మ్యూచువ‌ల్ ఫండ్ మ‌దుప‌ర్లు తెలుసుకోవాల్సిన‌ విష‌యాలు

యాక్టివ్ ఫండ్ల మేనేజ‌ర్లు స‌రైన స‌మ‌యంలోమంచి షేర్ల‌ను ఎంపిక చేస్తార‌ని మ‌దుప‌ర్లు భావిస్తారు. కాని కొన్ని సంద‌ర్భాల‌లో వారి అంచానాలు త‌ప్పు కావ‌చ్చు.

మ్యూచువ‌ల్ ఫండ్ మ‌దుప‌ర్లు తెలుసుకోవాల్సిన‌ విష‌యాలు

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టే ముందు మ‌దుప‌ర్లు న‌ష్ట‌భ‌యాన్ని అంచ‌నా వేసుకునేంద‌కు రిస్క్ ప్రొఫైల‌ర్ లాంటి ఆన్‌లైన్ టాల్‌ల‌ను ఉప‌యోగించ‌డం మంచిది. వీటి ద్వారా మ‌దుప‌ర్లు త‌మ‌ న‌ష్ట‌భ‌యం అంచ‌నా వేసుకోవ‌చ్చు. ఈక్వీటీ ఫండ్లన్నింటిలో రిస్క్ ఒకే విధంగా ఉండ‌దని మ‌దుప‌ర్లు గ‌మ‌నించాలి. కొన్ని ఈక్విటీ పండ్ల‌లో రిస్క్ త‌క్కువ‌గాను, మ‌రికొన్నింటిలో ఎక్కువ‌గానూ ఉంటుంది. యాక్టివ్ ఫండ్లలో న‌ష్ట‌భ‌యం ప్యాసివ్ ఫండ్ల కంటే ఎక్కువ‌గా ఉంటుంది. యాక్టివ్ ఫండ్ల మేనేజ‌ర్లు స‌రైన స‌మ‌యంలోమంచి షేర్ల‌ను ఎంపిక చేస్తార‌ని మ‌దుప‌ర్లు భావిస్తారు. కాని కొన్ని సంద‌ర్భాల‌లో వారి అంచానాలు త‌ప్పు కావ‌చ్చు. మంచి ప‌థ‌కాలుగా కొన‌సాగుతున్న‌వి కూడా ఫండ్ మేనేజ‌ర్ల అంచ‌నాలు త‌ప్ప‌డం వ‌ల్ల రాబ‌డిలో హెచ్చ‌త‌గ్గులు ఉండొచ్చు.

ప్యాసివ్ ఫండ్ల విష‌యం చూస్తే ఈక్వీటీ ఫండ్ల‌లో ఇండెక్స్ ఫండ్లు, ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌) త‌క్కువ రిస్క్ ఉండే ఫండ్లు. ఫండ్ మేనేజ‌ర్లు సంబంధిత సూచీలో ఉన్న విధంగానే మదుపు చేయడం వ‌ల్ల అవి బెంచ్‌మార్క్ సూచినీ ప్ర‌తిబింబిస్తాయి. ఈ సూచీల్లో వివిధ రంగాల‌కు చెందిన కంపెనీలు ఉంటాయి కాబ‌ట్టి పెట్టుబ‌డి వైవిధ్య‌త ఉంటుంది. దీంతో న‌ష్ట‌భ‌యం త‌గ్గుతుంది. ప్యాసివ్ ఫండ్ల లో రాబ‌డి స‌ద‌రు బెంచ్‌మార్క్ సూచీపై ఆధార‌ప‌డి ఉంటుంది.

లార్జ్ క్యాప్ కంపెనీల్లో పెట్ట‌బ‌డులు పెట్టే మ్యూచువ‌ల్ ఫండ్లను లార్జ్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్లు అంటారు. ఈ కంపెనీలు త‌క్కువ న‌ష్ట‌భ‌యం క‌లిగి ఉంటాయి. మార్కెట్ క్యాపిలైజేష‌న్ లో తొలి 100 సంస్థ‌ల‌ను లార్జ్ క్యాప్ కంపెనీలుగా ప‌రిగ‌ణిస్తారు. స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం కొంత అధికంగా ఉంటుంది. వీటిలో మార్కెట్ అనుకూలంగా ఉన్న‌పుడు లాభాలు అధిక‌మే, ప్ర‌తికూలంగా ఉన్న‌పుడు న‌ష్టాలు అధికంగానే ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఒక సంవ‌త్స‌రంలో లార్జ్‌ క్యాప్ ఫండ్లు 14 శాతం ప‌త‌న‌మ‌యితే స్మాల్‌, మిడ్ క్యాప్ ఫండ్లు 21 శాతం మేర ప‌త‌న‌మ‌య్యాయి. స్మాల్ , క్యాప్ మిడ్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెరుగుతున్న మార్కెట్ల‌తో పాటు అధిక రాబ‌డుల‌ను ఇస్తాయి. కానీ మార్కెట్ల ప‌త‌నం అయితే ప్ర‌మాద స్థాయి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు వీటిలో పెట్టుబ‌డి పెట్టే ముందు నిపుణుల స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌లో థిమేటిక్, సెక్టార్ ఫండ్లలో న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గానే ఉంటుంది. కార‌ణం ఇవి ఒకే రంగానికి చెందిన వాటిలో పెట్టుబ‌డి చేస్తుంటాయి. దీంతో పెట్టుబ‌డి వైదిధ్య‌త త‌గ్గుతుంది. మౌళిక స‌దుపాయ‌ రంగాలు, బ్యాంకులు, ఆర్థిక సంబంధింత రంగాల్లో పెట్టుబ‌డి చేసే వాటిని సెక్టార్ ఫండ్లు అంటారు. సెక్టార్ ఫండ్ ఒక‌టి లేదా రెండు రంగాల‌లో మాత్ర‌మే పెట్టుబ‌డి పెడుతుంది. ఒక థీమ్ ఆధారంగా పెట్టుబ‌డి చేసే ఫండ్ల‌ను థిమాటిక్ ఫండ్లు అంటారు. సెక్టార్ ఫండ్లలోలా నిర్ధిష్ట రంగాల‌లోనే కాకుండా వివిధ రంగాల‌కు చెందిన కంపెనీల్లో మ‌దుపుచేసేందుకు వీలుంటుంది. ఎంచుకున్న రంగాలు, కంపెనీల షేర్లు బాగా రాణిస్తే సెక్టార్, థిమేటిక్ ఫండ్లు అధిక రాబ‌డి నిచ్చే అవ‌కాశం ఉంది. అయితే వీటిలో పెట్టుబడి చేసే వారు ఈ త‌ర‌హా ఫండ్ల‌లో ఎప్ప‌డు పెట్టుబ‌డి పెట్టాలి? ఎప్పుడు విర‌మించుకోవాలి అనే విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉండాలి.

ప్రతి మ్యూచువల్ ఫండ్ ఫ‌థ‌కంలోనూ కొంత రిస్క్ ఉంటుంది. అయితే ఈక్వీటీ ఫండ్ల‌లో మ‌దుపు చేస్తూ న‌ష్ట‌భ‌యాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. క‌నీసం 5 సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువ కాలం పెట్టుబ‌డి చేసే ఉద్దేశం ఉంటేనే వీటిలో మ‌దుపుచేయాలి.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly