ఈసాప్‌ల్లో ప‌న్ను ఎంత?

కంపెనీలు త‌మ‌ ఉద్యోగులకు షేర్ల‌ను కొనుగోలు చేసేందుకు ఇచ్చే ఆప్ష‌న్ ను ఈసాప్ (ఎంప్లాయ్ స్టాక్ ఆప్ష‌న్ ప్లాన్) అంటారు.

ఈసాప్‌ల్లో ప‌న్ను ఎంత?

కంపెనీలు త‌మ‌ ఉద్యోగులకు షేర్ల‌ను కొనుగోలు చేసేందుకు ఇచ్చే ఆప్ష‌న్ ను ఈసాప్ (ఎంప్లాయ్ స్టాక్ ఆప్ష‌న్ ప్లాన్) అంటారు. స్టాక్ ఆప్షన్ల‌ను రాయితీ ధ‌ర‌కు, మార్కెట్ ధ‌ర కంటే త‌క్కువ ధ‌ర‌కు అందిస్తారు. కంపెనీలు ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం ఉద్యోగులు త‌మ ఆప్ష‌న్లు ఉప‌యోగించుకుని షేర్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇది ప్ర‌త్యేక గ‌డువులో కంపెనీలు అందిస్తాయి. ఉద్యోగుల‌కు ఈసాప్ కంపెనీ ఇచ్చే రివార్డు వంటిది. అదేవిధంగా చాలా కంపెనీలు ఉద్యోగుల‌ను త‌మ సంస్థ‌లోనే కొన‌సాగేలా చేసుకునేందుకు కూడా ఈసాప్‌ను ఆఫ‌ర్ చేస్తాయి.

ఈసాప్‌ లు రాయితీ రేట్లతో ఉద్యోగికి అందించి, దీనిని ఎంచుకునేందుకు ఒక గ‌డువును ప్ర‌క‌టిస్తారు. దీనినే వెస్టింగ్ పీరియ‌డ్ అంటారు. ఆ గడువులోగా ఉద్యోగి స్టాక్‌ను ఎంచుకోక‌పోతే ఇక వారికి అవ‌కాశ‌ముండ‌దు. వివిధ రంగాల్లో ఉన్న అనేక సంస్థలు ప్ర‌తిభ ఉన్న ఉద్యోగులను ఆకర్షించేందుకు అదేవిధంగా నైపుణ్యం గ‌ల ఉద్యోగులు త‌మ సంస్థ‌లోనే కొన‌సాగేలా చేసేందుకు స్టాక్‌ల‌ను కేటాయిస్తున్నాయి.

ఈసాప్ ద్వారా ఉద్యోగి సంప‌ద‌ను సృష్టించుకునేందుకు వీలుంటుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ఇవి మంచి ఆప్ష‌న్‌గా చెప్పుకోవ‌చ్చు. షేర్ల ధ‌ర త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఎంచుకోవ‌డం మంచిద‌ని నిపుణుల స‌ల‌హా. అంటే త‌క్కువ ధ‌ర‌లో కొనుగోలు చేసి ఎక్కువ ధ‌ర ఉన్న‌ప్పుడు అమ్మేస్తే లాభం పొంద‌వ‌చ్చు. దీర్ఘ‌కాల సంపాద‌న‌కు ఈసాప్ మంచి అవ‌కాశ‌మ‌ని చెప్పుకోవ‌చ్చు. కొత్త‌గా స్టాక్ మార్కెట్లలో పెట్టుబ‌డులు పెట్టేవారికి ఈక్విటీ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులకు మంచి మార్గం. ఉద్యోగుల‌కు సాధార‌ణంగా కంపెనీ ప‌నితీరు గురించి తెలుస్తుంది కాబ‌ట్టి లాభ, న‌ష్టాల‌ను బేరీజు వేసుకొని పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు అయితే ఈసాప్ ఎంచుకునేముందు ఇందులో కొంత రిస్క్ ఉంద‌నే విష‌యం ఉద్యోగి గ్ర‌హించాలి. భ‌విష్య‌త్తులో కంపెనీ రాణించ‌క‌పోతే మీరు న‌ష్ట‌పోయే అవ‌కాశాలు ఉండొచ్చు.

ఈసాప్‌ల‌పై రెండు ద‌శ‌ల్లో ప‌న్ను వ‌ర్తిస్తుంది. మొద‌ట స్టాక్ ఎంచుకున్న‌ప్పుడు మార్కెట్ ధ‌ర కంటే ఉద్యోగి ఎంత త‌క్కువ ధ‌ర‌కు షేర్ల‌ను పొందుతున్నాడో దానిపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. మ‌రోసారి షేర్ల‌ను విక్ర‌యించేట‌ప్పుడు ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. ఈసాప్‌ల‌ను విక్ర‌యించేట‌ప్పుడు మూల‌ధ‌న ప‌న్ను ఉంటుంది. ఇందులో రెండు ర‌కాల ప‌న్ను విధానం ఉంటుంది. ఏడాది కంటే ఎక్కువ కాలం ఉంటే దీర్ఘకాలీక మూల‌ధ‌నంపై ప‌న్ను 10 శాతం ప‌డుతుంది. అయితే రాబ‌డి ల‌క్ష రూపాయ‌ల కంటే ఎక్కువ‌గా ఉంటేనే ఇది వ‌ర్తిస్తుంది. ఏడాది కంటే త‌క్కువ కాలం పెట్టుబ‌డి కొన‌సాగిస్తే స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఇది 15 శాతంగా ఉంటుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly