మీరు ఆఫ్ లైన్ లో పన్ను దాఖలు చేశారా?

2017-18 ఆర్థిక సంవత్సరం లేదా 2018-19 అస్సెస్మెంట్ సంవత్సరానికి గాను సవరించిన రిటర్న్స్ ను దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2019

మీరు ఆఫ్ లైన్ లో పన్ను దాఖలు చేశారా?

పన్ను దాఖలు ప్రక్రియను పూర్తిగా ఆన్ లైన్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా, ఇటీవల ఆదాయ పన్ను శాఖ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ ను మ్యాన్యువల్ గా లేదా ఆఫ్ లైన్ లో దాఖలు చేసినప్పటికీ, సవరించిన రిటర్న్స్ ను ఈ-ఫైల్ చేయవచ్చు. 2017-18 ఆర్థిక సంవత్సరం లేదా 2018-19 అస్సెస్మెంట్ సంవత్సరానికి గాను సవరించిన రిటర్న్స్ ను దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2019. మీరు సవరించిన రిటర్న్స్ ను ఎప్పుడు, ఎలా దాఖలు చేయాలో మీకోసం కింద తెలియచేయడం జరిగింది.

ఎప్పుడు దాఖలు చేయాలి?

ఒకవేళ మీరు దాఖలు చేసిన రిటర్న్స్ లో తప్పులు ఉన్నట్లు కనుగొన్నట్లయితే, ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 139 (5) ప్రకారం, సవరించిన రిటర్న్నును తిరిగి దాఖలు చేయడం ద్వారా మీ తప్పులను సరిచేసుకోవచ్చు.

ఏదైనా ఆదాయం లేదా తగ్గింపుల వివరాలను తప్పుగా నివేదించడం, మీ మొత్తం ఆదాయం రూ. 50 లక్షలు మించినప్పటికీ, మీ ఆస్తులు, రుణాలను బహిర్గతం చేయకపోవడం, విదేశీ ఆస్తులు లేదా విదేశీ ఆదాయాన్ని ఐటీఆర్ లో నమోదు చేయకపోవడం, తప్పుడు ఐటీఆర్ ఫారంను దాఖలు చేయడం వంటి వివిధ రకాల తప్పులను సరిదిద్దుకోవడానికి సవరించిన రిటర్న్స్ ను దాఖలు చేయవచ్చు. సవరించిన రిటర్న్స్ ను దాఖలు చేసే సౌకర్యం సంబంధిత ఆర్ధిక సంవత్సరం ముగింపు వరకు ఉంటుంది.

ఎలా దాఖలు చేయాలి?

సవరించిన రిటర్న్స్ ను దాఖలు చేయడానికి ఎలాంటి ప్రత్యేక ఫారం లేదు. మీరు గతంలో దాఖలు చేసిన అదే ఫారంలో దాఖలు చేయవలసి ఉంటుంది. సవరించిన రిటర్న్స్ కు దాఖలు ప్రక్రియ, ధృవీకరణ పద్ధతి కూడా అదే విధంగా ఉంటుంది. కేవలం సరైన ఫార్మాట్లలో వివరాలను మరలా నమోదు చేయండి.

అయితే, ఇది సవరించిన రిటర్న్ అని నిర్దేశించే ఖాళీలో టిక్ మార్క్ ను పెట్టడం మర్చిపోకండి. అలాగే, అసలు రిటర్న్స్ ను దాఖలు చేసిన తేదీ, 15 అంకెల రసీదు నెంబర్ వంటి వివరాలను కూడా పేర్కొనండి. ఒకవేళ అసలు రిటర్న్ ను ఆఫ్ లైన్ లో దాఖలు చేసి ఉంటే, రసీదు నెంబర్ 15 అంకెల కంటే తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో సవరించిన రిటర్న్ ను ఈ-ఫైలింగ్ చేసేటప్పుడు, రసీదు నెంబర్ ను 15 అంకెల నెంబర్ గా మార్చడానికి చివరిలో సున్నాలను జత చేయండి. ఉదాహరణకు, అసలు రిటర్న్ లో రసీదు సంఖ్య 198642864 అయితే, సవరించిన రిటర్న్స్ ను దాఖలు చేసేటప్పుడు 198642864000000 ఇలా సున్నాలను జత చేయండి.

నిర్దేశించిన ప్రమాణాన్ని నెరవేర్చినట్లయితే, రిటర్న్స్ ను ఎన్ని సార్లైనా సవరించుకోవచ్చు. దానికి ఎలాంటి పరిమితి లేదు. కానీ ఒకసారి సవరించిన రిటర్న్స్ ను దాఖలు చేసినట్లయితే, అసలు రిటర్న్స్ ను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly