పెట్టుబ‌డుల‌పై న‌ష్ట‌భ‌యం ప్ర‌భావం

న‌ష్ట‌భ‌యం(రిస్క్‌) అనే ప‌దాన్ని మ‌దుప‌రులు త‌ర‌చుగా వింటుంటారు. వాటి ప్ర‌భావాలు, త‌గ్గించుకునే ఉపాయాల‌పై స‌మ‌గ్ర క‌థ‌నం

పెట్టుబ‌డుల‌పై న‌ష్ట‌భ‌యం ప్ర‌భావం

పెట్టుబడి పెట్టే ముందు మ‌దుప‌ర్లు ఆలోచించే విష‌యం రాబ‌డి . పెట్టుబ‌డుల పై వ‌చ్చే రాబ‌డి కోసం చ‌ర్చించే సమ‌యంలో మ‌దుప‌ర్ల‌కు వ‌చ్చే ఆలోచ‌న న‌ష్ట‌భ‌యం. ఫ‌లానా ప‌థ‌కంలో మ‌దుపుచేస్తే ఎంత న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌నే విష‌యం మ‌దుప‌ర్లు తెలుసుకుంటారు

న‌ష్ట‌భ‌యం అంటే

మ‌దుప‌ర్లు తాము అంచ‌నా వేసిన రాబ‌డి కంటే త‌క్కువ రాబ‌డి వ‌చ్చే ప‌రిస్థితిని న‌ష్టభ‌యం అంటారు. ప్ర‌భుత్వ సెక్యురిటీల‌లో త‌ప్ప ప్ర‌తీ పెట్టుబ‌డి సాధ‌నంలో ఎంతోకొంత న‌ష్ట‌భ‌యం ఉంటుంది. న‌ష్ట‌భ‌య తీవ్ర‌త ఆయా పెట్టుబ‌డి సాధ‌నాలు ఇచ్చే రాబ‌డి పై ఆధార‌ప‌డి ఉంటుంది.

న‌ష్టం - రాబ‌డి

రాబ‌డి,న‌ష్ట‌భ‌యం రెండూ ఒకే దిశలో పయనిస్తాయి. ఎక్కువ‌గా ఉన్న పెట్టుబ‌డి సాధ‌నాల్లో ఎక్కువ రాబ‌డి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉన్న సాధ‌నాల్లో త‌క్కువ రాబ‌డి ఉంటుంది.

పెట్టుబడి పెట్టాలనే యోచన సాధారణంగా వ్యక్తి వయసు, ఆదాయం, పెట్టుబడులతో ఉన్న అనుభవం,రాబడులను అర్థం చేసుకోవడం, సదరు పెట్టుబడి పథకాలపై అవగాహన, సరైన నిర్ణయం తీసుకోగల నేర్పును బట్టి ఉంటుంది. పెట్టుబ‌డి చేసేముందు కొన్ని ప్రాథ‌మిక విష‌యాల‌ను పాటించ‌డం ద్వారా న‌ష్టం రాకుండా నివారించ‌వ‌చ్చు.

అనువైన పెట్టుబ‌డి సాధ‌నం :

మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యానికి స‌రిపోయే పెట్టుబ‌డి సాధ‌నాన్ని ఎంచుకోవాలి.
త‌క్కువ న‌ష్ట భ‌యం ఉన్న వారు స్థిరాదాయ ప‌థ‌కాల్లో మ‌దుపుచేయ‌డం మంచిది. నష్టాన్ని త‌ట్టుకునే వారు ఈక్విటీ సంబంధిత ప‌థ‌కాల్లో మ‌దుపుచేయోచ్చు. స‌రైన పెట్టుబ‌డి మార్గాన్ని ఎంచుకోక‌పోతే న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

వ‌య‌సు :

పెట్టుబ‌డుల విష‌యంలో మ‌దుప‌ర్ల వ‌య‌సు చాలా ముఖ్య‌మైన‌ది. న‌ష్టాన్ని భ‌రించ‌గ‌ల సామ‌ర్థ్యం వ‌య‌సుతో ముడిప‌డి ఉంటుంది. యుక్త వ‌య‌సులో ఉండే వారు కొంచెం న‌ష్ట‌భ‌యం ఎక్కువున్న వాటిలో మ‌దుపుచేసినా ప‌ర‌వాలేదు. ఎందుకంటే ఒక వేళ న‌ష్టం వ‌చ్చినా తిరిగి స‌ంపాదించేందుకు వారికి అవ‌కాశం వ‌య‌సు ఉంటాయి. అదే ప‌ద‌వీవిర‌మ‌ణ పొందిన‌ వారు లేదా మ‌ధ్య‌వ‌య‌స్కులు న‌ష్ట‌భ‌యం త‌క్కువున్న సాధానాలు ఎంచుకోవ‌డం మంచిది. వీరికి న‌ష్టం వ‌స్తే తిరిగి సంపాదించుకునే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది.

కుటుంబ బాధ్యతలు :

మదుపుచేసే ముందు కుటుంబ ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. మ‌న‌పై ఆధార‌ప‌డే వారు ఉంటే కొత్త న‌ష్ట భ‌యం త‌క్కువ‌గా ఉన్న సాధ‌నాల‌ను ఎంచుకోవాలి. పెళ్లి కాక ముందు యువ‌కులుగా ఉన్న‌పుడు , ఆర్థిక అవ‌స‌ర‌రాలు త‌క్కువ‌గా ఉన్న‌పుడు కొంత న‌ష్ట‌భ‌యం క‌లిగిన‌పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపుచేసినా ప‌ర‌వాలేదు.

కాల‌వ్య‌వ‌ధి:

పెట్టుబడి లక్ష్యాలు,భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాన్ని సాధించే కాలవ్యవధి పెట్టుబడిదారుపై ప్రభావం చూపించే అంశాలు. కాలవ్యవధి ఎంత ఎక్కువగా ఉంటే అంత నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. పెట్టుబడుల్లోఒడిదుడుకులను సమన్వయపర్చుకోవచ్చు.

అవ‌గాహ‌న‌:

పెట్టుబ‌డి చేసే ముందు మదుప‌ర్ల‌కు ఆయా సాధ‌నాల‌పై అవ‌గాహ‌న చాలా అవ‌స‌రం. పెట్టుబ‌డుల పై స‌రైన అవ‌గాహ‌న ఉంటే స‌మ‌యానికి స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చు. దీంతో న‌ష్టం వ‌చ్చే సంద‌ర్భాల్లో స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly