ప్ర‌యాణ‌బీమాతో ప్ర‌యోజ‌నం ఏంటి?

విదేశాల‌కు తరచూ ప్రయాణాలు చేసే వారైతే ప్రయాణ బీమా పథకాన్ని త‌ప్ప‌క కొనుగోలు చేయాలి.

ప్ర‌యాణ‌బీమాతో ప్ర‌యోజ‌నం ఏంటి?

ప్రయాణ బీమా పథకం విదేశాల‌కు ప్రయాణించే సమయంలో మీరు వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేయడానికి ఉద్దేశించినది. అయితే ఇది వైద్యపరమైన అత్యవసర విషయాలు కవర్ చేసేది మాత్రమే కాదు. సామాను, విమాన జాప్యాలు, పాస్పోర్ట్ కోల్పోవడం, విమాన హైజాక్ మొదలైన ప్ర‌యాణికుల‌కు క‌లిగే ఇబ్బందుల‌ను క‌వ‌ర్ చేస్తాయి. స్కెంజెన్ దేశాలు ప్రయాణ బీమా క‌లిగి ఉండ‌టం తప్పనిసరి చేశాయి. ప్ర‌యాణ బీమాను ముందుగానే కొనవచ్చు. మీ ప్రయాణ తేదీ నాటికి వర్తించే విధంగా ముందుగానే ప్రణాళిక వేసుకోవచ్చు.

ఎంత ఖర్చు అవుతుంది?

ప్ర‌యాణ బీమా ప్రీమియం ఖర్చు దేశం, బీమా హామీ మొత్తంపై ఆధారపడి ఉంటాయి. ఒక 30 ఏళ్ల వ్య‌క్తి 15 రోజుల పర్యటన కోసం 50,000 డాల‌ర్ల‌ బీమా వైద్య మొత్తం,15,000 డాల‌ర్ల‌ వ్యక్తిగత ప్రమాద బీమా హామీ మొత్తం ఇతర ప్రయాణ అసౌకర్యానికి సంబంధించిన కవరేజీ క‌లిగిన‌ ప్రయాణ బీమా పథకాన్ని కొనుగోలు చేసేందుకు యూఎస్ఏ, కెనడాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు రూ. 1,257 అద‌నంగా ప‌న్నులు. ప్రీమియం యూఎస్ఏ, కెనడా మినహాయించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు రూ. 871 అద‌నంగా పన్నులు ఉంటాయి. ప్రమాదం కవరేజీ, వైద్యబీమా మొత్తం అన్ని ప్రయాణ బీమా పాల‌సీల్లో ప్ర‌త్యేకంగా వేర్వేరు అంశాలుగా ఉండ‌క‌పోవ‌చ్చు. ఈ సంద‌ర్భంలో ఉదాహరణగా తెలిపేందుకు పేర్కొన‌డం జ‌రిగింది.

ఎందుకు ముఖ్యం?

విదేశాల‌కు తరచూ ప్రయాణాలు చేసే వారైతే ప్రయాణ బీమా పథకాన్ని త‌ప్ప‌క కొనుగోలు చేయాలి. వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఇతర దేశాల్లో అధిక వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇతర దేశాలలో మ‌న దేశంలో కంటే 6-7 శాతం ఎక్కువ వైద్య‌ ఖర్చు ఉంటుంది. అమెరికాలో అయితే సుమారు 50-100% ఎక్కువ ఖర్చుతో వైద్య ఖర్చులు కూడికుని ఉంటాయ‌ని నిపుణులు అంటున్నారు. నెలకు రెండు అంత‌కంటే ఎక్కువ లేదా ఎక్కువ‌గా విదేశాల‌కు వెళ్లే ప్ర‌యాణికులు క‌చ్చితంగా వార్షిక విదేశీ ప్రయాణ బీమా పథకాన్ని కొనుగోలు చేయ‌డం మంచిద‌ని బీమా నిపుణులు చెబుతున్నారు. ఇతర యాత్రికులు వారి పర్యటనలను బ‌ట్టి ఒక్కో ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌త్యేకంగా బీమా కొనుగోలు చేసుకోవ‌డం మంచిది.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly