అదిరిపోయే ఫీచర్స్ తో శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్...

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ రెండు వేరియంట్లలో లభిస్తుందని సంస్థ ప్రకటించింది

అదిరిపోయే ఫీచర్స్ తో శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్...

చాలా రోజుల నిరీక్షణ తరువాత, శామ్సంగ్ తన సరికొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్‌ను ఈ రోజు భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫిబ్రవరి 3, 2020 న ఈ ఫోన్ మొదటి సేల్ ను నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లు, శామ్‌సంగ్.కామ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ గతంలో విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 తరువాతి వెర్షన్, అయితే ఇది సరికొత్త, పవర్ ఫుల్ ఫీచర్స్ తో అందుబాటులో ఉండనుంది. ఇది టెక్స్ట్ ఎక్స్‌పోర్ట్ ఫీచర్‌తో సరికొత్త, మెరుగైన ఎస్-పెన్‌తో అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా, ఇది బ్లూటూత్ లో-ఎనర్జీ (బీఎల్ఈ) సపోర్ట్, ఎయిర్ కమాండ్‌తో పాటు రిమోట్ షట్టర్ ఆప్షన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంది, దీనిని ఉపయోగించి వినియోగదారులు రిమోట్‌ తో ఫోటోను క్లిక్ చేయవచ్చు. పెన్నులోని షట్టర్ ఆప్షన్ సంగీతాన్ని ప్లే చేయడం, పాజ్ చేయడం, స్క్రీన్‌ను తాకకుండా ఫోటోలను స్క్రోల్ చేయవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ధర :

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ రెండు వేరియంట్లలో (6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) లభిస్తుందని సంస్థ ప్రకటించింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 38,999 గాను, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 40,999 గా సంస్థ నిర్ణయించింది. అలాగే శామ్సంగ్ రూ. 5,000 వరకు అప్‌గ్రేడ్ ఆఫర్ ను కూడా అందిస్తుంది, దీంతో వినియోగదారులు గెలాక్సీ నోట్ 10 లైట్‌ను రూ. 33,999 లకే కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ నోట్ 10 లైట్ ప్రీ-బుకింగ్ ఈ రోజు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ప్రారంభమైంది. అలాగే ఫిబ్రవరి 3 నుంచి ప్రధాన రిటైల్ దుకాణాలు, ఆన్‌లైన్ స్టోర్లు, శామ్‌సంగ్.కామ్‌లో అందుబాటులో ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్పెసిఫికేషన్స్ :

  • 6.7 ఇంచ్ ఇన్ఫినిటీ-ఓ డిస్ ప్లే
  • ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం
  • ఎక్సినోస్ 9810 ప్రాసెసర్
  • 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, వీటిని 1 టీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు
  • వెనుకవైపు 12 ఎంపీ+ 12 ఎంపీ+ 12ఎంపీ ట్రిపుల్ కెమెరా సెట్ అప్
  • ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • 4500 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly