తల్లిదండ్రులకు చెల్లించే అద్దెపై పన్ను మినహాయింపు వర్తిస్తుందా?

అద్దె చెల్లింపుకు సంబంధించి కొన్ని రకాల రుజువు పత్రాలను సమర్పించవలసి ఉంటుంది

తల్లిదండ్రులకు చెల్లించే అద్దెపై పన్ను మినహాయింపు వర్తిస్తుందా?

మీరు ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లైతే, ఆ సంస్థ యజమాని నుంచి మీరు ప్రతి నెలా హౌస్ రెంట్ అలవెన్సును(హెచ్ఆర్ఏ) పొందుతారు. మీరు ఇంటి అద్దెను చెల్లిస్తున్నందున హెచ్ఆర్ఏ కు సంబంధించి ఆదాయ పన్ను మినగయింపును పొందవచ్చు. ఒకవేళ మీ తల్లిదంద్రుల ఇంటిలో మీరు అద్దెకు ఉన్నట్లయితే, వారికి చెల్లించే అద్దె ప్రత్యేకంగా నిషేధించబడకపోయినా, బంధువులకు చెల్లించే అద్దెకు మాత్రం ఆదాయ పన్ను శాఖ స్క్రూటినీ, లిటిగేషన్, క్లెయిమ్ వాస్తవికతను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఇంట్లో మీరు అద్దెకు ఉంటున్నందున, అద్దె చెల్లింపుకు సంబంధించి కొన్ని రకాల రుజువు పత్రాలను సమర్పించవలసి ఉంటుంది. వీటిలో మీకు, మీ తల్లిదండ్రులకు మధ్య చేసుకున్న అద్దె ఒప్పంద పత్రం, మీ తల్లిదండ్రుల పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య), అద్దె చెల్లిస్తున్నట్లు రుజువు పత్రం, వీటితోపాటు మరికొన్ని రకాల పత్రాలను మీ యజమానికి సమర్పించవలసి ఉంటుంది. ఒకవేళ నెలసరి అద్దె రూ. 50,000 మించినట్లైతే, ప్రస్తుత ఆర్థిక చట్టం ప్రకారం వార్షిక అద్దెలో 5 శాతం పన్నును తీసివేసి మిగిలిన మొత్తాన్ని 30 ఏప్రిల్ (సంబంధిత ఆర్ధిక సంవత్సరం) నాటికి భారత ట్రెజరీలో డిపాజిట్ చేయవలసి ఉంటుంది.

మీ తల్లిదండ్రులు అద్దె రూపంలో పొందిన ఆదాయాన్ని, ఇతర (పన్ను చెల్లించే) ఆదాయాలతో కలిపి తెలుపవలసి ఉంటుంది. వార్షిక అద్దె(అద్దె - మున్సిపాలిటీకి చెల్లించిన మొత్తం) విలువలో 30 శాతం, వాస్తవ మునిసిపల్ పన్నులను, ఆస్తి కొనుగోలుకు తీసుకున్న రుణంపై వడ్డీని అద్దె ఆదాయం నుంచి మినహాయించవచ్చు. అలాగే మీ తల్లిదండ్రులు ఆస్తి కొనుగోలుకు తీసుకున్న రుణంపై వడ్డీకి పన్ను మినహాయింపు పొందవచ్చు (సంవత్సరానికి రూ. 2 లక్షలు).

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly