ఒక ఫండ్ నుంచి మ‌రో ఫండ్లోకి బ‌దిలీ

ఒక ఫండ్ నుంచి మ‌రో ఫండ్ కు నిర్ణీత మొత్తంలో డ‌బ్బు బ‌దిలీ అవుతూ ఉంటుంది. దీనినే ఫిక్స్‌డ్ ఎస్‌టీపీగా వ్య‌వ‌హ‌రిస్తారు.

ఒక ఫండ్ నుంచి మ‌రో ఫండ్లోకి  బ‌దిలీ

సిస్ట‌మేటిక్ ట్రాన్స‌ఫ‌ర్ ప్లాన్ ద్వారా మ‌దుప‌రుల‌కు సంబంధించిన నిర్ణీత సొమ్ము మొత్తం ఒక ప‌థ‌కం నుంచి మ‌రోదానికి క్ర‌మంగా బ‌దిలీ అవుతుంది. ఒక స్థిరాదాయ ఫండ్ నుంచి ఈక్విటీ ప‌థ‌కానికి సొమ్ము బ‌దిలీ చేసుకోవాల‌ని అనుకునే వారు ఈ విధానంలో క్ర‌మంగా బ‌దిలీ చేసుకునేందుకు వీలుంటుంది. మ‌దుప‌ర్లు అధిక మొత్తంలో ఉండే నిధుల‌ను తొలుత డెట్‌లో మొత్తం పెట్టుబ‌డి సొమ్ము ఉంచి క్రమంగా ఎంపిక చేసిన ఈక్విటీ ఫండ్ల‌లోకి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. మార్కెట్ ఎప్పుడు బావుంటుంద‌ని వేచి చూడ‌కుండా స్థిరాదాయ ఫండ్ల నుంచి ఈక్విటీ ఫండ్ల‌లోకి క్ర‌మంగా పెట్టుబ‌డి చేసేందుకు ఇది మ‌దుప‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌నిచేసే విధానాన్ని బ‌ట్టి సిస్ట‌మేటిక్ ట్రాన్స‌ఫ‌ర్ ప్లాన్ల లో ర‌కాలు ఉంటాయి.

ఫిక్స్‌డ్ ఎస్‌టీపీ: ఒక ఫండ్ నుంచి మ‌రో ఫండ్ కు నిర్ణీత మొత్తంలో డ‌బ్బు బ‌దిలీ అవుతూ ఉంటుంది. దీనినే ఫిక్స్‌డ్ ఎస్‌టీపీగా వ్య‌వ‌హ‌రిస్తారు.

క్యాపిట‌ల్ అప్రిషియేష‌న్ ఎస్‌టీపీ: పెట్టుబ‌డి పెట్టిన దాంట్లో లాభంగా వ‌చ్చిందే వేరే ఫండ్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. అందుకే దీన్ని క్యాపిట‌ల్ అప్రిషియేష‌న్ ఎస్‌టీపీ అంటారు.

ఫ్లెక్సీ ఎస్‌టీపీ : మార్కెట్ నియంత్ర‌ణ‌లు, క‌నీస నిల్వ‌ను బ‌ట్టి ఇత‌ర ఫండ్‌కు బ‌దిలీ అవ్వాల్సిన సొమ్ము మారుతూ ఉంటుంది. అందుకే దీన్ని ఫ్లెక్సీ ఎస్‌టీపీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ విధానంలో నిధులు బ‌దిలీ చేసేందుకు మ‌దుప‌ర్లు ఫండ్ సంస్థల వ‌ద్ద‌ ల‌భించే ఎస్‌టీపీ ఫారం నింపాల్సి ఉంటుంది. వివిధ ప‌థ‌కాల‌కు, ప్ర‌ణాళిక‌ల‌కు వేర్వేరు ఫార‌మ్‌ల‌ను నింపాల్సి ఉంటుంది. ఏదైతే ఫండ్‌కు డ‌బ్బు పంపించాల‌నుకుంటున్నామో ఆ ఫండ్ పేరు, వివ‌రాలు అక్క‌డ రాయాల్సి ఉంటుంది. న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ ను నెల‌వారీకా, మూడునెల‌ల‌కు ఎన్ని నెల‌ల‌కు ఒక‌సారి చొప్పున చొప్పున చేయాలన్న విషయాన్ని పేర్కొనాలి. ఎస్‌టీపీ మొద‌లు తేదీ, ముగిసే తేదీని త‌ప్ప‌క పేర్కొనాలి. ఎంత సొమ్ము బ‌దిలీ అవ్వాలో కూడా సూచించాలి. మ‌దుప‌రి ఎంచుకున్న నిర్ణీత కాలం, మొత్తం పూర్త‌య్యే వ‌ర‌కు క్ర‌మంగా ఎస్‌టీపీ కొన‌సాగుతునే ఉంటుంది.

ఈ ఎస్‌టీపీ ని రెండు సంద‌ర్భాల్లో మ‌దుప‌ర్ల ఉప‌యోగించుకోవాలి. స్టాక్‌మార్కెట్లు మంచి లాభాల‌తో కొన‌సాగుతున్న‌ప్పుడు లేదా పూర్తిగా న‌ష్టాల్లో కొన‌సాగుతున్న‌ప్పుడు ఈ ఎస్‌టీపీ విధానాన్ని ఎంచుకోవాలి. ఎలా అంటే మార్కెట్లు లాభాల్లో ఉన్న‌పుడు మ‌దుప‌ర్లు త‌మ డ‌బ్బు ఎస్‌టీపీ విధానంలో క్ర‌మంగా తీసుకోవ‌చ్చు(ఈక్విటీ నుంచి డెట్‌కు బ‌దిలీ). మార్కెట్లు అనుకూలంగా లేన‌పుడు క్ర‌మంగా మార్కెట్లో మ‌దుపు చేసేంద‌కు వీలుంటుంది.

వ్య‌క్తి వ‌య‌సు పెరిగే కొద్దీ లేదా ఆర్ధిక లక్ష్యాలు సమీపిస్తున్నప్పుడు పెట్టుబ‌డుల‌ను క్ర‌మంగా ఈక్విటీ నుంచి డెట్‌కు బ‌దిలీ చేసుకోవాల్సిందిగా ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఈక్విటీలో కార్ప‌స్‌గా ఉన్న సొమ్మును క్ర‌మేపీ డెట్ ఫండ్‌కు సిస్టమెటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్‌ను ఉప‌యోగించి బదిలీ చేయ‌వ‌చ్చు. ఏదైనా ల‌క్ష్యానికి చేరువ అవుతున్న‌ప్పుడు, లేదా రిటైర్‌మెంట్ స‌మీపిస్తున్న‌పుడు ఈ విధానం ఉప‌యోగ‌ప‌డుతుంది.

అధిక మొత్తం లో డబ్బు పెట్టుబడి చేసుకోవడానికి ఇది చాలా మంచి పధ్ధతి. ఒకవేళ ఋ. 3-5 లక్షలు అలా ఉంటే, నేరుగా 6-7 నెలల పాటు సిప్ కూడా చేసుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly