థర్డ్‌పార్టీ బీమా ప్రీమియాన్ని పెంచిన ఐఆర్‌డీఏఐ...

ఐఆర్‌డీఏ పెంచిన ధరలను ఒకసారి పరిశీలిస్తే

థర్డ్‌పార్టీ  బీమా ప్రీమియాన్ని పెంచిన ఐఆర్‌డీఏఐ...

వాహనాల థర్ట్‌ పార్టీ బీమా ప్రీమియాన్ని పెంచుతూ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నిర్ణయం తీసుకుంది. పెరిగిన ప్రీమియం ధరలు జూన్‌ 16 నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వులలో తెలిపింది. సాధారణంగా ఐఆర్‌డీఏ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఈ రేట్లను సవరిస్తూ ఉంటుంది. ఐఆర్‌డీఏ పెంచిన ధరలను ఒకసారి పరిశీలిస్తే… కార్ల విభాగంలో 1000 సీసీ లోపు ఉన్న కార్లకు రూ. 2,072, అలాగే 1,000 నుంచి 1,500 సీసీ మధ్య ఉన్న కార్లకు రూ. 3,221, అదే విధంగా 1500 సీసీ ఆపై ఉన్న కార్లకు రూ. 7,890 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ద్విచక్ర వాహనాల ప్రీమియం రేట్లను పరిశీలిస్తే, గత ఏడాదికి, ఇప్పటికి ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదు.

సాదారణంగా కొత్త కార్లకు మూడేళ్ల పాటు, అలాగే కొత్త బైకులకు ఐదేళ్ల పాటు తప్పనిసరిగా థర్డ్‌ పార్టీ బీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కార్లకు 1,000 సీసీ లోపు ఉన్న కార్లకు రూ. 5,286 ప్రీమియం, అలాగే 1000 నుంచి 1500 సీసీ కార్లకు రూ. 9,534, అదే విధంగా 1500 సీసీ ఆపై ఉన్న కార్లకు రూ. 24,305 ప్రీమియం చెల్లించాలి. అదే ద్విచక్ర వాహనాల విషయంలో 75 సీసీ లోపు ఉన్న బైకులకు రూ. 1,045 ప్రీమియం, అలాగే 75 నుంచి 150 సీసీ మధ్య ఉన్న బైకులకు రూ. 3,285, అదే విధంగా 150 నుంచి 350 సీసీ మధ్య ఉన్న బైకులకు రూ. 5,433, అదే 350 సీసీఆ పైన సీసీ ఉన్న బైకులకు రూ. 13,034 థర్డ్‌ పార్టీ ప్రీమియం చెల్లించాలి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly