పీఎఫ్‌ ఖాతాను ఆన్‌లైన్‌లో బదిలీ చేసుకోండి

సాధారణంగా చాలా మంది ఉద్యోగం మారినప్పుడు కొత్త పీఎఫ్‌ ఖాతాను తెరిచేందుకే మొగ్గుచూపిస్తారు. దీని వల్ల పాత ఖాతాలోని సొమ్ము అలాగే ఉండి పోతుంటుంది.

పీఎఫ్‌ ఖాతాను ఆన్‌లైన్‌లో బదిలీ చేసుకోండి

కారణాలేవైనా కొన్ని సార్లు చేస్తున్న ఉద్యోగం మానేసి మరో ఉద్యోగానికి మారాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలో చేయాల్సిన ముఖ్యమైన పని ఉద్యోగ భవిష్య నిధి ఖాతాను బదిలీ చేయించుకోవడం. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సాధారణంగా చాలా మంది ఉద్యోగం మారినప్పుడు కొత్త పీఎఫ్‌ ఖాతాను తెరిచేందుకే మొగ్గుచూపిస్తారు. బదిలీ చేసుకునే విధానం తెలియకనో, పాత యాజమానితో ఈ విషయమై చర్చిండం ఇష్టం లేకనో దాదాపు చాలా మంది పాత ఉద్యోగ భవిష్య నిధి ఖాతాను అలాగే వదిలేస్తుంటారు. దీని వల్ల పాత ఖాతాలోని సొమ్ము అలాగే ఉండి పోతుంటుంది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ బదిలీ ప్రక్రియను సులభతం చేసేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.

బదిలీ చేసే వెసులుబాటు:

ప్రస్తుత పాత ఖాతాను ఆన్‌లైన్‌లో బదిలీ చేసే వీలుందో లేదో పరిశీలించండి. ఇందుకోసం http://memberclaims.epfoservices.in/heck_eligibility.php/ లింక్‌ను క్లిక్‌ చేయండి. పాత, కొత్త పీఎఫ్‌ ఖాతాల వివరాలు నమోదు చేయండి. ఈ వివరాలు సబ్‌మిట్‌ చేశాక ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ సాధ్యాసాధ్యాలు తెలుస్తాయి.

రిజిస్ట్రేషన్‌:

ఆన్‌లైన్‌లో పీఎఫ్‌ ఖాతాను బదిలీ చేసేందుకు అర్హత కలిగినట్టయితే ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లో రిజిస్టర్‌ అవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం http://members.epfoservices.in/employee_reg_form.php లింక్‌ను క్లిక్‌ చేయండి.

ఇక్కడ ప్రత్యక్షమయ్యే తెరపై మొబైల్‌ నెంబరు, పుట్టిన తేదీ, ఏదైనా గుర్తింపు కార్డు వివరాలను సంబంధిత గడుల్లో నింపాలి. మొబైల్‌ నంబరుకు ఒక పిన్‌ నెంబరు వస్తుంది. దాన్ని కూడా నమోదు చేసి సబ్‌మిట్‌ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ జరిగినట్టు ధ్రువీకరణ సమాచారం వస్తుంది.

మెంబర్‌ క్లెయిం పోర్టల్‌:

రిజిస్టర్‌ అయినట్టు సమాచారం అందుకున్నాక ఈపీఎఎఫ్‌వో Member Claims Portal లోకి వెళ్లాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉపయోగించిన గుర్తింపు కార్డు వివరాలను, మొబైల్‌ నంబరును ధ్రువీకరించుకున్నాక మెంబర్‌ పోర్టల్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి వస్తుంది.

బదిలీ అభ్యర్థన:

పీఎఫ్‌ బదిలీ ఫారంను ఎంచుకోవాలి. ఇది మూడు విభాగాలుగా ఉంటుంది. మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం నమోదుచేయాలి. రెండో విభాగంలో పాత పీఎఫ్‌ ఖాతా వివరాలు నమోదు చేయాలి. మూడో విభాగంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన సంస్థ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పాత, కొత్త సంస్థల పీఎఫ్‌ వివరాలను జాగ్రత్తగా నమోదు చేసేందుకు దరఖాస్తు ఫారంలో పొరపాట్లు జరిగితే మార్చుకునేందుకు ప్రివ్యూ ఆప్షన్‌ ఉంటుంది.
ఆ తర్వాత సబ్‌మిట్‌ నొక్కితే బదిలీ విధానాన్ని ఈపీఎఫ్‌వో చూసుకుంటుంది. ఈ వివరాలు మీ మొబైల్‌ నంబరుకు వస్తాయి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

  • బదిలీ క్లెయిం ఫారాన్ని నింపేటప్పుడు పీఎఫ్‌ వివరాలు గుర్తులేనట్టయితే , పీఎఫ్‌ నంబరు నింపాల్సిన గడి పక్కన క్లిక్‌ చేస్తే సరిపోతుంది. దీని ఆధారంగా పీఎఫ్‌ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

  • పీఎఫ్‌ క్లెయిం ఫారాన్ని సబ్‌మిట్‌ చేశాక , మెంబర్‌ క్లెయిమ్స్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ అయి బదిలీ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

  • యూనివర్సల్‌ అకౌంట్‌ నెంబర్‌ (యూఏఎన్‌) ఉన్నట్టయితే ఈ బదిలీ విధానం మరింత సులభతరమవుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly