హెచ్‌డీఎఫ్‌సీ, వాల్‌మార్ట్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌

‘బెస్ట్‌ ప్రైస్‌’ స‌భ్యులు ఆన్‌లైన్‌లోనూ, స్టోర్స్‌లో కూడా ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లింపులు చేయ‌వ‌చ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ, వాల్‌మార్ట్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌

వాల్‌మార్ట్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భాగ‌స్వామ్యంతో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును సోమ‌వారం ప్ర‌వేశ‌పెట్టింది. ప్ర‌త్యేకించి ‘బెస్ట్‌ ప్రైస్‌’ స‌భ్యుల కోసం ఈ కార్డు స‌ర్వీసుల‌ను అందిస్తున్నారు. బెస్ట్ ప్రైస్ మోడ్ర‌న్ హోల్‌సేల్ “బీ2బీ క్యాష్‌ & క్యారీ” దుకాణాల స‌భ్యులకు ఈ కార్డు ద్వారా 50 రోజుల వరకు ఉచిత క్రెడిట్‌ను అందిస్తోంది.

వాల్‌మార్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈఓ క్రిష్‌ అయ్యర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేమెంట్స్‌ బిజినెస్ అండ్ మార్కెటింగ్‌ అధిపతి పరాగ్‌ రావు క‌లిసి హైద‌రాబాద్ బెస్ట్‌ప్రైస్‌ స్టోర్‌లో ఈ కార్డును ఆవిష్క‌రించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న 26 బెస్ట్‌ ప్రైస్‌ స్టోర్లలో కూడా దీన్ని ఇదే రోజు ప్రవేశపెట్టారు.

కిర‌ణా విభాగంలో కార్డును విడుద‌ల చేయడం ఇదే తొలిసారి. అందువ‌ల్ల బెస్ట్ ప్రైస్‌లో స‌భ్య‌త్వం ఉన్న వ్యాపారులు ఎలాంటి మూల‌ధ‌న అవ‌స‌రం లేకుండా క్రెడిట్ సౌక‌ర్యంతో వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. 18 నుంచి 50 రోజుల ఉచిత క్రెడిట్ స‌దుపాయాన్ని అందిస్తున్నందున మా స‌భ్యుల‌కు లాభం చేకూరుతుంద‌ని అయ్య‌ర్‌ తెలిపారు. ఈ కార్డు రెండు ర‌కాలుగా ల‌భిస్తుంద‌ని ఏడాదికి రూ.500, రూ.1000 ఫీజును వ‌సూలు చేస్తున్నామ‌న్నారు. ఇది అధికంగా వినియోగించిన వారికి న‌గ‌దు వెన‌క్కి రూపంలో తిరిగి వ‌స్తుంద‌ని తెలిపారు. సిబిల్ రేటింగ్ ఉన్న వారితో పాటు, లేని వారికీ కొన్ని ప‌రిమితుల మేర‌కు క్రెడిట్ కార్డుల‌ను అందిస్తున్న‌ట్లు చెప్పారు. స్టోర్ల‌తో పాటు, బెస్ట్‌ప్రైస్ ఆన్‌లైన్ సైటులోనూ కార్డును ఉప‌యోగించి కొనుగోళ్ళు చేయ‌వ‌చ్చ‌ని, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆయా స్టోర్ల‌లో ఈ కార్డు కోసం ప్ర‌త్యేక ఏర్పాటు చేసింద‌ని తెలిపారు.

దేశ‌వ్యాప్తంగా మ‌రిన్ని స్టోర్ల‌ను ప్రారంభించాల‌ని వాల్‌మార్ట్ భావిస్తున్న‌ట్లు అయ్య‌ర్ వెల్ల‌డించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌ర్నూలులో త్వ‌ర‌లోనే స్టోరును ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly