సీపీఐ అంటే ఏంటి?

రిటైల్ మార్కెట్ లో నిత్యావ‌స‌ర వ‌స్తువ‌ల ధ‌ర‌ల్లో వ‌చ్చే మార్పుల‌ను తెలిపే సీపీఐని కేంద్ర గ‌ణాంకాల కార్యాల‌యం (సీఎస్ఓ) ప్ర‌తీ నెలా విడుద‌ల చేస్తుంది.

సీపీఐ అంటే ఏంటి?

రిటైల్ మార్కెట్ లో నిత్యావ‌స‌ర వ‌స్తువ‌ల ధ‌ర‌ల్లో వ‌చ్చే మార్పుల‌ను తెలిపే సూచీ వినియోగ‌దారుల ధ‌ర‌ల సూచీ (సీపీఐ). కొన్ని వ‌స్తువ‌ల బాస్కెట్ ను తీసుకుని వాటిలో వ‌చ్చే రిటైల్ ధ‌ర‌ల్లో మార్పుల‌ను న‌మోదు చేస్తుంది. దేశ వ్యాప్తంగా , గ్రామీణ‌, ప‌ట్ట‌ణ రెండింటికి వేర్వేరుగా కూడా న‌మోదు చేస్తారు.

ఈ సూచీని గ‌ణించేందుకు తీసుకునే వ‌స్తువ‌ల బాస్కెట్‌లో ఒక్కో వ‌స్తువుకి ఒక్కో వెయిటేజీ ఉంటుంది. ఈ వెయిటేజీ లో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు వ్య‌త్యాసం ఉంటుంది. ఉదాహ‌ర‌ణకు ఫుడ్, బేవ‌రేజీస్ కేట‌గిరీ గ్రామీణ సీపీఐ వెయిటేజీ 54.18శాతం ప‌ట్ట‌ణ సీపీఐ 36.29 శాతం ఉంటుంది.

ఈ సూచీలో వ‌చ్చే మార్పునే ద్ర‌వ్యోల్బ‌ణం అంటారు. చాలా దేశాల్లో సీపీఐ సూచీని ద్ర‌వ్యోల్బ‌ణ తెలుస‌కునేందుకు వినియోగిస్తున్నారు. రిజ‌ర్వు బ్యాంకు దీని ఆధారంగా విధాన నిర్ణ‌యాలు తీసుకుంటుంది. రిజ‌ర్వుబ్యాంకు ద్ర‌వ్యోల్బ‌ణం 2 శాతం నుంచి 6 శాతం మ‌ధ్య‌ ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటుంది. ప‌్ర‌భుత్వం, రిజ‌ర్వు బ్యాంకు సీపీఐ ని ఎందుకు నిరంత‌రం ప‌రిశీలిస్తూ ఉంటాయి. దీన్ని కేంద్ర గ‌ణాంకాల కార్యాల‌యం( సీఎస్ఓ) ప్ర‌తీనెలా విడుద‌ల చేస్తుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly