హామీ అందించే ట‌ర్మ్ పాల‌సీని తీసుకోవాలో సూచిస్తుంది.

LIC-PLANS-BIG.jpg

ఈ కింది 2వ ప‌ట్టిక ఎల్ఐసి ఎండోమెంట్, హోల్‌లైఫ్‌, ట‌ర్మ్‌పాల‌సీల‌ వార్షిక ప్రీమియంలును చూపిస్తుంది.

LIC-PLANS-1.jpg

మీరు ఎండోమెంటు పాల‌సీ లేక ఏ ఇత‌ర పాల‌సీల‌ను ఇప్ప‌టికే క‌లిగిఉన్న‌ప్ప‌టీ ఒక ట‌ర్మ్ పాల‌సీని కూడా కోనుగోలు చేయ‌డం మంచిది. ట‌ర్మ్ పాల‌సీ కాల‌ప‌రిమితి పూర్తైయ్యే నాటికి పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి జీవించి ఉంటే ఎటువంటి హామీ ల‌భించ‌దు అనే విష‌యాన్ని గుర్తించుకోవాలి. భ‌విష్య‌త్తులో క్లెయిమ్ చేయ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా బీమా సంస్థ‌కు స‌రైన వివ‌రాల‌ను అందించాలి. ఒక‌వేళ అవ‌స‌ర‌మైతే వైద్య నివేదిక‌లు అందించాలి.

సాదార‌ణంగా బీమా సంస్థ‌లు, 35 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు ఉన్న వ్య‌క్తుల వార్షిక ఆదాయానికి గరిష్టంగా 20 నుంచి 25 రెట్లు బీమా హామీని అందిస్తాయి. 50 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న వ్య‌క్తుల‌కు, వారి వార్షిక ఆదాయానికి గరిష్టంగా 10 రెట్లు హామీని మాత్ర‌మే అందిస్తాయి. అందువ‌ల్ల ట‌ర్మ్ పాల‌సీల‌ను చిన్న వ‌య‌సులోనే కొనుగోలు చేయ‌డం మంచిది. అంతేకాకుండా త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ పొందుతారు.

చివ‌ర‌గా:

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐసీఐసీఐ లైఫ్‌, మ్యాక్స్ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్ సంస్థ‌ల ట‌ర్మ్ పాల‌సీల‌ను పోల్చి చూడండి. ఈ సంస్థ‌ల క్లెయిమ్ ప‌రిష్కార నిష్ప‌త్తి నిల‌క‌డ‌గా 90 శాతం కంటే ఎక్కువ ఉంది.
సాధార‌ణంగా ప్ర‌జ‌లు, జీవిత బీమాను పెట్టుబ‌డి సాధ‌నంగా భావించి, వారి జీవిత‌కాలంలో మెచ్యూరిటీ ప్ర‌యోజ‌నాల‌ను ఆశిస్తారు. అయితే సంపాదించే వ్య‌క్తి జీవించిలేన‌ప్పుడు కూడా వారి కుటుంబానికి కావల‌సిన మొత్తాన్ని, జీవ‌న ప్ర‌మాణ స్థాయి త‌గ్గ‌కుండా, కుటుంబ ల‌క్ష్యాల‌ను చేరుకునేంత‌వ‌ర‌కు ఏక మొత్తంగా(లేక క్రమానుగత ఆదాయం) అందించ‌డ‌మే జీవిత బీమా ముఖ్య ఉద్దేశం. మ‌నం అవున‌న్నా, కాద‌న్నా ఇదే నిజం.

జీవిత బీమా ట‌ర్మ్ Vs ఎండోమెంట్ ప్లాన్‌

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly