30 నిమిషాల్లో కారు లోన్..

టీఎంసీ అనేది గ్లోబల్ ఆటో దిగ్గజం టయోటా, పూణేకు చెందిన కిర్లోస్కర్ బ్రదర్స్ మధ్య జాయింట్ వెంచర్

30 నిమిషాల్లో కారు లోన్..

జపాన్ కు చెందిన కార్ల తయారీ సంస్థ టయోటా ఇండియా తమ వినియోగదారులకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. దరఖాస్తు చేసుకున్న 30 నిమిషాల్లోగా కారు రుణాన్ని అందించే సదుపాయాన్ని గురువారం ప్రారంభించింది. దీని పేరు “తత్కాల్” లోన్. మా వినియోగదారులకు ఈ కొత్త సర్వీస్ దరఖాస్తు చేసుకున్న 30 నిమిషాల్లోగా రుణ ఆమోదం పొందే వీలును కల్పిస్తుందని టయోటా మోటార్ కార్ప్ (టీఎంసీ) ప్రకటన ద్వారా తెలిపింది.

టీఎంసీ అనేది గ్లోబల్ ఆటో దిగ్గజం టయోటా, పూణేకు చెందిన కిర్లోస్కర్ బ్రదర్స్ మధ్య జాయింట్ వెంచర్. రుణ ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడానికి టయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది.

టయోటా కారు ఎక్స్-షోరూమ్ ధరలో 85 శాతం వరకు మొత్తానికి రుణాన్ని మంజూరు చేస్తారు, అలాగే తత్కాల్ లోన్ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారుల బ్యాంక్ ఖాతాను, సిబిల్ క్రెడిట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. వ్యక్తిగత ఉపయోగం కోసం కారును కొనాలనుకునే వారు తమ గుర్తింపు కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, నివాస యాజమాన్య రుజువు, ఫోటోను సమర్పించి కారు రుణాన్ని పొందవచ్చు.

ఈ రుణాన్ని పొందాలనుకునే వారు వ్యక్తిగతంగా హాజరుకాకుండానే, కేవలం టెలీ-వెరిఫికేషన్ ద్వారా రుణాన్ని పొందే అవకాశాన్ని కూడా టయోటా అందిస్తుంది. తత్కాల్ లోన్ సర్వీసుతో, మా వినియోగదారులందరికీ కారు కొనుగోలు ప్రక్రియను సరళంగా మార్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని, అవసరమైన పత్రాలను సమర్పించి 30 నిమిషాల్లోగా రుణాన్ని పొందవచ్చునని టయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తోమోహీ మట్సుషిత తెలిపారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly