ఉద్యోగులకు సెక్ష‌న్ 10 ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

సెక్ష‌న్ 10 ప్ర‌యోజ‌నాల గురించి స‌మ‌గ్రంగా తెలుసుకుందాం

ఉద్యోగులకు సెక్ష‌న్ 10 ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

సెక్ష‌న్ 10 అనేక ర‌కాల ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అయితే వీటిని చాలా మంది తెలిసో తెలియ‌కో అంతగా ప‌ట్టించుకోరు. వీటిలో కొన్నింటిని చూద్దాం…

 1. వేత‌నంతో కూడిన ప్ర‌యాణ‌ భ‌త్యం.
  వేత‌నంతో కూడిన ప్ర‌యాణ భ‌త్యం లేదా లీవ్ ట్రావెల్ అల‌వెన్స్‌(ఎల్‌టీఏ)ను చాలా సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు అందిస్తాయి. 4ఏళ్ల కాలంలో 2 సార్లు దీన్ని పొందొచ్చు.

 2. గ్రాట్యుటీ
  ప్ర‌భుత్వ ఉద్యోగి అందుకునే గ్రాట్యుటీకి పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఇత‌రుల‌కు ప‌న్ను మిన‌హాయింపు ఇలా వ‌స్తుంది.

 • ఏడాదిలో 15 రోజుల‌కు స‌మాన‌మైన వేత‌నానికి… స‌ర్వీసు కాలంలో ఎన్ని ఏళ్లు ఉద్యోగంలో ఉంటే అంత‌కు స‌మానం.
 • రూ.20ల‌క్ష‌ల గ్రాట్యుటీపైన‌… ఈ రెండింటిలో ఏది త‌క్కువైతే దానికి
 1. సెల‌వుల ఎన్‌క్యాష్‌మెంట్ ద్వారా…

ప్ర‌భుత్వ ఉద్యోగి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందితే లేదా ఉద్యోగం మానేసిన‌ప్పుడు సెల‌వుల‌ను ఎన్ క్యాష్ చేసున్న సొమ్మంతా సెక్ష‌న్ 10 కింద ప‌న్ను మిన‌హాయింపున‌కు అర్హ‌త సాధిస్తుంది.

ఇత‌రుల‌కు కింద పేర్కొన్న‌దాంట్లో ఏది త‌క్కువ‌గా ఉంటే అది వ‌ర్తిస్తుంది.

 • ఆర్జిత సెల‌వులు * స‌రాస‌రి నెల వేత‌నం
 • స‌రాస‌రి నెల వేత‌నం * 10
 • రూ.3ల‌క్ష‌లు
 • ఆర్జిత సెల‌వుల ద్వారా వాస్త‌వ ఆదాయం
 1. ఇంటి అద్దె భ‌త్యం

ఇంటి అద్దె భ‌త్యం ద్వారా ఈ కింద పేర్కొన్న దాంట్లో ఏది తక్కువ‌గా ఉంటే అది ప‌న్ను మిన‌హాయింపున‌కు అర్హ‌త సాధిస్తుంది.

 • హెచ్ఆర్ఏగా పొందిన మొత్తం
 • చెల్లించిన అద్దె నుంచి 10శాతం మూల‌వేత‌నం తీసివేయ‌గా వ‌చ్చే మొత్తం.
 • ఢిల్లీ, ముంబ‌యి, కోల్‌క‌తా, చెన్నైల‌లో నివసించేవారికి మూల‌వేతనంలో 50శాతం, ఇత‌ర ప్రాంతాల్లో ఉండేవారికి 40శాతం హెచ్ఆర్ఏ.
 1. జీవిత బీమా చెల్లింపులు

జీవిత బీమా కోసం చేసిన చెల్లింపుల‌న్నీ సెక్ష‌న్ 10(10D) కింద ప‌న్ను మిన‌హాయింపున‌కు అర్హ‌త సాధిస్తాయి. మెచ్యూరిటీ సొమ్ముతో పాటు పాల‌సీదారు చ‌నిపోయాక అందించే ప‌రిహారమూ దీని కింద‌కే వ‌స్తుంది.

 1. పింఛ‌ను
  ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌చ్చే పింఛ‌నుపై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఇత‌రుల‌కు కింది పేర్కొన్న దాంట్లో ఏది త‌క్కువ‌గా ఉంటే అది వ‌ర్తిస్తుంది.
 • గ్రాట్యుటీ ల‌భిస్తే… అందుకున్న పింఛ‌నులో మూడో వంతు దాకా ప‌న్ను మిన‌హాయింపున‌కు అర్హ‌త పొంద‌గ‌లం.
 • గ్రాట్యుటీ ల‌భించ‌క‌పోతే… పింఛ‌నులో స‌గానికి ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.
 1. డివిడెండ్లు
  మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో లేదా షేర్ల‌కు సంస్థలు డివిడెండ్లు ప్ర‌క‌టిస్తుంటాయి. ఇవి అందుకునే వ్య‌క్తులకు పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

 2. వ్య‌వ‌సాయ ఆదాయం
  వ్య‌వ‌సాయం ద్వారా ల‌భించే ఆదాయానికి పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఒక వేళ ఇదొక్క‌టే ఆదాయ వ‌న‌రు అయితే ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంది. లేదా దీన్ని ఇత‌ర ఆదాయాల కింద ప‌రిగ‌ణించి ప‌న్ను వ‌ర్తింప‌జేస్తారు.

 3. ఇత‌ర భ‌త్యాలు

పైన పేర్కొన్న‌వి కాకుండా ప్ర‌యాణానికి, స‌హాయ‌కులను నియ‌మించుకున్నందుకు, క‌న్వేయ‌న్స్‌, యూనిఫారమ్ లాంటి ప్ర‌యోజ‌నాల‌న్నింటికీ సెక్ష‌న్ 10 కింద ప‌రిమితి మేర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly