మ‌దుప‌ర్ల‌కు అనుకూలంగా విభిన్న‌ ఈటీఎఫ్‌లు

ఈటీఎఫ్‌ ల‌కు ఉన్న ప్ర‌త్యేక‌త ఏంటంటే ఇవి మ్యూచువ‌ల్ ఫండ్లలా, షేర్ల‌లాగా రెండింటిలా ప‌నిచేసే పెట్టుబ‌డి సాధ‌నం.

మ‌దుప‌ర్ల‌కు అనుకూలంగా విభిన్న‌ ఈటీఎఫ్‌లు

ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) విభాగంలో వివిధ‌ అసెట్ కేట‌గిరీల‌కు చెందిన ఈటీఎఫ్ లు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ గోల్డ్ ఈటీఎఫ్ ల‌కే మ‌న దేశంలో ఆద‌ర‌ణ ఎక్కువ‌. ఈ నేప‌థ్యంలో ఈటీఎఫ్‌ అందుబాటులో ఉన్నపెట్టుబ‌డి వ‌ర్గాల‌ (అసెట్ క్లాస్) గురించి తెలుసుకుందాం.ఈటీఎఫ్‌ ల‌కు ఉన్న ప్ర‌త్యేక‌త ఏంటంటే ఇవి మ్యూచువ‌ల్ ఫండ్లలా, షేర్ల‌లాగా రెండింటిలా ప‌నిచేసే పెట్టుబ‌డి సాధ‌నం. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) లు ఎక్స్చేంజీలో లిస్ట‌యి ఉంటాయి. ఎక్స్చేంజీ ద్వారా మార్కెట్లో యూనిట్ల‌ను కొన‌డం అమ్మ‌డం చేయోచ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌లా నేరుగా ఫండ్ సంస్థ నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. మ‌న దేశంలో మొద‌టి ఈటీఎఫ్ - నిఫ్టీ బీస్ జ‌న‌వ‌రి 2002 లో ప్రారంభ‌మైంది. నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీ బెంచ్ మార్క్ఎక్స్చేంజ్ ట్రేడెడ్ స్కీమ్‌. ఇది నీఫ్టీ 50 ఆధారిత‌మైంది. నిఫ్టీ బీస్ నిఫ్టీ సూచీలో ఉన్న అన్ని స్టాక్ ల‌లో పెట్టుబ‌డిచేస్తుంది. అంటే నిఫ్టీ బీస్ లో పెట్టుబ‌డి చేసిన మ‌దుప‌రి 50 కంపెనీల‌ షేర్ల‌లో మ‌దుపుచేసిన‌ట్టు అవుతుంది. పెట్టుబ‌డికి కావ‌ల్సిన వైవిధ్య‌త ఈటీఎఫ్ ల ద్వారా క‌లుగుతుంది. నిఫ్టీసూచీలో ఉన్న 50 స్టాక్ ల ప‌రిమాణం వేర్వేరు శాతాల్లో ఉంటుంది. ఇండెక్ప్ మొత్తం వంద శాతంలో ఒక్కో కంపెనీ కొంత శాతం చొప్పున ప‌రిమాణం ఉంటుంది. ఈక్విటీ ఈటీఎఫ్ (నిఫ్టీ బీస్‌) స‌మీక‌రించిన నిధుల‌ను నిఫ్టీ సూచీలో ఉన్న కంపెనీల షేర్ల‌లో పెట్టుబ‌డి చేస్తారు.

వీటిని మార్కెట్లో అందుబాటులో ఉన్న ధ‌ర‌కు యూనిట్ల‌ను ఎక్స్చేంజీ ద్వారా మార్కెట్లో మ‌దుప‌ర్లు కొన‌డం అమ్మ‌డం చేయోచ్చు.మ్యూచువ‌ల్ ఫండ్లకు వ‌ర్తించే ప‌న్నువిధానమే ఈటీఎఫ్ ల‌కు వ‌ర్తిస్తుంది. ఈటీఎఫ్ లు సూచీల‌ను అనుక‌రించి పెట్టుబ‌డి చేయ‌డంతో ఫండ్‌ నిర్వ‌హ‌ణ వ్యయం త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో ఈటీఎఫ్ లో పెట్టుబ‌డి చేసే మ‌దుప‌ర్ల‌కు ఛార్జీలు త‌క్కువగా ఉంటాయి.

నిర్దిష్ట రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబ‌డి చేయాల‌నుకునేవారు ఆ రంగంలో పెట్టుబ‌డి చేసే ఈటీఎఫ్‌లు ఎంచుకోవ‌చ్చు. వాటిని సెక్టార్ ఈటీఎఫ్ లు అంటారు. ఉదాహ‌ర‌ణకు ఇన్ ఫ్రా బీస్ ఇన్‌ఫ్రా రంగంలో ఉన్న‌ కంపెనీల్లో పెట్టుబ‌డి చేస్తారు

ఈటీఎఫ్‌ల్లో ర‌కాలు: ఈటీఎఫ్‌లు ఈక్విటీ, డెట్, బంగారం, ప్ర‌పంచ‌మార్కెట్ సూచీల ఆధారంగా మ‌దుపుచేస్తుంటాయి. ప్ర‌స్తుతం మార్కెట్లో వివిధ పెట్టుబ‌డి వ‌ర్గాల‌కు చెందిన ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. BANKBEES, NIFTYBEES, SETFBSE100 , N100 మొద‌లైన‌వి.

ఈక్విటీ ఈటీఎఫ్‌: ఈక్విటీ ఈటీఎఫ్‌లో పెట్టుబ‌డి చేయడం ద్వారా సూచీలో ఉన్న అన్ని స్టాక్ ల‌లో పెట్టుబ‌డి చేసే అవ‌కాశం ఉంటుంది.
ఉదాహ‌ర‌ణ‌కు నిఫ్టీఈటీఎఫ్‌ లో పెట్టుబ‌డి చేయడం ద్వారా నిఫ్టీ సూచీలో ఉన్న 50 స్టాక్ ల‌లో మ‌దుపు చేసిన‌ట్ల‌వుతుంది…
ప్రాధ‌న్య‌త ప‌రంగా ఆయా కంపెనీల షేర్ల‌కు సూచీలో వెయిటేజీ ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌: SBI ETF NIFTY

వ‌ర‌ల్డ్ ఇండీసెస్: ప్ర‌పంచంలో వివిధ సూచీల ఆధారంగా నిర్వ‌హించే ఈటీఎఫ్‌లు పెట్టుబ‌డులను ఆయా మార్కెట్లలో చేస్తారు. ఎస్ అండ్ పీ, నాస్‌డాక్ మొద‌లైన‌వి.ఆయా మార్కెట్ సూచీల ఆధారంగా మ‌న ఫండ్ ఎన్ఏవీ ఉంటుంది.ఈటీఎఫ్ లద్వారా మ‌నదేశంలోనే కాక ఇత‌ర దేశాల్లో ఉన్నకంపెనీల్లో పెట్టుబ‌డి చేయొచ్చు .ఉదాహ‌ర‌ణ‌: MOSt Shares NASDAQ 100

గోల్డ్ ఈటీఎఫ్‌: బంగారం పై మ‌దుపు చేయాల‌నుకునేవారికి గోల్డ్ ఈటీఎఫ్ .ఈ ఫండ్‌లో స‌మీక‌రించిన నిధుల‌ను బంగారం పై మ‌దుపు చేస్తారు. అంటే బంగారం ధ‌ర పై మ‌న ఫండ్ ఎన్ఏవీ ఆధారప‌డిఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌: Axis Gold ETF

డెట్ ఈటీఎఫ్‌: స్థిరాదాయ పెట్టుబ‌డి సాధ‌నాల్లో (బాండ్లు, డిబెంచ‌ర్లు త‌దిత‌రాలు) మ‌దుపుచేసే వాటిని పెట్టుబ‌డి చేసే వాటిని డెట్ ఈటీఎఫ్ లు అంటారు. ఉదాహ‌ర‌ణ‌: LICGsecETF

ఈటీఎఫ్ ల‌లో వివిధ ర‌కాల కేట‌గిరీల‌కు చెందిన ఫండ్లు అందుబాటులో ఉండ‌టం వ‌ల్ల మ‌దుప‌ర్లు వారి వారి ఆస‌క్తి , ఆర్ధిక ల‌క్ష్యాలు, ప్ర‌ణాళిక‌లకు అనుగుణంగా ఈటీఎఫ్ ల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. అయితే మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి చేసే ముందు సంబంధిత ఆఫ‌ర్ డాక్యుమెంటును క్షుణ్ణంగా చ‌దివి ప‌న్నువిధానం అర్థం చేసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly