వాహ‌న బీమా గురించి 10 విష‌యాలు

వాహ‌న బీమా పొందే విధానం, ప్రీమియం లెక్కింపు, క్లెయిం ప‌ద్ధ‌తి తెలుసుకుందాం.

వాహ‌న బీమా గురించి 10 విష‌యాలు

వాహన బీమా కలిగి ఉంటే, వాహనదారుడికి కలిగే నష్టం నుంచి బీమా రక్షణ కల్పిస్తుంది. దీంతో పాటు ప్రమాదంలో ఇతరులకు జరిగే నష్టాన్ని భరిస్తుంది. ఇతర వ్యక్తులకు జరిగే నష్టాన్ని భరించడం వాహనదారుడి నైతిక బాధ్యత. బహిరంగ ప్రదేశంలో వాహనాన్ని వాడేటప్పుడు అవతలి వ్యక్తులకు మన వాహనం వల్ల జరిగే నష్టాన్ని భరించాలి. థర్డ్‌ పార్టీ బీమా చేయించుకుంటే అవతలి వ్యక్తులకు కలిగే నష్టాలను బీమా కంపెనీలే చెల్లిస్తాయి.

1.వాహన బీమా రకాలు :

ప్రధానంగా రెండు రకాల వాహన బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
లయబిలిటీ ఓన్లీ పాలసీ : ఈ పాలసీ కేవలం ప్రమాదంలో ఇతరులకు జరిగే నష్టానికి మాత్రమే బీమా కల్పిస్తుంది.
ప్యాకేజ్‌ పాలసీ : థర్డ్‌ పార్టీకి రక్షణతోపాటు సొంత వాహనానికి జరిగే నష్టాలకు బీమాను (ఓన్ డ్యామేజి) కవర్‌ కింద ఇస్తారు.

మీరు ఒకవేళ కేవలం లయబిలిటీ ఓన్లీ ప్లాన్‌ తీసుకుంటే మీ వాహనానికి కలిగే నష్టం బీమా కవరేజీలోకి పరిగణించరు. అందుకే ప్యాకేజీ పాలసీని తీసుకోవడం ద్వారా మీ వాహనానికి, మీకు, అవతలి వ్యక్తులకు రక్షణగా ఉంటుంది.

2. వాహన బీమా కవరేజీలో ఉండేవి :

వాహన బీమా పాలసీలో ఈ కింది తెలిపిన సందర్భాల్లో బీమా వర్తిస్తుంది.

 • అగ్నిప్రమాదాలు, పేలుళ్లు, మెరుపులు సంభవించినప్పుడు
 • వాహనం దొంగతనానికి గురయినప్పుడు
 • సమ్మె, హింసాత్మక అల్లర్లు జరిగినప్పుడు
 • భూకంపాలు సంభవించినప్పుడు
 • వరదలు, తుపాను, ఈదురుగాలులు, వడగళ్లవాన, మంచుతుపాను పడటం వల్ల
 • విద్రోహ చర్యలు చోటుచేసుకున్నప్పుడు
 • ఉగ్రవాద చర్యలు చోటుచేసుకున్నప్పుడు
 • రోడ్డు/రైలు/వాయు /అంతర్గత జలమార్గాలు/ లిఫ్టు లేదా ఎలివేటర్‌లో తరలించేటప్పుడు
 • కొండచరియలు విరిగిపడినప్పుడు

3. మోటారు బీమా వర్తించని సందర్భాలు :

ఎంత మొత్తానికి వాహన బీమా తీసుకున్నా కొన్ని సందర్భాల్లో వ్యక్తికి లేదా వాహనానికి అది వర్తించదు. అదేంటో చూద్దాం:

 • డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాన్ని నడిపితే
 • మద్యం లేదా మత్తుపదార్థాలు సేవించి వాహనం నడిపినప్పుడు
 • నిర్ణీత భౌగోళిక పరిమితులు దాటాక దుర్ఘటన చోటుచేసుకుంటే
 • వాహనాన్ని చట్టవిరుద్ధమైన పనులకు ఉపయోగిస్తే
 • ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ బ్రేక్‌డౌన్‌ జరిగినప్పుడు

4.బీమా సొమ్ముకు ప్రాతిపదికలు :

సొంత నష్టానికి (ఓన్‌ డ్యామేజీ)

 • బీమా చేయించుకున్న వ్యక్తికి నష్టం జరిగితే బీమా కల్పిస్తారు.
 • మోటారు వాహన పాలసీ ప్రకారం వాహన వాస్తవ విలువ ఆధారంగా బీమా ప్రకటిత విలువ (ఐడీవీ)ను నిర్ణయిస్తారు.
 • వాహన వాస్తవ విలువను వాహన తయారీదారు నిర్ణయించిన ధరను, వాహన వయసును బట్టి తరుగుదల పోనూ లెక్కిస్తారు.

ఇతరులకు జరిగే నష్టానికి (థర్డ్‌ పార్టీ) :

చట్ట ప్రకారం ప్రతి వాహన దారుడూ ఈ థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్ తప్పక కలిగి ఉండాలి. బీమా పొందిన వారి వాహనం వలన ఇతరులకు, వారి వాహనానికి జరిగిన నష్టానికి చెల్లించేందుకు ఈ పాలసీ అండగా నిలుస్తుంది.

5. ప్రీమియం చెల్లింపులు :

వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదం జరిగినదానికి మాత్రమే బీమా పొందాలనుకుంటే వివిధ రకాల బీమా కంపెనీలు వివిధ ప్రీమియం ఛార్జీలను వర్తింపజేస్తున్నాయి. మూడో వ్యక్తికి జరిగే ప్రమాదాలకు మరింత భిన్నమైన పాలసీ నియమాలు, ప్రీమియం చెల్లింపులుంటాయి. ఒక కంపెనీ ప్రీమియాన్ని మరో ప్రీమియంతో పోల్చి చూస్తే సరిపోదు. ఆయా పాలసీల్లో మినహాయింపులు, బీమా ప్రకటిత విలువను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రీమియం తక్కువగా ఉందని బీమా తీసుకుంటే అందులో మినహాయింపులు చాలా ఉండే అవకాశం ఉంది. క్లెయిం చేసుకునేటప్పుడు అన్ని రకాల నష్టాలకు బీమా అందక ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది.

6. ప్రీమియం లెక్కించేందుకు పరిగణనలోకి తీసుకునే వివరాలు :

 • వాహన రిజిస్ట్రేషన్‌ వివరాలు… ఇంజిన్‌ నెం. ఛాసిస్‌ సంఖ్య, వెహికిల్‌ క్లాస్‌, కెపాసిటీ, సీటింగ్‌ కెపాసిటీ లాంటివన్నమాట (ఈ వివరాలన్నీ ఆర్‌సీ బుక్‌లో పొందిపరిచి ఉంటాయి)
 • పన్ను కట్టిన రశీదులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, డ్రైవర్‌ వివరాలు … వయసు, అర్హత, లైసెన్స్‌ తదితర వివరాలు అందించాల్సి ఉంటుంది.
 • ‘ఓన్‌ డ్యామేజ్‌ కవర్‌’ ప్రీమియం రేట్లను బీమా కంపెనీలు నిర్ణయించుకోవచ్చు. దీని కోసం వాహన వయసు, రుసుములు, క్లెయిం చరిత్రను పరిగణలోకి తీసుకుంటారు.
 • ‘థర్డ్‌ పార్టీ లయబిలిటీ’ ప్రీమియం రేట్లను ఐఆర్‌డీఏ సూచించిన విధంగా నిర్ణయిస్తారు.
  రద్దయిన బీమాను పునరుద్ధరించుకోవాలనుకుంటే బీమా కంపెనీలు వాహనాన్ని తనిఖీ చేస్తాయి. దీనికి తోడు అదనపు ఛార్జీలను భరించాల్సి వస్తుంది.

7. పాలసీ కాలపరిమితి:

 • సాధారణంగా వాహన బీమా పాలసీ ఒక ఏడాది ఉంటుంది. దీన్ని గడువు తేదీలోగా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.
 • ప్రీమియం చెల్లించేందుకు బీమా కంపెనీలేవీ గ్రేస్‌ పీరియడ్‌ ఇవ్వవు.
 • పాలసీ కాలపరిమితి తర్వాత 90 రోజులు దాటితే నో క్లెయిం బోనస్‌ కూడా కోల్పోవాల్సి వస్తుంది.

8. ప్రమాదానికి గురైతే :

 • వాహనానికి మరమ్మతు చేయించాల్సిన అవసరముంటే బీమా కంపెనీని సంప్రదించి అధీకృత వాహన సర్వీసు సెంటర్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలి.
 • ఆ తర్వాత ప్రమాదం జరిగిన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయడం.
 • ప్రమాదానికి గురైన స్థలంలో వాహనాన్ని తనిఖీ చేసేందుకు బీమా కంపెనీ నుంచి తనిఖీ అధికారి వస్తారు.
 • అధికారి ప్రమాద తీరు, వాహనానికి, వ్యక్తులకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. ఫొటోలను కూడా తీసుకుని నివేదికను బీమా కంపెనీకి చేరవేస్తారు.

9. క్లెయిం చేసుకునేందుకు అవసరమైన పత్రాలు:

10. గమనిక :

 • వాహనదారులు ఏ కంపెనీ బీమా పాలసీనైనా తీసుకోవచ్చు. లేదా ఏ కంపెనీ పాలసీకైనా బదిలీ చేయించుకోవచ్చు.
 • వాహనానికి రుణం తీసుకున్న కంపెనీ సూచించిన బీమా కంపెనీలోనే బీమా చేయించుకోవాలనే నియమేమీ లేదు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly