మంచి క్రెడిట్ స్కోర్ ను పొందాలని భావిస్తున్నారా?

వాస్తవానికి క్రెడిట్ కార్డు లో బ్యాలన్స్ ను నిర్వహించడం వలన మీ క్రెడిట్ స్కోర్ పెరగదు

మంచి క్రెడిట్ స్కోర్ ను పొందాలని భావిస్తున్నారా?

క్రెడిట్ కార్డు వినియోగదారులు క్రెడిట్ స్కోరు గురించి ఆందోళన చెందడం సహజం. creditcards.com అనే సంస్థ విడుదల చేసిన అధ్యయనం ప్రకారం, ఐదుగురు క్రెడిట్ కార్డు వినియోగదారులలో ఒకరికంటే ఎక్కువ మంది క్రెడిట్ కార్డులో ఎక్కువ బ్యాలన్స్ ను నిర్వహించడం ద్వారా క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకోవచ్చునని భావిస్తున్నట్లు తెలిపింది. కానీ క్రెడిట్ కార్డులో ఎక్కువ బ్యాలన్స్ ను నిర్వహించడం ఒక్కటే క్రెడిట్ స్కోర్ మెరుగుపడడానికి కారణం కాదు. ఇలా చేయడం ద్వారా మంచి కంటే ఎక్కువ హాని కలిగే అవకాశం ఉంది. చెల్లింపు గడువు తేదీ ముగిసిన తరువాత కూడా బ్యాలన్స్ చెల్లించకపోవడం కారణంగా క్రెడిట్ కార్డు వినియోగదారులు అనవసరమైన వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డులో ఎక్కువ బ్యాలన్స్ ఉన్నట్లయితే, క్రెడిట్ కార్డు వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇది వారి క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావితం చూపవచ్చు. 28 శాతం మంది యవ్వనస్తులు, 25 శాతం మంది మధ్య వయస్సు వారు, అలాగే 16 శాతం మంది వృద్దులు క్రెడిట్ కార్డు విషయంలో ఇలాంటి పొరపాట్లనే చేసినట్లు తెలిపారు.

మార్కెట్ పరిశోధన సంస్థ జీఎఫ్కే ద్వారా ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ creditcards.com కోసం ఈ సర్వేని నిర్వహించారు. ఈ సంస్థ గత నెల 18 సంవత్సరాలు అంత కంటే ఎక్కువ వయస్సున్న 1,000 మంది అమెరికన్ల నుంచి సమాచారాన్ని సేకరించింది.

వాస్తవానికి క్రెడిట్ కార్డు లో బ్యాలన్స్ ను నిర్వహించడం వలన మీ క్రెడిట్ స్కోర్ పెరగదని creditcards.com సీనియర్ ఇండస్ట్రీ విశ్లేషకుడు మ్యాట్ షుల్జ్ తెలిపారు. వినియోగదారులు తమ క్రెడిట్ కార్డు బిల్లులను ప్రతి నెలలో పూర్తిగా, మరీ ముఖ్యంగా సమయానికల్లా చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్ ను పెంచుకునే అవకాశం ఉంటుందని మ్యాట్ తెలిపారు.

తక్కువ సంపాదన కలిగిన వారు, చదువు లేని వారు కూడా ఇలాంటి దురభిప్రాయానికి గురవుతున్నారు. సంవత్సరానికి 50 వేల డాలర్ల మేరకు క్రెడిట్ కార్డు వినియోగిస్తున్న 30 శాతం మంది బ్యాలన్స్ ను నిర్వహించడం ద్వారా తమ క్రెడిట్ స్కోర్లను మెరుగుపర్చుకోడానికి ప్రయత్నించారు.

చాలామంది అమెరికన్లు తమ క్రెడిట్ కార్డు బిల్లులను సమయాని కల్లా చెల్లించడానికి కష్టపడుతున్నారు. 42 శాతం మంది వినియోగదారులు ఆలస్యంగా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే 10 శాతం మంది వినియోగదారులు క్రెడిట్ కార్డు చెల్లింపుల తాలూకా ఆలస్య రుసుమును 5 కంటే ఎక్కువ సార్లు చెల్లించినట్లు తెలిపారు.

అలాగే సగం కంటే ఎక్కువ మంది యవ్వనస్తులు వారి దగ్గర తగినంత డబ్బు లేకపోవడంతో ఆలస్యంగా క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించినట్లు తెలిపారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly