ఎన్నిక‌ల బాండ్ల క‌థే వేరు..

ప్ర‌భుత్వం జారీ చేసే వివిధ ర‌కాల బాండ్లు వివిధ ర‌కాలైతే.. ఎన్నిక‌ల బాండ్లు మ‌రో ర‌కం

ఎన్నిక‌ల బాండ్ల క‌థే వేరు..

మార్చి 1 నుంచి 10 వ‌ర‌కూ ఎన్నిక‌ల బాండ్లు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల బాండ్లంటే ఏంటి? రాబ‌డి ఉంటుందా? లేదా ?త‌దిత‌ర విష‌యాల‌ను ఇప్ప‌డు తెలుసుకుందాం.

సాధార‌ణ బాండ్ల‌లో మ‌దుప‌ర్లు కొంత పెట్టుబ‌డి చేస్తే వ‌డ్డీ ఆదాయం, మెచ్యూరిటీ ముగిశాక అస‌లు అంద‌డం, క్రెడిట్ రేటింగ్, విశ్వ‌స‌నీయ‌త‌, ముఖ విలువ, కూప‌న్ రేటు మొద‌లైన‌వి కీలకాంశాలు. ఇక్క‌డ రాబ‌డి పొంద‌డం ప్ర‌ధానం. కానీ ఎన్నిక‌ల బాండ్ల క‌థే వేరు…ఇక్క‌డ రాబ‌డి ఉండ‌దు ఒక రాజ‌కీయ పార్టీల‌కు ఇచ్చే విరాళంగా మాత్ర‌మే ప‌రిగ‌ణించాలి.

ఎన్నిక‌ల బాండ్లు అంటే

  • ఎన్నిక‌ల బాండ్ అంటే దేశంలో ఉన్న వివిధ రాజ‌కీయ పార్టీలకు నిధులు అందించాల‌నుకునే వారు ఈ బాండ్ల ద్వారా ఇవ్వ‌వ‌చ్చు. వీటిని తిరిగి చెల్లింపులు లేని బాండ్లుగా చెప్పొచ్చు. దీన్ని విరాళంగా ప‌రిగ‌ణించాలి త‌ప్ప‌ రాబ‌డి కోసం చేసే పెట్టుబ‌డి కాద‌ని గ‌మ‌నించాలి.

  • గ‌తంలో విరాళాల రూపంలో వ‌స్తుండేవి. ఇప్ప‌డు దానికి పార‌ద‌ర్శ‌క‌త క‌ల్పించే ఉద్దేశంతో ఈ ఎల‌క్ట‌రోల్ బాండ్ల‌ను తీసుకొచ్చింది ప్ర‌భుత్వం. ఈ మార్గంలో రాజ‌కీయ పార్టీల‌కు వ‌చ్చే నిధుల లెక్క స్ప‌ష్టంగా ఉంటుంది. ప్ర‌స్తుతం మ‌న రాజ‌కీయ‌ పార్టీల‌కు వ‌చ్చే విరాళాల్లో సింహ‌భాగం ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయో తెలియ‌దు.

వీటి ప్ర‌ధాన ఉద్దేశం ఏంటంటే

వివిధ రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు విరాళాలు ఇవ్వాల‌నుకుంటే ఈ ప‌ద్ద‌తి ద్వారా అందించ‌వ‌చ్చు.ఎన్నిక‌ల సంఘం ఆమోదించిన ఖాతా ద్వారా మాత్ర‌మే నిధులు ఆయా రాజ‌కీయ పార్టీలు తీసుకునే వీలుంటుంది. కాబ‌ట్టి పార‌ద‌ర్శ‌క‌త‌ పెరుగుతుంది.

ఎవ‌రు అర్హులు

  • పీపుల్స్ రిప్రజంటేష‌న్ యాక్ట్ 1951 సెక్ష‌న్ 29ఏ ప్ర‌కారం సాధార‌ణ ఎన్నిక‌ల్లో పోటీచేసిన పార్టీలు.

  • అయితే క‌నీసం 1 శాతం ఓట్లు సాధించిన రాజ‌కీయ పార్టీల‌కు ఈ బాండ్ల ద్వారా నిధులు పొందే అవ‌కాశం ఉంటుంది.

వీటిని కొనాల‌నుకునేవారు

  • భార‌తీయ పౌర‌స‌త్తం ఉన్న వ్య‌క్తులు,హిందూ అభివాజ్య కుటుంబాలు, సంస్థ‌లు,చారిట‌బుల్ ట్ర‌స్టులు త‌దిత‌రులుప్ర‌భుత్వం నిర్ణ‌యించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీల్లోల‌భిస్తాయి.

  • ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన బ్యాంకు బ్రాంచీలను సంప్ర‌దించి ద‌ర‌ఖాస్తు నింపి డీడీ లేదా ఎల‌క్ట్రానిక్ రూపంలో జ‌మ‌చేయాలి.అనంత‌రం బ్యాంకు జారీ చేసే బాండు ప‌త్రాన్నిత‌మ‌కు న‌చ్చిన ఏదైనా రాజ‌కీయ పార్టీకి అందించాలి

  • ముఖ విలువ రూ.వేయి, ప‌దివేలు, ల‌క్ష‌,ప‌దిల‌క్ష‌లు,కోటి వ‌ర‌కూ ఉంటుంది. గ‌రిష్టంగా ఇంతని ప‌రిమితి లేదు

  • వీటి కాల‌ప‌రిమితిని 15 రోజులుగా నిర్ణ‌యించారు. రాజ‌కీయ పార్టీలు 15 రోజుల్లోగా వాటిని న‌గ‌దు రూపంలోకి మార్చుకోవాలి.

ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన వివ‌రాలు ఇలా

electrol bonds..png

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly