బ‌డ్జెట్ త‌ర్వాత డివిడెండ్ల‌పై ప‌న్ను ఎలా?

తాజా బ‌డ్జెట్‌లో డివిడెండ్ల‌పై ప‌న్నుకి సంబంధించి ముఖ్య‌మైన ప్ర‌క‌ట‌న విడుద‌లైంది

బ‌డ్జెట్ త‌ర్వాత డివిడెండ్ల‌పై ప‌న్ను ఎలా?

తాజా బ‌డ్జెట్‌లో డివిడెండ్ల‌పై ప‌న్నుకి సంబంధించి ఒక ముఖ్య‌మైన ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. చాలా మంది మ‌దుప‌రులు దీనిని కూడా దీర్ఘ‌కాల మూల‌ధ‌న లాభాలు(ఎల్‌టీసీజీ) లేదా స్వ‌ల్ప కాల మూల‌ధ‌న లాభాల‌(ఎస్‌టీసీజీ) కింద ప‌రిగ‌ణిస్తార‌ని న‌మ్ముతున్నారు. అస‌లు డివిడెండ్ల‌కు ఈ మూల‌ధ‌న ప‌న్నుల‌కు ఎలాంటి సంబంధం లేదు.

కంపెనీలు డివిడెండ్లు చెల్లించిన‌ప్పుడు ఇప్ప‌టికీ వాటిపై మ‌దుప‌రి కి ప‌న్ను ప‌డ‌దు. బ‌డ్జెట్‌కి ముందు స్టాక్‌లు, డెట్ ఫండ్ల ద్వారా వ‌చ్చిన డివిడెండ్ల‌పై సంబంధిత కంపెనీ/ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూష‌న్ ప‌న్నును వ‌సూలు చేసేవి. అయితే ఇప్ప‌టి నుంచి ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల డివిడెండ్ల‌ పైనా డివిడెండ్ డిస్ట్రిబ్యూష‌న్ ప‌న్ను వ‌ర్తిస్తుంది.

డివిడెండ్ డిస్ట్రిబ్యూష‌న్ ప‌న్ను వివ‌రాల‌ను తెలుసుకుందాం…
స్టాక్స్ - 17.47 శాతం
ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్ - 11.648 శాతం
డెట్ మ్యూచువ‌ల్ ఫండ్స్ - 29.2 శాతం

నోట్: పైన చెప్పిన మార్పుల‌న్నీ ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. డివిడెండ్ల‌పై ఆర్జించిన ఆదాయం వార్షికంగా రూ.10 ల‌క్ష‌లు దాటితే అద‌నంగా మ‌రో 10 శాతం ప‌న్ను క‌ట్టాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly