యూనియ‌న్ ఫోక‌స్డ్ లార్జ్ క్యాప్ ఫండ్

యూనియ‌న్ ఫోక‌స్డ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఈక్విటీ వ‌ర్గానికి చెందిన ఒపెన్ ఎండెడ్ ప‌థ‌కం.

యూనియ‌న్ ఫోక‌స్డ్ లార్జ్ క్యాప్ ఫండ్

యూనియ‌న్ మ్యూచువ‌ల్ ఫండ్ ఏప్రిల్ 20,2017 యూనియ‌న్ ఫోక‌స్డ్ లార్జ్ క్యాప్ ఫండ్ కొత్త ఫండ్ ను ప్రారంభించ‌నుంది. ఫండ్ ఆఫ‌ర్ డాక్యుమెంటులో ఇచ్చిన వివ‌రాల ప్ర‌కారం ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డుల్లో మ‌దుపుచేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ ఫండ్ వివ‌రాలు చూస్తే

uflc.png

ఫండ్ గురించి క్లుప్తంగా

  • యూనియ‌న్ ఫోక‌స్డ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపుచేస్తుంది. ఇది ఈక్విటీ వ‌ర్గానికి చెందిన ఒపెన్ ఎండెడ్ ప‌థ‌కం.

  • ఈ ఫండ్ ప్ర‌త్యేకంగా లార్జ్ క్యాప్ కంపెనీల్లో క‌నీసం 80 శాతం పెట్టుబ‌డి చేస్తుంది. మార్కెట్లో లిస్ట‌యిన లార్జ్ క్యాప్ కంపెనీల‌లో 20 నుంచి 30 కంపెనీల‌ను ఎంచుకుని వాటిలో పెట్టుబ‌డి చేస్తుంది.

  • నిక‌ర ఆస్తుల్లో 50శాతం వ‌ర‌కూ డెరివేటివ్ల‌లో మ‌దుపుచేసే అవ‌కాశం ఉంది. దీర్ఘ‌కాలంపాటు పెట్టుబ‌డి చేసే మ‌దుప‌ర్ల‌కు ఇవి అనుకూలం.

  • ఈక్విటీలో 80-100శాతం, డెట్ , మ‌నీ మార్కెట్ సాధానాల్లో 0-20 శాతం పెట్టుబ‌డులు చేస్తుంది. న‌ష్ట‌భ‌యం ఒక మోస్త‌రు కంటే ఎక్కువ‌గానే ఉంటుంది.

  • ఈక్విటీ పెట్టుబ‌డులు ఎక్కువ భాగం ఉండ‌టంతో న‌ష్ట‌భ‌యం కొంత అధికంగా ఉంటుంది.

  • ఈ ఫండ్లో డైరెక్టు ప్లాన్, రెగ్యూల‌ర్ ప్లాన్ , గ్రోత్ ,డివిడెండు ఆప్ష‌న్లు అందుబాటులో ఉంటాయి. క‌నీస పెట్టుబ‌డి రూ.5000 . అయితే సిప్ ద్వారా పెట్టుబ‌డి చేయాలంటే నెల వారీ రూ.2000, త్రైమాసికానికి రూ. 5000 చేయాలి. క‌నీసం ఉప‌సంహ‌రించాల్సిన మొత్తం రూ.1000 గా నిర్ణ‌యించారు.

  • ఎస్ అండ్ పీ బీఎస్ఈ 100సూచీని బెంచ్ మార్క్ గా తీసుకున్నారు.

ఇత‌ర వివ‌రాల‌కు www.unionmf .com

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly