ఈ-మ్యాండేట్ అంటే ఏమిటి?

ఈ-మ్యాండేట్ ను డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించి సెట్ అప్ చేయవచ్చు

ఈ-మ్యాండేట్ అంటే ఏమిటి?

మీరు ప్రతి నెలా యుటిలిటీ బిల్లులను చెల్లించడం, పెట్టుబడులు పెట్టడం చేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ ఆటోమేటిక్ గా ఉన్నట్లయితే, మరింత సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ-మ్యాండేట్ సిస్టంను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ-మ్యాండేట్ అనేది డెస్టినేషన్ బ్యాంక్ నుంచి స్పాన్సర్ బ్యాంకుకు లేదా కార్పొరేట్ల నుంచి డెస్టినేషన్ బ్యాంకుకు వారి స్పాన్సర్ బ్యాంకు ద్వారా అందించడం జరుగుతుంది. చెల్లింపు, సేకరణ కోసం ఈ-మ్యాండేట్ ఉపయోగపడుతుంది. ఈ-మ్యాండేట్ ను డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించి సెట్ అప్ చేయవచ్చునని కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ దీపక్ శర్మ తెలిపారు.

ఇది ఎలా పని చేస్తుంది?

మీరు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవటానికి, మీ బ్యాంక్ ఈ-మ్యాండేట్ ఆప్షన్ ను కలిగి ఉండాలి. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, యస్ బ్యాంక్ లిమిటెడ్, ఐడీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ తో సహా 10 బ్యాంకులు ఈ-మ్యాండేట్ ఆప్షన్ ను కలిగి ఉన్నాయి. ఇవి నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ-మ్యాండేట్ తో అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం ప్రధాన బ్యాంకులు ధృవీకరణ దశలో ఉండగా, ఈజీట్యాప్ మొబైల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫార్చ్యూన్ ఇంటిగ్రేటెడ్ అసెట్స్ ఫైనాన్స్ లిమిటెడ్, ఫుల్లెర్ట్రాన్ ఇండియా క్రెడిట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇన్ క్రెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు ఈ-మ్యాండేట్ లో అందుబాటులో ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్, కార్డుపై ఈ-మ్యాండేట్ ను ఎనేబుల్ చేయడానికి, కచ్చితంగా రెండు కూడా యాక్టీవ్ లో ఉండాలి.

ఈ-మ్యాండేట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే, వినియోగదారులు బిల్లు చెల్లించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొందరు వ్యాపారులకు మాత్రమే ఎన్పీసీఐ ఈ-మ్యాండేట్ ను ఉపయోగించడానికి అనుమతించింది.
ఈ-కామర్స్ ఇందులో భాగం కాదు, కానీ బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్ హౌసెస్, ఫిన్ టెక్ కంపెనీలు, యుటిలిటీ సర్వీస్ ప్రొవైడర్లు దీనిని ఎనేబుల్ చేయవచ్చునని శర్మ తెలిపారు. ఆర్థిక చెల్లింపులను సులభతరం చేయడమే ఈ-మ్యాండేట్ ప్రధాన ఉద్దేశం. ఈ సేవను వినియోగించుకుంటున్నందుకు గాను ఎన్పీసీఐ కొంత రుసుమును వసూలు చేస్తుంది. ఇది సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, అన్ని చెల్లింపు అవసరాలను తీర్చడానికి మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ను నిర్వహించాల్సి ఉంటుంది.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly